మిషన్ భగీరథ పనుల్లో నాణ్యత పెంచండి…

 mission Bhagiratha

 

మహబూబ్‌నగర్: మిషన్ భగీరథ పనుల్లో నాణ్యత ఉండేలా చూడాలని రాష్ట్ర అబ్కారి, క్రీడలు, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఆదేశించారు. గురువారం ఏనుగొండలోని మిషన్ భగీరథ పనులను మంత్రి స్వయంగా దగ్గరుండి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… ప్రభుత్వం ప్రతిష్టాత్మకం గా తీసుకుంటున్న మిషన్ భగీరథ పథకం పనులను శరవేగంగా పూ ర్తిచేసి ఇంటింటికి తాగునీరు కల్పించాలని కోరారు. పనుల విషయంలో ఎక్కడా ఇబ్బందులు ఏర్పడినా వెంటనే అధికారులు దగ్గరుండి పరిశీలించి పూర్తయ్యేలా చూడాలని సూచించారు. పైప్‌లైన్ లీకేజీ కాకుండా వెంటనే ఎప్పటికప్పుడు సరిచేయాలని ఆదేశించారు. అన్ని వార్డులలోనూ మంచి నీటి పైపులు వెళ్లేలా చ ర్యలు తీసుకోవాలని కోరారు. త్వరలోనే ఇంటింటికి రక్షిత మంచినీటి సౌకర్యాన్ని అందిస్తామని చెప్పారు. ఇప్పటికే 90 శా తం పనులు పూర్తయ్యాయని మిగిలిన ప నులను వెంటనే పూర్తి చేసి తాగునీరు అందిస్తామన్నారు. తక్కువ ధరకే ప్రభు త్వం ఇంటింటికి రక్షిత నీటి సౌకర్యాన్ని అందించిన ఘనత దేశంలో ఎక్కడా లేద ని చెప్పారు. అధికారులు ఎప్పటికప్పుడు పనులు పర్యవేక్షించి సకాలంలో పూర్తి చే యాలని ఆదేశించారు. ఈ కార్యక్రమం లో టిఆర్‌ఎస్ నాయకులు కోరమోను వెంకటయ్య, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

 

Increase quality works of mission Bhagiratha

Related Images:

[See image gallery at manatelangana.news]

The post మిషన్ భగీరథ పనుల్లో నాణ్యత పెంచండి… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.