గేల్ విధ్వంసం…విండీస్ 21 ఓవర్లో 152/2

 

పోర్ట్‌ ఆఫ్‌ స్పెయిన్‌: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత్‌తో జరుగుతున్న చివరి వన్డేలో వెస్టిండీస్ విధ్వంసకర బ్యాట్స్‌మెన్ క్రిస్ గేల్ వీరవిహారం చేశాడు. భారత బౌలర్లపై ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో గేల్ కేవలం 41 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్స్ లతో 72 పరుగులు చేశాడు. మరోవైపు లూయిస్(43) కూడా గేల్ అండతో చెలరేగాడు. వీరిద్దరూ కలిసి ఎదురుదాడి చేయడంతో వన్డే మ్యాచ్ కాస్తా టీ20 మ్యాచ్ లా మారింది. వీరి దెబ్బకు విండీస్ జట్టు 10 ఓవర్లలోనే 114 పరుగులు చేసింది. వీరి జోడికి యుజేంద్ర చాహల్ బ్రేక్ వేశాడు. అర్ధశతకానికి చేరువలో ఉన్న లూయిస్ పెవిలియన్ చేర్చి భారత్ కు బిగ్ బ్రేక్ ఇచ్చాడు. ఆ తర్వాతి ఓవర్లో ఖలీల్ అహ్మద్, గేల్ ను బోల్తా కొట్టించాడు.  వీరిద్దరు ఔట్ అయిన తర్వాత వీండీస్ జోరు తగ్గింది. హెట్‌మైయిర్‌ (17), షైహోప్‌ (18)లు నిలకడగా ఆడుతున్నాడు. ప్రస్తుతం విండీస్ జట్టు 22 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 152 పరుగులు చేసింది.

IND vs WI: Gayle hits half Century in 3rd ODI

The post గేల్ విధ్వంసం… విండీస్ 21 ఓవర్లో 152/2 appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.