సిరీసే లక్ష్యంగా భారత్

విండీస్‌కు పరీక్ష, నేడు చివరి వన్డే పోర్ట్ ఆఫ్ స్పెయిన్: ఇప్పటికే ట్వంటీ20 సిరీస్ గెలిచిన టీమిండియా వన్డేల్లోనూ అదే సంప్రదాయాన్ని కొనసాగించాలనే పట్టుదలతో కనిపిస్తోంది. బుధవారం వెస్టిండీస్‌తో జరిగే మూడో, చివరి వన్డేలో విజయమే లక్షంగా భారత్ బరిలోకి దిగుతోంది. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్‌ను సొంతం చేసుకోవాలని తహతహలాడుతోంది. తొలి వన్డే వర్ష వల్ల రద్దుకాగా, రెండో మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఇక, సిరీస్‌ను సమం చేయాలంటే విండీస్ ఈ మ్యాచ్‌లో […] The post సిరీసే లక్ష్యంగా భారత్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

విండీస్‌కు పరీక్ష, నేడు చివరి వన్డే
పోర్ట్ ఆఫ్ స్పెయిన్: ఇప్పటికే ట్వంటీ20 సిరీస్ గెలిచిన టీమిండియా వన్డేల్లోనూ అదే సంప్రదాయాన్ని కొనసాగించాలనే పట్టుదలతో కనిపిస్తోంది. బుధవారం వెస్టిండీస్‌తో జరిగే మూడో, చివరి వన్డేలో విజయమే లక్షంగా భారత్ బరిలోకి దిగుతోంది. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్‌ను సొంతం చేసుకోవాలని తహతహలాడుతోంది. తొలి వన్డే వర్ష వల్ల రద్దుకాగా, రెండో మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఇక, సిరీస్‌ను సమం చేయాలంటే విండీస్ ఈ మ్యాచ్‌లో కచ్చితంగా గెలవాల్సిందే. ఇప్పటికే టి20 సిరీస్‌ను కోల్పోయిన ఆతిథ్య జట్టుకు వన్డేల్లోనూ అదే ఫలితం ఖాయంగా కనిపిస్తోంది. ఈ మ్యాచ్ విండీస్ దిగ్గజం క్రిస్ గేల్ కెరీర్‌లో ఆఖరి అంతర్జాతీయ మ్యాచ్‌గా నిలిచే అవకాశం ఉంది. టెస్టు సిరీస్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాలని గేల్ భావించినా అతనికి టెస్టుల్లో చోటు లభించలేదు. దీంతో గేల్‌కు ఇదే చివరి అంతర్జాతీయ మ్యాచ్ అయ్యే ఛాన్స్ ఉంది. దీనిపై ఇంకా అతని నుంచి ఎటువంటి ప్రకటన రాలేదు. కాగా, చివరి వన్డేలో విరాట్ సేన ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. ఇప్పటికే 10 ఆధిక్యంలో ఉండడంతో ఎలాంటి ఒత్తిడి లేకుండా పోయింది. ఇందులోనూ గెలిచి సిరీస్‌ను దక్కించుకోవాలని భావిస్తోంది. అయితే ఓపెనర్ల వైఫల్యం జట్టును వెంటాడుతోంది. ఈ మ్యాచ్‌లోనైనా ఓపెనర్లు తమ బ్యాట్‌కు పని చెప్పాల్సిన అవసరం ఉంది. మరోవైపు విండీస్ కూడా ఈ మ్యాచ్‌ను సవాలుగా తీసుకుంటోంది. కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో సర్వం ఒడ్డేందుకు సిద్ధమైంది. నిలకడగా రాణిస్తే భారత్‌ను ఓడించడం విండీస్‌కు కష్టమేమి కాదు. కానీ, సమష్టిగా రాణించడంలో విఫలమవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో భారత్‌తో జరిగే ఆఖరి మ్యాచ్ చావోరేవోగా తయారైంది.
ఓపెనర్లు ఈసారైనా
తొలి రెండు వన్డేల్లో శుభారంభం అందించడంలో విఫలమైన భారత ఓపెనర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్‌లు ఈ మ్యాచ్‌లోనైనా రాణిస్తారా లేదా అనేది ఆసక్తిగా మారింది. ఈ సిరీస్‌లో ధావన్ పేలవమైన ప్రదర్శనతో నిరాశ పరుస్తున్నాడు. టి20లలో విఫలమైన ధావన్ తొలి రెండు వన్డేల్లో కూడా నిరాశ పరిచాడు. కనీసం ఆఖరి మ్యాచ్‌లోనైనా నిలకడైన బ్యాటింగ్ కనబరుస్తాడా లేదా అనేది జట్టును కలవరానికి గురిచేస్తోంది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే ధావన్ విజృంభిస్తే భారత్‌కు శుభారంభం ఖాయం. ఇక, వన్డేల్లో ఆశించిన స్థాయిలో రాణించని మరో ఓపెనర్ రోహిత్ కూడా ఈ మ్యాచ్‌లో మెరుగ్గా ఆడక తప్పదు. టి20లో అద్భుతంగా ఆడిన రోహిత్ వన్డేల్లో మాత్రం విఫలమయ్యాడు. ఈ మ్యాచ్‌లో రాణించేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఇక, కెప్టెన్ విరాట్ కోహ్లి ఫామ్‌లో ఉండడం భారత్‌కు కలిసి వచ్చే అంశంగా చెప్పాలి. కిందటి మ్యాచ్‌లో కోహ్లి అద్భుత సెంచరీతో జట్టును ఆదుకున్నాడు. ఈ మ్యాచ్‌లో కూడా జట్టు కోహ్లిపై భారీ ఆశలు పెట్టుకుంది. కోహ్లి చెలరేగితే ఆపడం విండీస్ బౌలర్లకు చాలా కష్టం. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే సత్తా కోహ్లి సొంతం. అతను ఫామ్‌లో ఉండడం టీమిండియాకు ఊరటనిస్తోంది. కచ్చితంగా గెలవాల్సిన ఈ మ్యాచ్‌లో మరోసారి మెరుపులు మెరిపించేందుకు సిద్ధమయ్యాడు. అంతేగాక యువ ఆటగాడు శ్రేయస్ అయ్యర్ రెండో వన్డేలో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. తీవ్ర ఒత్తిడిలో కూడా నిలకడగా రాణించడంతో అతని ఆత్మవిశ్వాసం మరింత పెరిగింది. ఈ మ్యాచ్‌లో కూడా మెరుగైన ప్రదర్శన కనబరిచేందుకు సిద్ధమయ్యాడు. రిషబ్ పంత్ రూపంలో మరో పదునైన అస్త్రం భారత్‌కు అందుబాటులో ఉంది. పంత్ చెలరేగితే బ్యాటింగ్ కష్టాలు చాలా వరకు తీరిపోతాయి. ఇదిలావుంటే వరుస అవకాశాలు లభిస్తున్నా కేదార్ జాదవ్ సద్వినియోగం చేసుకోలేక పోతున్నాడు. ఈ మ్యాచ్‌లోనైనా మెరుగ్గా రాణించాల్సిన అవసరం ఉంది. ఇందులో విఫలమైతే జట్టులో చోటు నిలబెట్టుకోవడం చాలా కష్టమనే చెప్పాలి. రవీంద్ర జడేజా, భువనేశ్వర్ కుమార్‌లతో భారత్ బ్యాటింగ్ బలంగా ఉంది. బౌలింగ్‌లో కూడా టీమిండియాకు ఎదురులేదు. దీంతో ఈ మ్యాచ్‌లో భారత్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.
చావోరేవో


మరోవైపు ఆతిథ్య విండీస్‌కు ఈ మ్యాచ్ చావోరేవోగా మారింది. సిరీస్‌ను సమం చేయాలంటే ఈ మ్యాచ్‌లో గెలవడం తప్పించి మరో మార్గం లేనే లేదు. ఇప్పటికే టి20 సిరీస్‌ను కోల్పోయిన విండీస్ కనీసం వన్డేల్లోనైనా పరువును కాపాడుకోవాలని భావిస్తోంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే సిరీస్ సమంగా ముగుస్తోంది. లేకుంటే వన్లేల్లోనూ ఓటమి తప్పదు. ఇలాంటి పరిస్థితులో హోల్డర్ సేనపై తీవ్ర ఒత్తిడి నెలకొంది. ఒత్తిడిని తట్టుకుని ముందుకు సాగడం కరీబియన్ జట్టుకు కష్టమేనని చెప్పాలి. స్టార్ ఆటగాడు క్రిస్ గేల్ ఆడిన రెండు మ్యాచుల్లోనూ విఫలమయ్యాడు. ఈ మ్యాచ్‌లో కూడా ఎలా ఆడుతాడో అంతుబట్టడం లేదు. కనీసం ఆఖరి మ్యాచ్‌లోనైనా గేల్ తన బ్యాట్‌కు పని చెప్పాల్సిన అవసరం ఉంది. అంతేగాక ఇతర ఆటగాళ్లు కూడా తమవంతు పాత్ర పోషించక తప్పదు. సమష్టిగా రాణిస్తేనే విండీస్ గెలుపు అవకాశాలు మెరుగవుతాయి. లేకుంటే మరో ఓటమి ఖాయం.

IND vs WI 3rd ODI Match today

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post సిరీసే లక్ష్యంగా భారత్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: