రానాకు అనారోగ్యం…?

హైదరాబాద్ : ప్రముఖ నటుడు రానా దగ్గుబాటి అనారోగ్యంతో బాధపడుతున్నట్టు టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అనారోగ్యం కారణంగానే రానా బక్క చిక్కిపోయారంటూ వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలపై రానా స్పందించారు. తన ఆరోగ్యం బాగానే ఉందని ఆయన తేల్చి చెప్పారు. ‘హాథీ మేరే సాథీ’ సినిమా కోసమే సన్నబడాల్సి వచ్చిందని ఆయన తెలిపారు. అడవిలో 30 ఏళ్లు ఉండిపోయిన వ్యక్తి పాత్రలో తాను నటిస్తున్నానని, ఈ క్రమంలో  ఈ పాత్ర కోసం తాను సన్నాబడాలని దర్శకుడు […] The post రానాకు అనారోగ్యం…? appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

హైదరాబాద్ : ప్రముఖ నటుడు రానా దగ్గుబాటి అనారోగ్యంతో బాధపడుతున్నట్టు టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అనారోగ్యం కారణంగానే రానా బక్క చిక్కిపోయారంటూ వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలపై రానా స్పందించారు. తన ఆరోగ్యం బాగానే ఉందని ఆయన తేల్చి చెప్పారు. ‘హాథీ మేరే సాథీ’ సినిమా కోసమే సన్నబడాల్సి వచ్చిందని ఆయన తెలిపారు. అడవిలో 30 ఏళ్లు ఉండిపోయిన వ్యక్తి పాత్రలో తాను నటిస్తున్నానని, ఈ క్రమంలో  ఈ పాత్ర కోసం తాను సన్నాబడాలని దర్శకుడు చెబితే , సన్నబడ్డానని ఆయన చెప్పారు.  ఈ సినిమా షూటింగు పూర్తైన వెంటనే మళ్లీ బరువు పెరుగుతానని రానా పేర్కొన్నారు. తన ఆరోగ్యంపై రానా స్పష్టత ఇవ్వడంతో ఆయన అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం రానా ’విరాటపర్వం‘ సినిమాలో నటిస్తున్నారు.

Illness To Tollywood Actor Rana Daggubati

 

Related Images:

[See image gallery at manatelangana.news]

The post రానాకు అనారోగ్యం…? appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.