ఆర్థిక వ్యవస్థ: జవాబు లేని ప్రశ్నలు

  భారత ఆర్థిక వ్యవస్థ కుంగిపోతున్న వార్తలు ఒకదాని తర్వాత ఒకటి వస్తున్నాయి. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇప్పుడు ఆలోచించవలసింది మాంద్యం లేని భారతం కోసం, స్లో డౌన్ ముక్త్ భారత్ ఎలా సాధించాలన్నది మోడీ ప్రభుత్వం ఇప్పుడు ఆలోచించాలి. కాంగ్రెస్ ముక్త్ భారత్ గురించి మాట్లాడితే సరిపోదు. ఇప్పుడు బిజెపి ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలు ప్రతిపక్షాలు కాదు. నిరుద్యోగుల్లో పేరుకుపోతున్న ఆగ్రహావేశాలు, వీధుల్లో కూలబడిన వ్యాపారాలు నేటి పెద్ద సవాలు. జిడిపి గత 7 సంవత్సరాల్లో […] The post ఆర్థిక వ్యవస్థ: జవాబు లేని ప్రశ్నలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

భారత ఆర్థిక వ్యవస్థ కుంగిపోతున్న వార్తలు ఒకదాని తర్వాత ఒకటి వస్తున్నాయి. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇప్పుడు ఆలోచించవలసింది మాంద్యం లేని భారతం కోసం, స్లో డౌన్ ముక్త్ భారత్ ఎలా సాధించాలన్నది మోడీ ప్రభుత్వం ఇప్పుడు ఆలోచించాలి. కాంగ్రెస్ ముక్త్ భారత్ గురించి మాట్లాడితే సరిపోదు. ఇప్పుడు బిజెపి ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలు ప్రతిపక్షాలు కాదు. నిరుద్యోగుల్లో పేరుకుపోతున్న ఆగ్రహావేశాలు, వీధుల్లో కూలబడిన వ్యాపారాలు నేటి పెద్ద సవాలు. జిడిపి గత 7 సంవత్సరాల్లో ఏన్నడూ లేని తక్కువ స్థాయికి, 5 శాతానికి చేరుకుంది. రూపాయి విలువ ఈ ఏడాది కనిష్ట స్థాయికి పడిపోయింది.

భారత దేశంలో పాసింజర్ వాహనాలను తయారు చేసే అతిపెద్ద కంపెనీ మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ రెండు ప్లాంటుల్లో రెండు రోజుల పాటు పనులు ఆపేసింది. దేశంలో వాహనాల అమ్మకాలు పడిపోయాయి. మరో వైపు చైనాలో కూడా ఉత్పత్తుల కోత విధించారు. ఇప్పుడు ప్రపంచంలో పాసింజర్ వాహనాల మార్కెట్ పై తీవ్ర ప్రభావం పడే సూచనలున్నాయి. సర్వీసులకు సంబంధించి పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ పడిపోతోంది. స్టీలు డిమాండ్ పడిపోయింది. ప్రపంచంలో ఆర్థిక మాంద్యం సూచనలు కనబడుతున్నాయి. మరోవైపు అమెరికా, చైనా వాణిజ్య యుద్ధం వల్ల ఉక్కు పరిశ్రమ లాభాలు దెబ్బ తిన్నాయి. ఉక్కు పరిశ్రమ నష్టాల్లో కొట్టుమిట్టాడుతోంది.

ఈ వార్తలన్నీ ఇలా ఉంటే, నిరాశా పూరితమైన పరిస్థితి మన కళ్ళ ముందు ఉంటే, ఇండియా విషయంలో జిడిపి అంచనాలు, భవిష్యవాణులు చెప్పడానికి ప్రపంచంలోని రేటింగ్ సంస్థలు లెక్కలు సరిచేయడంలో తలమునకలై ఉన్నాయి. ఆరు శాతం అంచనా నుంచి ఇప్పుడు మరింత తగ్గించిఎడ్జస్టుమెంట్లు చేస్తున్నారు. అంటే, మనం నెమ్మదిగా దురదృష్టకరమైన ఆర్థిక మాంద్యం దిశగా వెళుతున్నాం. పైపైన చూసినా ఆర్థిక వ్యవస్థ కునారిల్లుతుందన్నది స్పష్టంగా అర్థమవుతున్న విషయం. ఈ విషయాన్ని చాలా మంది విశ్లేషకులు చాలా ముందే చెప్పారు. ఆర్థిక మాంద్యానికి, టెర్రరిజం మాదిరిగానే స్పష్టమైన నిర్వచనం ఏదీ లేదు. విభిన్న ఆర్థిక వ్యవస్థలకు ఆర్థిక మాంద్యం అంటే భిన్నమైన అర్థాలున్నాయి. ఆర్థిక వ్యవస్థ నెమ్మదించడం అనేది ఖచ్చితంగా మాంద్యం కారణంగానే అని కూడా చెప్పడం కొన్ని సందర్భాల్లో సాధ్యం కాదు. కాని, ఈ పరిస్థితులను ప్రభుత్వం గమనించి తగు జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. మోడీ ప్రభుత్వం ఈ విషయమై వెంటనే ఆలోచించవలసిన అవసరం ఉంది. అంతా బాగా ఉంది అని సర్ది చెప్పుకోవడం వల్ల ఆర్థిక వ్యవస్థకు మేలు జరగదు.

2008-09 సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థ ఆసియా ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. ప్రపంచంలోని అనేక దేశాల ఆర్థిక వ్యవస్థలు అతలాకుతలమయ్యాయి. ఈ ఆర్థిక సంక్షోభానికి కారణం అమెరికా బ్యాంకుల్లో తలెత్తిన సంక్షోభం. దానిని నివారించడానికి అమెరికాలోని ఫెడరల్ రిజర్వు, అంటే మన దేశంలో ఆర్‌బిఐ మాదిరి సంస్థ, దాదాపు 7 వడ్డీ రేటు కోతలు ప్రకటించింది. రుణాలకు నగదు అందుబాటులో ఉండేలా చేసింది. దానివల్ల విచక్షణ లేకుండా రుణాలివ్వడం మొదలైంది. ఇప్పుడు తినండి, తర్వాత డబ్బు చెల్లించండి మాదిరి ఈ పద్ధతి వల్ల అమెరికా బ్యాంకులకు లాభమేమీ కలగలేదు. పైగా బ్యాంకులు దివాలా తీసే పరిస్థితి వచ్చింది. దీని ప్రభావం అనేక దేశాల ఆర్థిక వ్యవస్థలపై పడింది.

భారతదేశం 2001 నుంచి 2006 వరకు ఆర్థికంగా గొప్ప విజయాలు సాధిస్తూ పోయింది. 2008 ఆసియా ఆర్థిక సంక్షోభం ప్రభావం ఇండియాపై కూడా పడింది. కాని, ఈ సంక్షోభాన్ని తట్టుకుంది, తక్కువ ఎగుమతులు (జిడిపిలో 15 శాతం), పారిశ్రామిక ఉత్పత్తుల పరిస్థితి మెరుగ్గా ఉండడం తదితర కారణాల వల్ల జిడిపి రేటు 7.8 శాతం నిలబెట్టుకుంది. అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఆర్థిక వ్యవస్థ మళ్ళీ పూర్తి బలం పుంజుకుంటుందని చెప్పారు, ఆయన చెప్పిన స్థాయిలో పుంజుకోకపోయినా, ప్రభుత్వం పాటించిన పద్ధతుల వల్ల, జాగ్రత్తల వల్ల సంక్షోభం అదుపు తప్పే స్థితి రాలేదు. కాని ఇప్పుడు అలాంటి పరిస్థితి కనబడడం లేదు. 2019లో మారిన పరిస్థితులేమిటి?

విశ్లేషకుల ప్రకారం 2008 సంక్షోభం 2014 వరకు కొనసాగింది. కాని నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షోభ పరిస్థితి కొంత తెరిపి ఇచ్చింది. కొత్తగా అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వంపై చాలా మంది ఆశలు పెట్టుకున్నారు. ఉత్పత్తులు పెరగడం, వ్యాపారం చేయడంలో సౌలభ్యం, పన్నుల సంస్కరణలు, ఉద్యోగాలు, ఉపాధి కల్పన ఇలా అనేక ఆశలు కలిగాయి. కోటి ఉద్యోగాల కల్పన అనే వాగ్దానం గొప్పగా పని చేసింది. ఈ వాగ్దానం పరిశ్రమలపై కూడా ప్రభావం వేసింది. 2016లో నరేంద్ర మోడీ ప్రభుత్వం అవినీతిపై, నల్లధనంపై యుద్ధం పేరుతో నోట్ల రద్దు చేపట్టింది. నోట్ల రద్దు అవసరమే కాని దాని దుష్పరిణామాలు ఇప్పటికీ కూడా కొనసాగుతూనే ఉన్నాయి. అనుకున్న సమయం కన్నా ఎక్కువ కాలమే ఈ ప్రభావం కొనసాగుతోంది. నోట్ల రద్దు తర్వాత జిఎస్‌టి ప్రవేశపెట్టారు.

వాణిజ్యాన్ని, అభివృద్ధిని కొత్త పుంతలు తొక్కించే టాక్సుల సంస్కరణగా పేరుపడిన జిఎస్‌టి ఆర్థిక వ్యవస్థకు బ్రేకులు వేసింది. ఆ తర్వాత వరుసగా చోటు చేసుకున్న సంఘటనలు ఆర్థిక వ్యవస్థను దెబ్బ తీశాయి. ఉత్పాదకత తగ్గిపోయింది. డిమాండ్ పడిపోయింది. ఆ తర్వాత ఎన్‌బిఎఫ్‌సి సంక్షోభం వచ్చింది. దాని వెంటనే ఐఎల్ అండ్ ఎఫ్‌ఎస్ కుప్పకూలింది. ఆర్థిక మంత్రిత్వ శాఖ తాత్కాలిక దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. నాన్ బ్యాంకింగ్ రుణ సంస్థలపై ఆంక్షలు ఎక్కువయ్యాయి. ఫలితంగా ఈ బ్యాంకేతర రుణ సంస్థలు నమ్మకాన్ని కోల్పోయాయి. రుణాలు నిలిచిపోయాయి. పెట్టుబడులు ఆగిపోయాయి. ఎంఎస్‌ఎంఇ రంగంలోను, మార్కెటులోను దీనివల్ల ప్రతికూల ప్రభావం పడింది.

మేకిన్ ఇండియా స్కీం మాటలకే పరిమితమైపోయింది. ఇప్పుడు తీసుకుంటున్న చర్యలు, బ్యాంకుల విలీనం, రుణ సదుపాయం తేలిక చేయడం, పరిశ్రమలకు ప్రోత్సాహకాలు ప్రకటించడం వల్ల తాత్కాలికంగా కొంత ఉపశమనం కలగవచ్చునేమో. కాని తగిన జాగ్రత్తలు లేకుండా రుణాలను పంచిపెట్టడం వల్ల పరిస్థితి మరింత దిగజారవచ్చు. పైగా అంతర్జాతీయం గా చమురు ధరల్లో వస్తున్న మార్పులు, అమెరికా చైనా వాణి జ్య యుద్ధం, మేజర్ ఆర్థిక వ్యవస్థల్లో చోటు చేసుకుంటున్న మాం ద్యం ఇవన్నీ భారతదేశంపై కూడా ప్రభావం వేస్తాయి. 5 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థ, అందరికీ ఉద్యోగాలనే మాటలు ఉత్తమాటలు గా మిగిలిపోవచ్చు. కఠినమైన, వాణిజ్య వ్యతిరేక నిర్ణయాలు, టాక్స్ టెర్రరిజంపై ప్రశ్నలను ఆర్థిక మంత్రి దాటవేయడం వల్ల లాభమేమీ ఉండదు. పారిశ్రామిక, వాణిజ్య రంగాలతో చర్చలు జరపాలి. నిపుణుల సలహా సంప్రదింపులతో ఏం చేయాలో నిర్ణయించడం నేటి అవసరం.

India economic growth dips to 7 year low of 5%

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ఆర్థిక వ్యవస్థ: జవాబు లేని ప్రశ్నలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: