ఐఎంఫ్ కూడా తగ్గించింది

imf

 

భారత్ వృద్ధి రేటు అంచనాను 6.8 నుండి 6.1 శాతానికి కోత

న్యూఢిల్లీ : ప్రపంచ బ్యాంకు తర్వాత ఐఎంఎఫ్ (ఇంటర్నేషనల్ మోనెటరీ ఫండ్) కూడా భారతదేశ వృద్ధి రేటు అంచనాలో కోత పెట్టింది. ఐఎంఎఫ్ 2018లో భారతదేశ వృద్ధి రేటు అంచనాను 6.8 శాతంగా ఉంచిన ప్పటికీ దానిని 2019కి 6.1 శాతానికి తగ్గించింది. ఇది ఏప్రిల్‌లో 7.3 శాతంగా ఉంటుందని అంచనా. అయితే ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు భారత్ జిడిపి అంచనాను 1.2 శాతం తగ్గించడం విశేషం. అలాగే ప్రపంచ వృద్ధి రేటు అంచనాను కూడా 3 శాతానికి తగ్గిస్తూ ఐఎంఎఫ్ నివేదిక విడుదల చేసింది. అయితే ఐఎంఎఫ్ 2020 సంవత్సరానికి గాను భారత ఆర్థిక వ్యవస్థను సానుకూలంగా ఉంటుందని చూపింది.

2020-21 ఆర్థిక సంవత్సరంలో భారత్ ఆర్థిక వృద్ధి రేటు 7 శాతంగా ఉంటుందని అంచనా వేసింది. ఇంతకుముందు ప్రపంచ బ్యాంకు భారతదేశ వృద్ధి రేటు అంచనాను 7.5 శాతం నుండి 6 శాతానికి తగ్గించింది. భారీ మందగమనం ఇప్పటికే సంక్షోభంలో కూరుకుపోయిన ఆర్థిక రంగ పరిస్థితిని మరింత దిగజార్చగలదని ప్రపంచ బ్యాంకు వెల్లడించింది. కాగా ఏప్రిల్‌లో ప్రపంచ బ్యాంకు 7.5 శాతం వృద్ధి రేటును అంచనా వేసింది. దీని తర్వాత వృద్ధి రేటు మొదటి త్రైమాసికంలో 5 శాతానికి పడిపోయింది. దేశంలో వినియోగదారుల డిమాండ్ తగ్గడం, ప్రభుత్వ వ్యయం తగ్గడం వల్ల ఆర్థిక వ్యవస్థ మందగించింది. వాస్తవానికి ఆర్థిక వ్యవస్థ సూచీలు గత కొన్ని నెలలుగా పేలవంగా పనిచేస్తున్నాయి.

పారిశ్రామిక ఉత్పత్తి బాగా పడిపోయింది. ఆగస్టులో దీని పనితీరు గత ఆరు సంవత్సరాలలో దారుణంగా ఉంది. ఆర్థిక వ్యవస్థను వేగవంతం చేయడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం మార్పును తీసుకురావడం లేదని స్పష్టమవుతోంది. ఆర్థిక వ్యవస్థను వేగవంతం చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఈ సంవత్సరం వడ్డీ రేటును ఐదు రెట్లు తగ్గించింది. ఆర్థిక వ్యవస్థ సమస్యల దృష్ట్యా ఆర్‌బిఐ తన వృద్ధి రేటు అంచనాను 6.9 శాతం నుంచి 6.1 శాతానికి తగ్గించింది.

IMF cut India’s growth rate

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ఐఎంఫ్ కూడా తగ్గించింది appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.