ఎటిఎంలు తగ్గుతున్నాయ్

  2019లో 597 ఎటిఎంలు మైనస్ బ్యాంకులకు నిర్వహణ భారం పెరగడమే కారణం: ర్‌బిఐ నివేదిక న్యూఢిల్లీ: దేశంలో బ్యాంక్ ఎటిఎంల సంఖ్య తగ్గుతూ వస్తోంది. 2017 సంవత్సరంతో పోలిస్తే 2019లో 597 ఎటిఎంలు తగ్గాయని ఆర్‌బిఐ(భారతీయ రిజర్వు బ్యాంక్) నివేదిక పేర్కొంది. నిర్వహణ పరమైన సమస్యలు, నగదు కొరత, సాంకేతిక సమస్యల కారణంగా దేశంలో ఎటిఎంల సంఖ్య క్రమంగా తగ్గిపోతోందని రిజర్వ్ బ్యాంక్ వెల్లడించింది. 2017లో 2,22,300 ఎటిఎంలు ఉండగా 2019 మార్చి నాటికి 2,21,703 […] The post ఎటిఎంలు తగ్గుతున్నాయ్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

2019లో 597 ఎటిఎంలు మైనస్
బ్యాంకులకు నిర్వహణ భారం పెరగడమే కారణం: ర్‌బిఐ నివేదిక

న్యూఢిల్లీ: దేశంలో బ్యాంక్ ఎటిఎంల సంఖ్య తగ్గుతూ వస్తోంది. 2017 సంవత్సరంతో పోలిస్తే 2019లో 597 ఎటిఎంలు తగ్గాయని ఆర్‌బిఐ(భారతీయ రిజర్వు బ్యాంక్) నివేదిక పేర్కొంది. నిర్వహణ పరమైన సమస్యలు, నగదు కొరత, సాంకేతిక సమస్యల కారణంగా దేశంలో ఎటిఎంల సంఖ్య క్రమంగా తగ్గిపోతోందని రిజర్వ్ బ్యాంక్ వెల్లడించింది. 2017లో 2,22,300 ఎటిఎంలు ఉండగా 2019 మార్చి నాటికి 2,21,703 ఎటిఎంలకు చేరాయని నివేదిక తెలిపింది. నగదు వినియోగానికి తగిన విధంగా ఎటిఎంల సంఖ్య లేదు. నగదును జమ చేయడం కంటే ఉపసంహరణ రేటు పెరిగిపోతుంది. ఇక 2012లో 10,832 మందికి గానూ ఒక ఎటిఎంలు ఉండగా, 2017 నాటికి 5,919 మంది ఒక ఎటిఎం స్థాయికి చేరింది. ఐదేళ్ల కాలంలో కొన్ని బ్యాంకులు ఎటిఎంల విస్తరణ రేటును పెంచాయి.

అయితే కొన్ని బ్యాంకులు మాత్రం నిర్వహణ పరమైన సమస్యల కారణంగా భారం తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. రోడ్డుపై వాణిజ్య స్థలం, సెక్యూరిటీ సిబ్బంది, విద్యుత్ బిల్లుల భారం వంటి అంశాలు ఎటిఎంలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. దీంతో పాటు నగదు కొరత ఏర్పడుతుండటంతో ఆన్‌లైన్ లావాదేవీలు గణనీయంగా పెరిగిపోతున్నాయి. కాగా బ్రిక్స్ దేశాల్లో ప్రతి లక్షమందికి అతి తక్కువగా ఎటిఎంలు అందుబాటులో ఉన్న దేశం భారత్ అని ఐఎంఎఫ్ వెల్లడించింది. గత ఏడాది రిజర్వు బ్యాంక్ ఎటిఎంల నిర్వహణ, భద్రతకు సంబంధించిన నిబంధనలను మార్చింది. దీంతో కొత్త సాఫ్ట్‌వేర్, పరికరాల కొనుగోళ్లు ఎటిఎంల నిర్వాహకులకు, బ్యాంకులకు భారంగా మారాయి. దీంతో ఎటిఎంల సంఖ్య క్రమంగా తగ్గిపోతోంది.

మరోవైపు పెద్ద నోట్లు రద్దైనా ప్రజలు పూర్తిగా ఆన్‌లైన్ బ్యాంకింగ్‌కు, కార్డులకు అలవాటుపడలేదు. దీంతో నగదు లావాదేవీల సంఖ్యలో గణనీయమైన మార్పులు రాలేదు. ఎటిఎంల వద్ద లావాదేవీలు, భద్రతా నిబంధనలు కఠినతరంగా ఉండటంతో నిర్వాహకుల లాభాల్లో భారీగా కోతపడుతోంది. వారికి వచ్చే మొత్తాలకు బ్యాంకింగ్ రంగంలోని కీలక కమిటీ ఆమోదముద్ర ఉండాలి. ప్రస్తుతం బ్యాంకులు ఇంటర్‌ఛార్జీల రూపంలో రూ.15 వరకు వసూలు చేస్తున్నాయి. బ్యాంక్‌ల ఎటిఎంల నిర్వహణలో ఇది అత్యంత కీలకమైంది. బ్యాంకులు సొంత ఎటిఎంల నిర్వహణ కంటే లావాదేవీల సమయంలో ఇతర బ్యాంకులకు చెల్లించాల్సిన ఇంటర్ ఛార్జీలను తగ్గించుకోవడానికి చూస్త్తున్నాయి.

కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కొన్ని రకాల పథకాల కారణంగా 2014 తర్వాత నుంచి అదనంగా 355 మిలియన్ల మంది బ్యాంకు ఖాతాలను ప్రారంభించారు. ఆ తర్వాత పెద్దనోట్లు రద్దు కావడంతో ఎటీఎంలపై ఒత్తిడి పెరిగిపోయింది. దీనికి తోడు చాలా ప్రభుత్వ రంగ బ్యాంకులు బ్రాంచులను తగ్గించుకోవడం వల్ల ఎటిఎంల సంఖ్య కూడా తగ్గుముఖం పట్టింది. ఇటీవల పలు బ్యాంకులు విలీనం కావడం వల్ల ఎటిఎంలను తగ్గుంచుకున్నాయి. ఎటిఎంల సంఖ్య తగ్గడం మొబైల్ బ్యాంకింగ్‌కు సానుకూలంగా మారింది. దేశంలో గత ఐదేళ్లలో మొబైల్ బ్యాంకింగ్ సేవలు 65 రెట్లు పెరిగాయి.

India has 597 ATMs less in 2019 than 2017

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ఎటిఎంలు తగ్గుతున్నాయ్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: