యజమాని కూతురుతో పెళ్లి…సౌదీ జైల్లో నిజమాబాద్ యువకుడు

  యజమాని కూతురిని పెళ్లీ చేసుకొన్న ఓ యువకుడు సౌదిలో జైలుపాలయ్యాడు. నిజామాబాద్ జిల్లాకు చెందిన షేక్ అజీముద్దీన్ బతుకుతెరువు కోసం సౌది అరేబియ‌ వెళ్లి డ్రైవ‌ర్ గా ఉద్యోగం చేసుకుంటు జీవ‌నం సాగిస్తున్నాడు. అయితే, ఈ క్రమంలో యాజ‌మాని కుతురు నాస‌ర్‌తో అజీముద్దీన్ ప్రేమ‌లో ప‌డ్డాడు. ఈ విష‌యం తెలిసుకున్న నసీర్ తండ్రి అజీముద్దీన్ ను ఉద్యోగం నుంచి తోల‌గించి ఇండియాకు పంపించాడు. దీంతో నసీర్, అజీముద్దీన్ కోసం సౌది నుంచి నేపాల్ మిదుగా డిల్లీకి […] The post యజమాని కూతురుతో పెళ్లి… సౌదీ జైల్లో నిజమాబాద్ యువకుడు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

యజమాని కూతురిని పెళ్లీ చేసుకొన్న ఓ యువకుడు సౌదిలో జైలుపాలయ్యాడు. నిజామాబాద్ జిల్లాకు చెందిన షేక్ అజీముద్దీన్ బతుకుతెరువు కోసం సౌది అరేబియ‌ వెళ్లి డ్రైవ‌ర్ గా ఉద్యోగం చేసుకుంటు జీవ‌నం సాగిస్తున్నాడు. అయితే, ఈ క్రమంలో యాజ‌మాని కుతురు నాస‌ర్‌తో అజీముద్దీన్ ప్రేమ‌లో ప‌డ్డాడు. ఈ విష‌యం తెలిసుకున్న నసీర్ తండ్రి అజీముద్దీన్ ను ఉద్యోగం నుంచి తోల‌గించి ఇండియాకు పంపించాడు. దీంతో నసీర్, అజీముద్దీన్ కోసం సౌది నుంచి నేపాల్ మిదుగా డిల్లీకి చేరుకుని అజీముద్దీన్ కు ఫోన్ చేసి విష‌యం చెప్ప‌ింది.దీంతో అజీముద్దీన్ ఢిల్లీ వెళ్లి నసీర్ ను నిజామాబాద్ కు తీసుకువ‌చ్చి పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయం తెలసుకున్న ఆమె తండ్రి ఇండియా వచ్చి ఇక్కడి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

అయితే ఇద్దరు కూడా మేజర్లని పరస్పర అంగీకారంతో పెళ్లి చేసుకున్నారని పోలీసుల కౌన్సిలింగ్ లో తేలడంతో అమ్మాయి తండ్రిని వెనక్కి పంపించేశారు.  అజీమ్ కోసం నసీర్ విజిట్ వీసాతో నేపాల్ వరకు వచ్చి అక్రమ మార్గంలో భారత్ చేరిందని పోలీసులు గర్తించారు. ప్రేమ కోసం అక్రమమార్గంలో దేశంలోకి వ‌చ్చిన‌ ప్రియురాలిని పోలీసులు అరెస్టు చేసి 20 రోజుల పాటు రిమాండ్ ఖైదీగా జైల్లో పెట్టారు. ఆ త‌రువాత కేసు క్లోజ్ చేసి ఆమెకు గ‌వ‌ర్న‌మెంట్ ప‌ర్మిష‌న్ ఇచ్చింది. ఆ తర్వాత నసీర్ గర్భవతి అయ్యింది. దీంతో అంత సుఖాంత మైందని అనుకుంటున్న సమయంలో నసీర్ తండ్రి కపట ప్రేమ చూపించాడు. ఫోన్ చేసి కూతురు, అల్లుడు సౌదికి రావాల‌ని వీసాలు కూడా పంపాడు. గుడ్డిగా నమ్మి ఇద్దరూ సౌదీకి వెళ్లారు. వారు జెడ్డా ఎయిర్ పోర్టు చేరుకోగానే.. తన కూతురిని మోసం చేసి పెళ్లీ చేసుకున్నాడని అల్లున్ని అరెస్టు చేసి జైల్ లో పెట్టించాడు. ఈ విషయం తెలుసుకున్న అజీముద్దీన్ కుటుంబ సభ్యులు జైల్ పాలైన త‌న కోడుకుని ఇండియాకు రప్పించాలంటూ ప్ర‌భుత్వాన్ని కోరుతుంది.

Illegal marriage lands Nizamabad man in Saudi jail

The post యజమాని కూతురుతో పెళ్లి… సౌదీ జైల్లో నిజమాబాద్ యువకుడు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: