ధావన్, రోహిత్ విఫలంతో నాపై ఆ భారం

ట్రినిడాడ్ : విండీస్‌తో జరిగిన రెండో వన్‌డేలో ఓపెనర్లు శిఖర్ ధావన్, రోహిత్ శర్మలు విఫలమయిన తర్వాత పరిస్థితులను చక్కదిద్దే బాధ్యత తనపై పడిందని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ చెప్పాడు. వర్షం కారణంగా డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో విండీస్ ఇన్నింగ్స్‌ను 46 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో భారత్ 56 పరుగుల తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ అనంతరం కోహ్లీ మాట్లాడుతూ, ‘ 270కి పైగా పరుగులు సాధిస్తే మ్యాచ్‌పై పట్టు సాధించవచ్చని మాకు తెలుసు. […] The post ధావన్, రోహిత్ విఫలంతో నాపై ఆ భారం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

ట్రినిడాడ్ : విండీస్‌తో జరిగిన రెండో వన్‌డేలో ఓపెనర్లు శిఖర్ ధావన్, రోహిత్ శర్మలు విఫలమయిన తర్వాత పరిస్థితులను చక్కదిద్దే బాధ్యత తనపై పడిందని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ చెప్పాడు. వర్షం కారణంగా డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో విండీస్ ఇన్నింగ్స్‌ను 46 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో భారత్ 56 పరుగుల తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ అనంతరం కోహ్లీ మాట్లాడుతూ, ‘ 270కి పైగా పరుగులు సాధిస్తే మ్యాచ్‌పై పట్టు సాధించవచ్చని మాకు తెలుసు. ఓపెనర్లిద్దరూ ఔటయిన తర్వాత జట్టును ఆదుకునే బాధ్యత నాపై పడింది. క్లిష్ట పరిస్థితుల్లో క్రీజ్‌లోకి అడుగుపెట్టి సెంచరీ చేయడం బాగుంది. ధావన్, రోహిత్‌లు పెద్ద ఇన్నింగ్స్‌లు ఆడలేకపోయారు. ఆ అవకాశం నాకు లభించింది’ అని చెప్పుకొచ్చారు.‘ తొలుత బ్యాటింగ్‌ను ఎంచుకోవడమే మంచిదయింది. ఎందుకంటే వెస్టిండీస్ బ్యాట్ చేసే సమయంలో పిచ్ నెమ్మదించింది. ఆపై బ్యాట్ చేయడం వారికి కష్టంగా మారింది. కీలక సమయంలో హెట్‌మెయర్, నికోలస్ వికెట్లను తీయడం మాకు కలిసి వచ్చింది.

విండీస్ జట్టులో ఎక్కువ మంది ఎడంచేతి బ్యాట్స్‌మెన్ ఉండడంతో చాహల్‌కు బదులు కుల్దీప్ యాదవ్‌ను తీసుకున్నాం’ అని కోహ్లీ చెప్పాడు. ఈ సందరంగా మిడిలార్డర్ యువ బ్యాట్స్‌మన్ శ్రేయస్ అయ్యర్(71)ను కెప్టెన్ మెచ్చుకున్నాడు. అతనిలో ఆత్మ విశ్వాసం మెండుగా కనిపించిందని, అయ్యర్ తోడుగా నిలవడంతో తనపై ఒత్తిడి తొలగి పోయిందని చెప్పాడు. తాను ఔటయినా అయ్యర్ బాగా ఆడాడని మెచ్చుకున్నాడు. విండీస్ కెప్టెన్ జేసన్ హోల్డర్ మాట్లాడుతూ ఆఖరి 62 పరుగులకు ఆరు వికెట్లు కోల్పోవడమే తమ కొంపముంచిందని చెప్పాడు. 27 ఓవర్లలో నాలుగు వికెట్లకు 149 పరుగులతో పటిష్ఠ స్థితిలో ఉండిన విండీస్ ఆ తర్వాత వరసగా వికెట్లు కోల్పోతూ వచ్చింది. ఫలితంగా 210 పరుగులకే ఆలౌట్ అయింది. తమ బౌలర్లు మంచి ప్రదర్శన ఇచ్చినా బ్యాట్స్‌మెన్ రాణించలేక పోయారని అన్నాడు. కీలక సమయంలో బ్యాట్స్‌మెన్ బాధ్యత తీసుకొని ండాల్సిందని హోల్డర్ అభిప్రాయపడ్డాడు.

India beat West indies by 56 runs

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ధావన్, రోహిత్ విఫలంతో నాపై ఆ భారం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: