మా క్రికెటర్లను ఇండియా బెదిరించడంలేదు…

  కొలంబో: గత కొంత కాలంగా పాకిస్తాన్ వచ్చి ఆడాలని శ్రీలంకను పాక్ బోర్డు కోరుతుంది. సెప్టెంబర్ లో పాక్‌లో శ్రీలంక పర్యటించాలి. షెడ్యూల్ ప్రకారం పాక్-శ్రీలంక మధ్య సెప్టెంబర్ 27న తొలి వన్డే ఉంది. పాక్‌ తీవ్రవాదులతో ముప్పు ఉన్న సందర్భంగా శ్రీలంక ఆటగాళ్లు ఆదేశంలో పర్యటించబోమని స్పష్టం చేశారు. దీంతో పాక్ మంత్రి ఇండియాపై విమర్శలు గుప్పించారు. శ్రీలంక ఆటగాళ్లను ఇండియా బ్లాక్ మెయిల్‌కు పాల్పడుతోందని పాక్ మంత్రి ఫవాద్ హుస్సేన్ చౌదరి తెలిపాడు. […] The post మా క్రికెటర్లను ఇండియా బెదిరించడంలేదు… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

కొలంబో: గత కొంత కాలంగా పాకిస్తాన్ వచ్చి ఆడాలని శ్రీలంకను పాక్ బోర్డు కోరుతుంది. సెప్టెంబర్ లో పాక్‌లో శ్రీలంక పర్యటించాలి. షెడ్యూల్ ప్రకారం పాక్-శ్రీలంక మధ్య సెప్టెంబర్ 27న తొలి వన్డే ఉంది. పాక్‌ తీవ్రవాదులతో ముప్పు ఉన్న సందర్భంగా శ్రీలంక ఆటగాళ్లు ఆదేశంలో పర్యటించబోమని స్పష్టం చేశారు. దీంతో పాక్ మంత్రి ఇండియాపై విమర్శలు గుప్పించారు. శ్రీలంక ఆటగాళ్లను ఇండియా బ్లాక్ మెయిల్‌కు పాల్పడుతోందని పాక్ మంత్రి ఫవాద్ హుస్సేన్ చౌదరి తెలిపాడు. ఐపిఎల్ ల్లో ఆడనివ్వబోమని లంక ఆటగాళ్లకు బిసిసిఐ హెచ్చరికలు జారీ చేయడంతో లంక ఆటగాళ్లు పాక్‌లో పర్యటించడంలేదని ఆరోపణలు చేశాడు. ఈ వార్తను శ్రీలంక మంత్రి హరిన్ ఫెర్నాండో ఖండించారు. తాము తీసుకున్న నిర్ణయంలో భారత ప్రమేయం లేదని వెల్లడించారు. ఇండియా బ్లాక్ మెయిల్ వార్తలు అబద్ధమని పేర్కొన్నారు. పాక్‌లో పర్యటించడం మలింగతో పాటు లంక జట్టు సభ్యులకు ఇష్టం లేదని తేల్చి చెప్పాడు. 2009లో పాక్‌లో పర్యటించిన లంక జట్టు సభ్యులపై తీవ్రవాదులు కాల్పులు జరిపారు. లంక ఆటగాళ్లు బస్సులో ఉండడంతో ప్రాణాలతో తప్పించుకున్నారు. ఈ కాల్పుల్లో  ఎనిమిది మంది స్థానికులు చనిపోయిన విషయం తెలిసిందే. కాగా లంక క్రికెటర్లు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.

 

India not Threat Lanka Cricketers about Pak Tour

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post మా క్రికెటర్లను ఇండియా బెదిరించడంలేదు… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: