మసాజ్‌తో రోగనిరోధక శక్తి

  తల్లులకు పసి పిల్లలతో అనుబంధం బలపడటానికి చక్కటి మార్గం…‘మర్దన’. దీని ద్వారా పిల్లల్లో అజీర్తి వల్ల కలిగే కడుపు నొప్పులు తొలగిపోతాయి. హాయిగా నిద్రపోతారు. రోగ నిరోధక శక్తి బలపడుతుంది. ఇలా చెప్పుకుంటూ పోతే మర్దన వల్ల పసి పిల్లలకు ఒరిగే ప్రయోజనాలెన్నో. కాబట్టి మర్దన గురించి కొన్ని టిప్స్ ప్రతి తల్లీ తెలుసుకోవాలి. మర్దనకు ముందు : మర్దన కోసం శుభ్రమైన, మెత్తని టవల్, పగిలే వీలులేని గిన్నె, మసాజ్ నూనె సిద్ధం చేసుకోవాలి. […] The post మసాజ్‌తో రోగనిరోధక శక్తి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

తల్లులకు పసి పిల్లలతో అనుబంధం బలపడటానికి చక్కటి మార్గం…‘మర్దన’. దీని ద్వారా పిల్లల్లో అజీర్తి వల్ల కలిగే కడుపు నొప్పులు తొలగిపోతాయి. హాయిగా నిద్రపోతారు. రోగ నిరోధక శక్తి బలపడుతుంది. ఇలా చెప్పుకుంటూ పోతే మర్దన వల్ల పసి పిల్లలకు ఒరిగే ప్రయోజనాలెన్నో. కాబట్టి మర్దన గురించి కొన్ని టిప్స్ ప్రతి తల్లీ తెలుసుకోవాలి.

మర్దనకు ముందు : మర్దన కోసం శుభ్రమైన, మెత్తని టవల్, పగిలే వీలులేని గిన్నె, మసాజ్ నూనె సిద్ధం చేసుకోవాలి. పాలిచ్చిన వెంటనే, పసి వాడు నిద్ర లేచిన వెంటనే మర్దనా చేయకూడదు. అందుకు కొంతసేపు ఆగాలి. పసికందులు పూర్తి స్పృహతో చలాకీగా ఉన్న సమయాన్నే మసాజ్‌కు ఎంచుకోవాలి. మసాజ్‌కు ఉపయోగించే నూనె పసికందు చర్మానికి సూటవుతుందో లేదో ఒకరోజు ముందుగానే పరీక్షించుకోవాలి.

కూర్చునే విధానం: మర్దన చేయడానికి తల్లులు కూర్చోడంలో ఓ పద్ధతి పాటించాలి. నేల మీద కూర్చుని రెండు అరికాళ్లు ఒకదానికొకటి ఆనించి కాళ్ల మధ్య డైమండ్ ఆకారం సృష్టించాలి. మెత్తటి టవల్‌ను పాదాల నుంచి మోకాళ్ల వరకూ కప్పాలి. బిడ్డ దుస్తులు తొలగించి తల కాళ్ల మీద ఎత్తులో ఉండేటట్టుగా పడుకోబెట్టి మర్దనా ప్రారంభించాలి.

మసాజ్ చేసే పద్ధతి: పసి పిల్లల శరీర చర్మం ఎంతో సున్నితంగా ఉంటుంది. కాబట్టి మృదువుగా మర్దనా సాగాలి. తల్లి వేళ్ల గోళ్లు నునుపుగా ఉండాలి. చిట్లి, చీరుకుపోయి ఉంటే వాటిని కత్తిరించాకే మర్దనా మొదలుపెట్టాలి. అర చేతుల చర్మం కూడా చిట్లకుండా చూసుకోవాలి. వేళ్లకు ఉంగరాలు, ఇతర ఆభరణాలు పెట్టుకోకూడదు. ఈ జాగ్రత్తలతోపాటు మర్దనలో కొన్ని పద్ధతులు పాటించాలి.

Immunity decrease with massage for Girlish babies

Related Images:

[See image gallery at manatelangana.news]

The post మసాజ్‌తో రోగనిరోధక శక్తి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.