అక్రమ ఇసుక రవాణాకు చెక్…

  ఇసుక అమ్మకానికి రూపకల్పన చేసిన ప్రభుత్వం మెదక్‌లో తీరనున్న వినియోగదారుల కష్టాలు సుభాష్‌రెడ్డితో మెదక్‌లో శుభకార్యం మెదక్ : ప్రకృతి సంపదను దోచుకుంటున్న వారి ఆగాడాలను అరికట్టడ ంతో పాటు వినియోగదారులకు ఇసుక అందుబాటులోకి తీసుకువచ్చేందుకు రాష్ట్ర మైనింగ్ కార్పొరేషన్ చైర్మన్, ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా జిల్లా కేంద్రంలో ఇసుక అమ్మకం కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మెదక్ ప్రాంతంలోని హల్దివాగుతోపాటు తదితర ప్రాంతా ల్లో హైకోర్టు స్టే ఉన్న దృష్టా ఇసుక […] The post అక్రమ ఇసుక రవాణాకు చెక్… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ఇసుక అమ్మకానికి రూపకల్పన చేసిన ప్రభుత్వం
మెదక్‌లో తీరనున్న వినియోగదారుల కష్టాలు
సుభాష్‌రెడ్డితో మెదక్‌లో శుభకార్యం

మెదక్ : ప్రకృతి సంపదను దోచుకుంటున్న వారి ఆగాడాలను అరికట్టడ ంతో పాటు వినియోగదారులకు ఇసుక అందుబాటులోకి తీసుకువచ్చేందుకు రాష్ట్ర మైనింగ్ కార్పొరేషన్ చైర్మన్, ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా జిల్లా కేంద్రంలో ఇసుక అమ్మకం కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మెదక్ ప్రాంతంలోని హల్దివాగుతోపాటు తదితర ప్రాంతా ల్లో హైకోర్టు స్టే ఉన్న దృష్టా ఇసుక మాఫియాను వినియోగదారుల నుంచి భారీ మొత్తంలో డబ్బులు దండుకొని అక్రమ ఇసుకను కొనుగోలు చేస్తున్నారు.

మైనింగ్ మాఫియాలు, ఇసుక అక్రమంగా రవాణా చేసి మెదక్‌లో చేపడుతున్న కట్టడాలకు పెద్ద మొ త్తంలో ధర పెంచి నాసిరకం ఇసుకను అమ్మడంతో వినియోగదారులు లబోదిబోమంటున్నారు. మెదక్ ప్రాంతంలోని ఇసుక డిమాండ్ దృష్టా రాష్ట్ర మైనిం గ్ కార్పొరేషన్ చైర్మన్ సుభాష్‌రెడ్డి జిల్లా కేంద్రంలో ఇసుక కేంద్రం ఏర్పాటు చేయాలనే లక్షం నేరవేరిం ది. ఇసుక కేంద్రం నుంచి సాండ్ ట్యాక్సీ అమలు వి ధానాన్ని ఇందుకు ప్రత్యేక వెబ్‌సైట్‌ను రూపొందించింది. ఇసుక కావాల్సిన వినియోగదారుడు నేరుగా సాండ్‌ట్యాక్సీ వెబ్‌సైట్‌ను లాగిన్ అయి చెల్లించాల్సి న రుసుము ఆన్‌లైన్ ద్వారా చెల్లించాలి. ఇసుక ఖ రీదు, వాహనం కిరాయి, లోడింగ్ ఖర్చులను అన్ని ంటిని కలిపి వినియోగదారుడు చెల్లించిన మొత్తా న్ని లెక్క కట్టి అసలు ధరను నిర్ణయించాలి. ఇంటి నిర్మాణం కోసం ప్రజలు ఇసుకను బహిరంగ మార్కెట్‌లో వేల రూపాయలు ఖర్చు చేసి కొనుగోలు చే యాల్సిన పరిస్థితులకు చెక్ పడింది.

సాండ్ ట్యాక్సీ పని విధానాన్ని అమలు చేయడానికి మెరిటోనిక్స్ అనే సాప్ట్‌వేర్ సంస్థతో ప్రత్యేక సాప్ట్‌వేర్ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం రూపొందించింది. దీంతో వినియోగదారునికి ఇసుక నేరుగా చేరనుంది. ఈ విధానంలో ప్రభుత్వ అధికారులే వాహనదారులతో ఒప్పందం కుదర్చుకునే విధానాలను రూపొందించనున్నారు. ఇసుక రవాణా వాహనాలకు జియోట్యాగింగ్ పద్ధతితో పాటు వాహన యజమానికి , అధికారులకు, వినియోగదారులకు ఇసుకను ఆర్డర్ చేసి వెంటనే మెసేజ్ రూపంలో సమాచారం అందించనున్నారు. సమాచారాన్ని బట్టి వినియోగదారునికి ఇసుకను నేరుగా చేరవేస్తారు.

ఈ విధానం వల్ల వినియోగదారుడు ఎలాంటి అదనపు చెల్లింపులు చెల్లించకపోవడంతో పాటు నికరమైనటు వంటి ఇసుకను పొందే అవకాశం ఉంది. కాగా వర్షాకాలంలోను ఇ సుకను కొనుగోలు చేయడానికి అవకాశం సులువుగా ఉంటుంది. మైనింగ్ శాఖ ఆధ్వర్యంలో జి ల్లా కేంద్రంలోని హౌజింగ్ బోర్డులో ఇసుక అమ్మక కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మెదక్ జి ల్లాలో ఇసుక ఇబ్బంది వల్ల ప్రభుత్వంతో చర్చించి సిఎం కెసిఆర్ చొరవతో జిల్లా కేంద్రంలో ఇసుక కేంద్రాన్ని ప్రవేశపెట్టినట్లు ఎమ్మెల్సీ సుభాష్‌రెడ్డి తెలిపారు.

Illicit Sand Transport to ban

Related Images:

[See image gallery at manatelangana.news]

The post అక్రమ ఇసుక రవాణాకు చెక్… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: