రూపాయికే రక్తపరీక్ష!

కోల్‌కతా: రోగ నిర్ధారణకు కేవలం రూపాయి ఛార్జితోనే రక్తపరీక్ష చేయగల సాధనాన్ని ఐఐటి ఖరగ్‌పూర్ పరిశోధకులు కనుగొన్నారు. ఈ సాధనంతో వేలినుంచి తీసిన రక్త నమూనా పరీక్షించి రోగ నిర్ధారణ చేస్తారు. కాగితం ముక్క ఆధారంగా రూపొందించిన కిట్‌కు స్మార్ట్ ఫోన్, ఎల్‌ఇడి లైటు, అమర్చారు. వీటి ద్వారా పరీక్ష ఫలితాన్ని విశ్లేషిస్తారు. ప్రొఫెసర్ సుమన్ చక్రవర్తి ఆధ్వర్యంలోని పరిశోధక బృందం ఈ కిట్‌ను రూపొందించింది. లేబొరేటరీ కండిషన్ల ప్రకారం ప్రతి పరీక్ష రూపాయికి మించి ఖర్చు […] The post రూపాయికే రక్తపరీక్ష! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.


కోల్‌కతా: రోగ నిర్ధారణకు కేవలం రూపాయి ఛార్జితోనే రక్తపరీక్ష చేయగల సాధనాన్ని ఐఐటి ఖరగ్‌పూర్ పరిశోధకులు కనుగొన్నారు. ఈ సాధనంతో వేలినుంచి తీసిన రక్త నమూనా పరీక్షించి రోగ నిర్ధారణ చేస్తారు. కాగితం ముక్క ఆధారంగా రూపొందించిన కిట్‌కు స్మార్ట్ ఫోన్, ఎల్‌ఇడి లైటు, అమర్చారు. వీటి ద్వారా పరీక్ష ఫలితాన్ని విశ్లేషిస్తారు. ప్రొఫెసర్ సుమన్ చక్రవర్తి ఆధ్వర్యంలోని పరిశోధక బృందం ఈ కిట్‌ను రూపొందించింది. లేబొరేటరీ కండిషన్ల ప్రకారం ప్రతి పరీక్ష రూపాయికి మించి ఖర్చు కాదు.

అయితే వాణిజ్య పరంగా ఈ ఖర్చు కాస్త ఎక్కువ కావచ్చు అని పరిశోధకులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సాధనం వినియోగించడానికి కాగితం ఆధారమైన సాధనం చాంబర్‌కు ఒక రక్తం చుక్క, రసాయన రీఏజెంట్ చుక్క చాలు. ఈ పరీక్ష చేయడానికి ఎలాంటి శిక్షణ అక్కర లేదు. బ్లడ్ గ్లూకోజు, హెమోగ్లోబిన్ పరీక్షలు విస్తృతంగా చేయవచ్చునని చక్రవర్తి చెప్పారు. అసాధారణ వాతావరణ పరిస్థితుల్లోను, చెత్త, దుమ్ము, ధూళి, తేమ ఎక్కువగా వ్యాపించే ప్రదేశాల్లో క్లినిక్‌లు, ఎసి లేబొరేటరీలు లేని ప్రదేశాల్లోనూ ఈ పరీక్షలు నిర్వహించామని వివరించారు.

IIT Kharagpur researchers make low cost blood test device

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post రూపాయికే రక్తపరీక్ష! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: