17లక్షలకు చేరువైన కరోనా కేసులు

India Covid-19 cases tally crosses 17 lakh mark
India Covid-19 cases tally crosses 17 lakh mark

 

వరసగా మూడో రోజు 50 వేలకు పైగా కేసులు నమోదు
24 గంటల్లో 57,118 మందికి కొత్తగా వైరస్
764 మంది మృత్యువాత
ఒక్క రోజే 36,569 మంది డిశ్చార్జి

న్యూఢిల్లీ: దేశంలో కరోనా ఉధృతి ఏ మాత్రం తగ్గడం లేదు. రోజురోజుకు కొత్తగా కరోనా బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. మరో వైపు మరణాలు కూడా పెరుగుతున్నాయి. తాజాగా గడచిన 24 గంటల్లో కొత్తగా 57,118 మంది కొత్తగా వైరస్ బారిన పడ్డారు. దీంతో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా కరోనా బారిన పడిన బాధితుల సంఖ్య 16,95,988కు చేరుకుంది. వీరిలో 5,65,103 మంది చికిత్స పొందుతుండగా, 10,94,374 మంది కోలుకుని ఇళ్లకు తిరిగి వెళ్లారు. ప్రస్తుతం దేశంలో రికవరీ రేటు 64.53 శాతంగా ఉంది. నిన్న ఒక్క రోజే కొత్తగా 36,569 మంది వివిధ ఆస్పత్రులనుంచి డిశ్చార్జి అయ్యారు.

ఇక కొత్తగా 764 మంది మరణించడంతో దేశవ్యాప్తంగా మరణాల సంఖ్య 36,511కు చేరుకుంది. ప్రస్తుతం మరణాల రేటు 2.15 శాతంగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తెలిపింది. ఇక శుక్రవారం ఒక్క రోజే దేశవ్యాప్తంగా 5,25,689 శాంపిల్స్‌ను పరీక్షించినట్లు ఐసిఎంఆర్ తెలిపింది. దీంతో ఇప్పటివరకు మొత్తం 1,93,58,659 శాంపిల్స్‌ను పరీక్షించడం జరిగిందని ఆ సంస్థ తెలిపింది. కాగా దేశంలో ఒక్క రోజే 50 వేలకు పైగా కేసులు నమోదు కావడం వరసగా ఇది మూడో రోజు. కాగా దేశంలో కరోనా వెలుగు చూసిన తర్వాత ఈ స్థాయిలో కొత్త కేసులు వెలుగు చూడడం ఇదే మొదటిసారి.

కాగా శనివారం చోటు చేసుకున్న మరణాల్లో మహారాష్ట్రలో అత్యధికంగా 265 నమోదు అయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు వైరస్ కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 14,944కు చేరుకుంది. కాగా తమిళనాడులో కొత్తగా 97 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో మరణాల సంఖ్య 2,441కి చేరుకుంది. కర్నాటకలో 84 మంది, ఆంధ్రప్రదేశ్‌లో 68 మంది, పశ్చిమ బెంగాల్‌లో 45మంది, యుపిలో 43మంది, ఢిల్లీలో27మంది, గుజరాత్‌లో 23 మంది మృతి చెందారు. ఈ మరణాలతో ఢిల్లీలో 3,945,గుజరాత్‌లో 2,314, కర్నాటకలో 2,314, యుపిలో 1,630,, పశ్చిమ బెంగాల్‌లో1,581ఎపిలో 1,349 మంది ఇప్పటివరకు ఈ వైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోయారు.

India Covid-19 cases tally crosses 17 lakh mark

Related Images:

[See image gallery at mtlive.mediology.in]

The post 17లక్షలకు చేరువైన కరోనా కేసులు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.