పని లేకుంటే మేం బతుకుడెట్లా?

రెక్కలుముక్కలుచేసి పనిచేసినా దక్కని కూలీ బీడీ కార్మికుల సంక్షేమంపట్టని కంపెనీలు పొగచూరుతున్న బీడీ కార్మికుల బతుకులు   పుర్రె గుర్తు, జిఎస్‌టి దెబ్బతో బీడి పరిశ్రమ విలవిల కార్మికులకు నెలలో పది రోజులకు మించి దొరకని పని దినాలు చేతినిండా పని లేక ఆర్థికంగా తిప్పలు                                              […]

రెక్కలుముక్కలుచేసి పనిచేసినా దక్కని కూలీ
బీడీ కార్మికుల సంక్షేమంపట్టని కంపెనీలు
పొగచూరుతున్న బీడీ కార్మికుల బతుకులు  

పుర్రె గుర్తు, జిఎస్‌టి దెబ్బతో బీడి పరిశ్రమ విలవిల
కార్మికులకు నెలలో పది రోజులకు మించి దొరకని పని దినాలు
చేతినిండా పని లేక ఆర్థికంగా తిప్పలు                                                                                                                        సమ్మెకు సిద్ధమవుతున్న కార్మిక సంఘాలు

బీడిలు చుడితేనే పొట్ట గడిచే కా ర్మికుల కుటుంబాలు చేతి నిండా పని లేక ఒక పూట తిని, మరో పూట పస్తులుండాల్సిన గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. జిఎస్‌టి దెబ్బతో బీడి పరిశ్రమపై పన్నుల భారం పడటం, తంబాకు కొరతతో చాలా వరకు బీడి కంపెనీలు ఉత్పత్తిని తగ్గిస్తూ వస్తున్నాయి. దాంతో ఏళ్లుగా బీడి పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్న కార్మికులకు నెలలో 10 రోజులకు మించి పని దొరక డం లేదు. చేతినిండా పని లేక కార్మిక కు టుంబాలు ఆర్థికంగా తిప్పలు పడుతున్నాయి. బీడి అమ్మకాలు రోజు రోజుకు తగ్గిపోతున్న నేపథ్యంలో బీడి కార్మికులకు ప్రత్నామ్నాయ మార్గాలు చూపించాల్సిన కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఆ దిశగా ఏర్పాట్లు చేయ కపోవడంతో కార్మికులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు.

మనతెలంగాణ/జగిత్యాల: జిల్లాలో సుమారు లక్షకు పైగా మహిళలు బీడీలు చుడుతూ జీవ నం పొందుతున్నారు. జిల్లాలో పాతవి, కొత్తవి కలుపుకుని 380 గ్రామ పంచాయతీలు ఉండ గా ఐదు మున్సిపాలిటీలు ఉన్నాయి. ప్రతి గ్రామంలో బీడి కంపెనీలు కొనసాగుతు న్నాయి. అయితే గతంలో ఒక్కో గ్రామం నుంచివేల సంఖ్యలో బీడి ఉత్పత్తి కాగా నేడు కార్మి కులకు చేతి నిండా పని లేక రెండు పూటలా కడుపు నిండా తిండి తినలేని పరిస్థితి నెలకొంది. రెక్కా డితే గానీ డొక్కా డని బీడీ కార్మికుల జీవితాలు పొగచూరిపోతున్నాయి. ఇప్పటికే మినీ సిగ రేట్, తక్కువ ధర సిగరేట్లు మార్కెట్లోకి రావడంతో బీడిలు తాగే వారి సంఖ్య క్రమ క్రమంగా తగ్గుతూ వస్తోంది. “గోరు చుట్టపై రోకలి పోటు” అన్న చందంగా బీడీ కట్టలపై 85 శాతం మేర గొంతు క్యాన్సర్ హెచ్చరిక గుర్తును ముద్రించాలని కేంద్ర ప్రభుత్వం 727(ఇ) జిఓ జారీ చేయడంతో పాటు బీడి ఉత్పత్తులపై జిఎస్ టి విధించడంతో బీడి పరిశ్రమపై తీవ్ర ప్రభావం పడింది. రోజు బీడిలు చుడితే రూ.150నుంచి 200వస్తేనే తమ కుటుంబాలు గడిచే వని, బీడి కంపెనీలు ఉత్పత్తిని చాలావరకు తగ్గించడంతో నెలలో 10 రోజులు కూడా పని దొరకడం లేదని కార్మికులు ఆవేదనచెందుతున్నారు. అయితే బీడీ కార్మికులను ఆదుకు నేందుకు రాష్ట్ర ప్రభుత్వం నెలకు వెయ్యి రూపాయల జీవన భృతిఅందించడవల్ల కొంత ఆర్థికంగా వెసులు బాటు కలిగినారోజురోజుకు పెరుగుతున్న నిత్యావసర ధరలతో చేతి నిండా పనిదొరకక, ప్రభుత్వం ఇచ్చే జీవనభృతి సరి పోక కార్మికు లు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నెలలో కనీసం పది రోజులు కూడా పనిదొరకకపోవడంతో తామెట్లా బతికేదని వారు ప్రశ్ని స్తు న్నారు. కూలీ ధరలు, పనిదినాల పెంపు విషయంలో బీడి కంపెనీలు తమ కేమి పట్టనట్లు వ్యవహరిస్తున్నాయని, న్యాయమైన డిమాండ్లు సాధించేందుకు సమ్మెకు దిగుతా మంటూ కార్మిక సంఘాల నాయకులు పేర్కొంటున్నారు.

పెరగని కూలీ ధరలు
రెక్కాడితే గాని డొక్కాడని బీడీ కార్మికులకు ప్రస్తుతం ఇస్తున్న కూలీ ధరలకు అదనంగా 50 శాతం పెంచాల్సి ఉండగా బీడీకంపెనీలు కూలీ రేట్లు పెంచక శ్రమ దోపిడికి పాల్పడుతు న్నాయి. రాష్ట్రంలోని బీడి కార్మికులందరికీ 50 శాతం కూలీ రేట్ల పెంపుదలపై నూతన ఒప్పం దం జరగాల్సి ఉండగా బీడీ కంపెనీల యాజమాన్యాలు ఆ ఊసే ఎత్తడం లేదని తెలుస్తోంది. 2010 సంవత్సరంలో బీడి పరిశ్రమలో పని చేస్తున్న కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలని కోరుతూ 32 రోజుల పాటు సమ్మె చేస్తే దిగి వచ్చిన ప్రభుత్వం 2012 ఫిబ్ర వరిలో జిఓ 41 విడుదలచేసింది. ఈ జిఓ ప్రకారం 1000 బీడీలు చుడితే మూలవేతనంగా రూ.158 ఇవ్వాలని, విడివి ప్రతిపాయింట్‌కు 21 పైసలు చెల్లించాల్సి ఉండగా ప్రస్తుతం బీడీ కార్మి కులకు మూల వేతనంగా రూ.105, కరువు భత్యం,బోనస్, ఇతరబెనిఫిట్ లను కలుపుకుని 1000 బీడీలకు రూ. 175. 99 మాత్రమే చెల్లిస్తున్నారు. వీటి కి తోడు మహిళ లకు ప్రసూతి సెలవులు ఇవ్వాలని పేర్కొన్నా బీడీ యాజ మాన్యాలు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ఆ జిఓను అమలు చేయకుండా అడ్డుపడ్డాయని కార్మిక సంఘాలు ఆరోపి స్తున్నాయి. గత రెండు సంవత్సరాల ఒప్పంద గడువు మే 31తో ముగిసినా, కొత్త కూలీ ధరల పెంపు విషయమై బీడీ యాజమాన్యాలు కార్మిక సంఘాలతో చర్చలు జరిపేందుకు ముందుకు రావడం లేదని కార్మిక సంఘాల నాయకులు పేర్కొంటున్నారు. బీడీ కార్మికులకు ప్రస్తుతం ఇస్తున్న కూలీపై 50 శాతం అదనంగా అందించడంతో పాటు నెలలో 26 రోజుల పని దినాలు కల్పించినప్పుడే ఆయా కుటుంబాలకు రెండు పూటలా తిండి దొరుకు తుందని కార్మికనేతలు చెబుతున్నారు.

బీడి కార్మికుల సంక్షేమం ఏది…?
బీడి కార్మికుల సంక్షేమం కోసం కృషి చేస్తున్నామని చెప్పుకుంటున్న ప్రభు త్వా లు, యాజమాన్యాలు కార్మికుల సంక్షేమాన్ని ఏనాడు పట్టించుకున్న పాపా న పోలేదని కార్మికులు ఆరోపిస్తున్నారు. బీడీ కార్మికులకు నివేశనా స్థలాలు, ఇండ్లు మంజూరు చేస్తామని చెప్పి ఏళ్లు గడుస్తున్నా అవి అందని ద్రాక్షగానే మిగి లిపోయాయని పేర్కొంటున్నారు. ఉదయం లేచింది మొదలు అర్ధరాత్రి వరకు బీడీలు చుట్టనిదే తమ కుటుంబాలు గడవని పరిస్థితి ఏర్పడిందని, తంబాకు వాసన, పొద్దంతా కూర్చుండి బీడీలు చుట్టడం వల్ల ఆనా రోగ్యం పాలై మం చం పడుతున్నా వైద్య సేవలు అందుబాటులోకి రావడం లేదని ఆరో స్తు న్నారు. బీడి కార్మికులను బీడీ కమీషన్ ఏజెంట్లు ఆకు,తంబాకులో కోత, బీడీలు మంచి గా లేవంటూ కట్టలు తెంపుతూ మోసం చేస్తుండగా కంపెనీలు చాలీచాలనీ వేత నా లందిస్తూ తమ శ్రమను దోచుకుంటున్నాయని, ఇవి చాలవన్నట్లు కేంద్ర ప్రభు త్వం జారీ చేసిన 727 (ఇ) జిఓ, జిఎస్‌టితో బీడి పరిశ్రమపై ఆధారపడి జీవి స్తున్న కార్మికుల జీవితాలు పొగచూ రిపోయే ప్రమాదం నెలకొందని ఆందో ళన చెందుతున్నారు.

వేతనాలు పెంచి ఆదుకోవాలి :  ఎం.డి.ముక్రం, ఎఐటియుసి జిల్లా కార్యదర్శి
బీడి పరిశ్రమలో పనిచేస్తున్న వారంతా బడుగు, బలహీనవర్గాలకు చెందిన వారు కాగా, 98 శాతం మంది నిరక్షరాస్యులైన మహిళలే. పెరుగుతున్న నిత్యావసరాల ధరల నేపథ్యంలో కూలీ ధరలు 50 శాతం పెరగాలి. కూలీలకు చేతి నిండా పని కల్పించాలి. గత రెండు సంవ త్సరాలుగా నెల రోజుల్లో కనీసం 15 రోజులు కూడా చేతి నిండా పని దొరకడం లేదు. దాంతో బీడి పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్న వేలాది కుటుంబాలు రెండు పూటలా కడుపు నిండా తిండి తినే పరిస్థితి లేకుండా పోయింది. కూలీ రేట్ల పెంపుదలపై నూతన ఒప్పందం జరగాలి మాసం నరేందర్, నవతెలంగాణ బీడి వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు రాష్ట్రంలోని బీడి కార్మికులందరికీ 50 శాతం కూలీ రేట్ల పెంపుదలపై నూతన ఒప్పందం జరగాల్సి ఉంది. కూలీ రేట్లు పెంచాలనే డిమాండ్‌తో జూన్ 1న బీడి యాజమాన్య సంఘానికి నోటీసు ఇచ్చాం. రెండు నెలలు కావస్తున్నా బీడి యాజమాన్యాలు కూలీ రేట్ల పెంపుదల గురించి స్పందించకపోవడం శోచ నీ యం. బీడీ కంపెనీల యాజమాన్యాలు ఇప్పటికైనా కార్మిక సంఘాలను చర్చల కు పిలిచి కూలీ రేట్లను పెంచడంతో పాటు నెలలో 26 రోజుల పని కల్పించాలి.

Comments

comments

Related Stories: