భారత్ వృద్ధి బాగుంది..

  వచ్చే మూడేళ్లు 7.5 శాతం వృద్ధి రేటు వర్ధమాన దేశాల్లో భారత్ ఆర్థిక వ్యవస్థదే పైచేయి ప్రపంచ బ్యాంక్ నివేదిక వెల్లడి వాషింగ్టన్: వచ్చే మూడేళ్ల పాటు భారత్ వృద్ధి రేటు 7.5 శాతం వద్ద యథాతథంగా కొనసాగుతుందని ప్రపంచ బ్యాంక్ అంచనా వేసింది. వేగవంతమైన పెట్టుబడులు, ప్రైవేటు వినిమయం వంటివి భారత్‌కు సానుకూల అంశాలని పేర్కొంది. ప్రపంచ బ్యాంక్ అంచనాలు ఎన్‌డిఎ నేతృత్వంలోని కొత్త ప్రభుత్వానికి శుభసూచకంగా భావిస్తున్నారు. గత ఆర్థిక సంవత్సరానికి(2018-19) వృద్ధి […] The post భారత్ వృద్ధి బాగుంది.. appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

వచ్చే మూడేళ్లు 7.5 శాతం వృద్ధి రేటు
వర్ధమాన దేశాల్లో భారత్ ఆర్థిక వ్యవస్థదే పైచేయి
ప్రపంచ బ్యాంక్ నివేదిక వెల్లడి

వాషింగ్టన్: వచ్చే మూడేళ్ల పాటు భారత్ వృద్ధి రేటు 7.5 శాతం వద్ద యథాతథంగా కొనసాగుతుందని ప్రపంచ బ్యాంక్ అంచనా వేసింది. వేగవంతమైన పెట్టుబడులు, ప్రైవేటు వినిమయం వంటివి భారత్‌కు సానుకూల అంశాలని పేర్కొంది. ప్రపంచ బ్యాంక్ అంచనాలు ఎన్‌డిఎ నేతృత్వంలోని కొత్త ప్రభుత్వానికి శుభసూచకంగా భావిస్తున్నారు. గత ఆర్థిక సంవత్సరానికి(2018-19) వృద్ధి రేటు 7.2 శాతంగా అంచనా వేశామని ప్రపంచ బ్యాంక్ తన నివేదికలో పేర్కొంది. అయితే గత ఆర్థిక సంవత్సరానికి 6.8 శాతం వృద్ధిరేటు నమోదు చేసినట్టు భారత కేంద్ర గణాంకాల సంస్థ వెల్లడించిన విషయం తెలిసిందే.

2020లోనూ భారత్ జోరు
ప్రభుత్వ వినిమయంలో మందగమనం వచ్చినా, బలమైన పెట్టుబడులు, ముఖ్యంగా మౌలికసదుపాయ వ్యయాలు పెరగడం కలిసి వచ్చిందని ప్రపంచ బ్యాంకు నివేదికలో తెలిపింది. అయితే నాలుగో త్రైమాసికంలో భారత్ వృద్ధి రేటు అంచనాలను అందుకోలేకపోయింది. ప్రస్తుత సంవత్సరంతో పాటు వచ్చే రెండేళ్లు భారత్ 7.5 శాతం రేటును సాధించగలదని, 2020 ఆర్థిక సంవత్సరంలో కూడా భారత్ జోరు కొనసాగుతుందని ప్రపంచ బ్యాంక్ పేర్కొంది. ద్రవ్య పరపతి విధానంలో తీసుకొనే చర్యలు, అత్యల్ప ద్రవ్యోల్బణం కారణంగా దీనిని సాధిస్తుందని పేర్కొంది.

ప్రపంచ వృద్ధిరేటు 3 శాతం
ప్రపంచ ఆర్థిక వ్యవస్థల వృద్ధితో పోలిస్తే భారత్ పరిస్థితి చాలా మెరుగ్గా ఉందని పేర్కొంది. గత ఏడాది ప్రపంచ వృద్ధిరేటు 3 శాతంగా అంచనా వేయగా, ఈ ఏడాది అది 2.6 శాతంగా, వచ్చే 2.7శాతంగా, ఇక 2021లో 2.8శాతంగా ఉంటుందని పేర్కొంది.

చైనా కంటే మెరుగ్గా
చైనా ఈ ఏడాది 6.2 శాతం, వచ్చే ఏడాది 6.1 శాతం, ఆపై ఏడాది 6 శాతం వృద్ధిని నమోదు చేస్తుందని అంచనా వేసింది. దీంతో 2021నాటికి చైనాతో పోలిస్తే భారత వృద్ధి 1.5 శాతం అధికంగా ఉండనుంది. వర్ధమాన దేశాల్లో వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ ప్రత్యేకత నిలుపుకోనుంది. గతేడాది చివర్లో కనిపించిన మందగమనం ఈ ఏడాది ప్రథమ త్రైమాసికంలో కొనసాగిందని, కానీ ఇకపై ఈ మందగమనం తొలగిపోతుందని తెలిపింది.

ఇటీవల గణాంకాల్లో 5.8 శాతమే
ఇటీవల వెల్లడించిన ప్రభుత్వ గణాంకాల్లో జనవరిమార్చి కాలానికి గాను జిడిపి(స్థూల దేశీయోత్పత్తి) 5.8 శాతం నమోదు చేసింది. ఇది 17 త్రైమాసికాల్లో అత్యంత కనిష్ట స్థాయి, రెండేళ్లలో తొలిసారి చైనా దిగువకు మన జిడిపి పడిపోయింది.గత ఆర్థిక సంవత్సరం మూడు త్రైమాసికాల్లో జిడిపి వృద్ధి రేటు వరుసగా 7.1 శాతం, 6.6 శాతం, 5.8 శాతం నమోదయ్యాయి. కానీ ఇప్పుడది 5.8 శాతానికి పడిపోయింది. దీంతో ఈ ఆర్థిక సంవత్సరంలో కూడా కేంద్రం జిడిపి అంచనాను 7 నుంచి 6.8 శాతానికి తగ్గించింది

India Growth Rate At 7.5% For Next 3 Years

Related Images:

[See image gallery at manatelangana.news]

The post భారత్ వృద్ధి బాగుంది.. appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: