విమాన సర్వీసులపై ఫ్రాన్స్ అమెరికాతో ఒప్పందం

India agreement on Air Bubbles With US, France

 

న్యూఢిల్లీ: అంతర్జాతీయ విమాన సర్వీసులు నడిపేందుకు ఫ్రాన్ అమెరికాతో ద్వైపాక్షిక ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి గురువారం తెలిపారు. ఇదే విధమైన ఒప్పందాలను త్వరలో జర్మనీ, బ్రిటన్‌తో కూడా కుదుర్చుకోనున్నట్లు ఆయన వెల్లడించారు. జులై 18 నుంచి ఆగస్టు 1 వరకు ఢిల్లీ, ముంబయి, బెంగళూరు, పారిస్ మధ్య 28 విమానాలను ఎయిర్ ఫ్రాన్స్ నడుపుతుందని గురువారం నాడిక్కడ విలేకరుల సమావేశంలో మంత్రి తెలిపారు. అదే విధంగా జులై 17 నుంచి జులై 31 వరకు భారత్, అమెరికా మధ్య 18 విమానాలను యునైటెడ్ ఎయిర్‌లైన్స్ నడుపుతుందని ఆయన వివరించారు.

అమెరికాకు చెందిన యునైటెడ్ ఎయిర్‌లైన్స్ ఢిల్లీ, న్యూయార్క్ మధ్య ప్రతిరోజు ఒక విమానం నడుపుతుందని, ఢిల్లీ, శాన్‌ఫ్రాన్సిస్కో మధ్య వారానికి మూడు రోజులు విమానం నడుపుతుందని పురి తెలిపారు. త్వరలోనే బ్రిటన్‌తో కూడా ద్వైపాక్షిక ఒప్పందాన్ని భారత్ కుదర్చుకోనున్నదని, దీని ప్రకారం ఢిల్లీ, లండన్ మధ్య రోజుకు రెండు విమానాలు నడుస్తాయని ఆయన చెప్పారు. జర్మనీ నుంచి కూడా ఇటువంటి విజ్ఞప్తులే అందుతున్నాయని, లుఫ్తాన్సా ఎయిర్‌లైన్స్‌తో ఒప్పందం దాదాపు ఖరారైనట్లేనని ఆయన వెల్లడించారు. ఈ విధమైన ద్వైపాక్షిక ఒప్పందాల కోసం చాలా దేశాల నుంచి విజ్ఞప్తులు అందుతున్నాయని, అయితే వాటిని నిర్వహించగలిగిన మేరకే అనుమతులు అందచేస్తామని ఆయన చెప్పారు. ఈ ఒప్పందాల కింద అమెరికా, ఫ్రాన్స్‌కు భారత్ నుండి ఎయిర్ ఇండియా విమానాలు నడుపుతుంది.

కేంద్రం కొత్తగా అంతర్జాతీయ విమానాలు నడిపేందుకు కొన్ని నియమనిబంధనలతో వివిధ దేశాలతో ద్వైపాక్షిక ఒప్పందాలు కుదుర్చుకుంటోంది. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా మార్చి 23 నుంచి భారత ప్రభుత్వం షెడ్యూల్డ్ అంతర్జాతీయ పాసింజర్ విమాన సర్వీసులను రద్దు చేసింది. కాగా, రెండు నెలల అనంతరం దేశీయ విమాన సర్వీసులను మే 25 నుంచి భారత ప్రభుత్వం పునరుద్ధరించింది. ఈ ఏడాది దీపావళి నాటికి 55 నుంచి 60 శాతం దేశీయ విమాన సర్వీసులను నడపగలమన్న ఆశాభావాన్ని కేంద్ర మంత్రి వ్యక్తం చేశారు.

India agreement on Air Bubbles With US, France

Related Images:

[See image gallery at mtlive.mediology.in]

The post విమాన సర్వీసులపై ఫ్రాన్స్ అమెరికాతో ఒప్పందం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.