ఆగస్టు 15 తర్వాతే కోచ్ ఎంపిక…

న్యూఢిల్లీ: టీమిండియా చీఫ్ కోచ్ ఎంపిక ఆలస్యం కావచ్చని తెలుస్తోంది. భారత జట్టు కోచ్ పదవికోసం దరఖాస్తు చేసిన వారినందరినీ వడబోసి ఆరుగురిని ఇంటర్వూ కోసం ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఈ ఇంటర్వూలు ఈ నెల 13,14 తేదీల్లో జరగాల్సి ఉంది. కానీ కొంత పేపర్ వర్క్ ఇంకా మిగిలి ఉండడంతో ఈ నెల 15 తర్వాత ఇంటర్వూలు జరుగుతాయని , ఒకే రోజులో ఇంటర్వూల ప్రక్రియను పూర్తి చేస్తారని సంబంధిత వర్గాలు తెలిపాయి. ‘ తొలుత […] The post ఆగస్టు 15 తర్వాతే కోచ్ ఎంపిక… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

న్యూఢిల్లీ: టీమిండియా చీఫ్ కోచ్ ఎంపిక ఆలస్యం కావచ్చని తెలుస్తోంది. భారత జట్టు కోచ్ పదవికోసం దరఖాస్తు చేసిన వారినందరినీ వడబోసి ఆరుగురిని ఇంటర్వూ కోసం ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఈ ఇంటర్వూలు ఈ నెల 13,14 తేదీల్లో జరగాల్సి ఉంది. కానీ కొంత పేపర్ వర్క్ ఇంకా మిగిలి ఉండడంతో ఈ నెల 15 తర్వాత ఇంటర్వూలు జరుగుతాయని , ఒకే రోజులో ఇంటర్వూల ప్రక్రియను పూర్తి చేస్తారని సంబంధిత వర్గాలు తెలిపాయి. ‘ తొలుత ఇంటర్వూలను ఆగస్టు 13, 14 తేదీల్లో నిర్వహించాలని అనుకున్నాం. కోచ్ పదవికోసం దరఖాస్తు చేసిన వారిలో ఆరుగురిని ఇంటర్వూ కోసం ఎంపిక చేశాం. వారిని ఇంటర్వూ చేయడానికి ఒక రోజు సరిపోతుంది.

పేపర్ వర్క్ మిగిలి ఉండడంతో ప్రక్రియను వాయిదా వేయాల్సి వస్తోంది. 15 వ తేదీ లోగా ఈ ప్రక్రియ జరగదు. కోచ్ ఎంపికపై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అభిప్రాయాన్ని తీసుకోవడం లేదు. క్రికెట్ సలహా కమిటీ కోచ్‌ను ఎంపిక చేస్తుంది. భారత మహిళా జట్టు కోచ్ ఎంపిక తరహాలోనే దీన్ని కూడా నిర్వహిస్తున్నాం’ అని ఆ వర్గాలు వెల్లడించాయి. క్రికెట్ సలహా కమిటీ(సిఎసి) టీమిండియా కోచ్‌ను ఎంపిక చేస్తుంది. కపిల్ దేవ్, అన్షుమన్ గైక్వాడ్, శాంతా రంగస్వామిలతో కూడిన కమిటీ ఇంటర్వూలను నిర్వహిస్తుంది.

కోచ్ ఎంపికకు సంబంధించి విరాట్ కోహీ ్లతన అభిప్రాయాన్ని వెస్టిండీస్ పర్యటనకు వెళ్లే ముందు నిర్వహించిన విలేఖరుల సమావేశంలోనే వెల్లడించాడు. ‘ రవి భాయ్‌తో మా అందరికీ మంచి సంబంధాలున్నాయి. అతడ్నే తిరిగి కొనసాగిస్తే సంతోషిస్తాం. కానీ కోచ్‌పై నిర్ణయం తీసుకోవలసింది క్రికెట్ సలహా కమిటీయే. ఈ విషయమై కమిటీ ఇప్పటివరకు నా అభిప్రాయాన్ని అడగలేదు. ఒక వేళ అడిగితే నా అభిప్రాయం చెబుతా’ అని కోహ్లీ అన్నాడు.

India head coach interview likely after August 15th

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ఆగస్టు 15 తర్వాతే కోచ్ ఎంపిక… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: