పంచాయతీ పారిశుద్ధ కార్మికుల వేతనాలు పెంపు

sanitary-workers

మన తెలంగాణ/హైదరాబాద్: గ్రామ పంచాయతీల్లోని పారిశుద్ధ్య కార్మికులకు ప్రభుత్వం జీతాలు పెంచింది. కార్మికుల వేతనం నెలకు రూ.8500 లకు పెం చుతూ ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి వికాస్‌రాజ్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. దీని ప్రకారం కనీస వేతనాన్ని పార్ట్ టైమ్‌గా పనిచేసేవారికి రూ.4 వేల నుంచి, పూర్తికాల కార్మికులకు రూ. 5 వేల నుంచి రూ. 8500లకు పెంచారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు విడుదల చేసిన గ్రాంట్ల నుండి ఈ వేతనాన్ని అందించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అలాగే గ్రామ పంచాయతీలలో బహుళార్ధసాధక కార్మికులను నియామకం చేయడానికి తగిన సూచనలను కూడా జారీ చేసింది. రాష్ట్రంలో 12,751 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఒక్క గ్రామ పంచాయతీలో ప్రతి 500 జనాభాకు ఒక కార్మికుడు ఉండాలి.

ఇలా ఒక్క పంచాయతీకి కనీసం ఇద్దరు కార్మికులు ఉండాలి. ఇందులో గ్రామానికి ట్రాక్టర్ ఉంటే ఆ కార్మికుడికి ట్రాక్టర్ నడిపేందుకు డ్రైవింగ్‌లో శిక్షణా ఇవ్వడబడతుంది. అవసరాల మేర ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్టు పద్ధతిలో నియమించుకున్న కార్మికుల జీతాలను పెంచుతున్నట్లు పేర్కొన్నారు. మల్టీ పర్పస్ వర్కర్ ప్రాథమిక విధి పారిశుద్ధ్యం కాగా, వారికి అప్పగించిన ఇతర పనులను కూడా నిర్వహించాల్సి ఉంటుంది. ఎన్ని కార్మికుల పోస్టులు అవసరమో ప్రతి ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో మండల పంచాయతీ అధికారి జిల్లాకలెక్టర్‌కు ప్రతిపాదనలు పంపుతారు. మల్టీ పర్పస్ వర్కర్‌లు అదే గ్రామంలో నివాసం ఉండాలి. ప్రభుత్వం జీతాలు పెంచడంపై పారిశుద్ద్య కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్‌కు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు.

Increase of wages of panchayat sanitary workers

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post పంచాయతీ పారిశుద్ధ కార్మికుల వేతనాలు పెంపు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.