వారానికి రెండుసార్లు స్క్రబ్ అవసరం…

  ఎండ వేడికి చర్మం, శిరోజ సౌందర్యం తగ్గుతుంది. చర్మం రంగు మారి ముడతలు పడుతుంది. మెరిసే కురులు బిరుసెక్కి రాలిపోతూ ఉంటాయి. ఈ సౌందర్య సమస్యలకు చెక్ పెట్టాలంటే వేసవిలో ఈ కొన్ని బ్యూటీ టిప్స్ తప్పక పాటించాలి. ముఖం కడగాలి: మైల్డ్ క్లీన్సర్‌తో రోజుకి కనీసం 4 సార్లు ముఖం శుభ్రం చేసుకోవాలి. వారానికి రెండుసార్లు జెల్ బేస్‌డ్ స్క్రబ్‌తో ముఖం రుద్దుకుంటే మృత కణాలు, సన్ ట్యాన్ తొలగిపోతాయి. ఈ ఎక్స్‌ఫాలియేట్ వల్ల […] The post వారానికి రెండుసార్లు స్క్రబ్ అవసరం… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ఎండ వేడికి చర్మం, శిరోజ సౌందర్యం తగ్గుతుంది. చర్మం రంగు మారి ముడతలు పడుతుంది. మెరిసే కురులు బిరుసెక్కి రాలిపోతూ ఉంటాయి. ఈ సౌందర్య సమస్యలకు చెక్ పెట్టాలంటే వేసవిలో ఈ కొన్ని బ్యూటీ టిప్స్ తప్పక పాటించాలి.

ముఖం కడగాలి: మైల్డ్ క్లీన్సర్‌తో రోజుకి కనీసం 4 సార్లు ముఖం శుభ్రం చేసుకోవాలి. వారానికి రెండుసార్లు జెల్ బేస్‌డ్ స్క్రబ్‌తో ముఖం రుద్దుకుంటే మృత కణాలు, సన్ ట్యాన్ తొలగిపోతాయి. ఈ ఎక్స్‌ఫాలియేట్ వల్ల చర్మం తాజాగా తయారవుతుంది.

జుట్టుకు నూనె: వెంట్రుకల కుదుళ్లకు నూనె పట్టించి గంట తర్వాత స్నానం చేయాలి. వారానికి రెండుసార్లు తల స్నానం తర్వాత కండిషనర్ అప్లై చేయాలి. ఇలా చేస్తే ఎండాకాలం వేడి నుంచి వెంట్రుకలకు రక్షణ దొరుకుతుంది.

ఫేస్ ప్యాక్: పెరుగు, గంధం పొడి, టమోటో రసం, కలబంద గుజ్జు…వీటితో ఇంట్లోనే ప్యాక్ తయారు చేసుకుని అప్లై చేసుకోవాలి. ఈ ప్యాక్ చర్మాన్ని శుభ్రపరిచి మెరుపునిస్తుంది.
ఫేసియల్ బ్లాటింగ్ పేపర్, సన్‌స్క్రీన్ లోషన్, వెట్ వైప్స్, లిప్ బామ్ పర్సులో వెంట తీసుకెళ్లాలి. వేడికి జర్మం జిడ్డుగా తయారైతే బ్లాటింగ్ పేపర్ అద్దుకోవాలి. ప్రతి నాలుగు గంటలకోసారి సన్‌స్క్రీన్ అప్లై చేయాలి. పెదవులు పొడిబారకుండా లిప్ బామ్ అప్లై చేయాలి. ధూళిని తుడవటానికి వెట్ వైప్స్ ఉపయోగించాలి.

 

In summer to take care of skin Aesthetics

Related Images:

[See image gallery at manatelangana.news]

The post వారానికి రెండుసార్లు స్క్రబ్ అవసరం… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: