పనిచేసే ప్రతి కార్యకర్తకు గుర్తింపు…

  జడ్పీఛైర్మన్ల ప్రమాణస్వీకారంలో మంత్రి ఎర్రబెల్లి వరంగల్ : బంగారు తెలంగాణగా అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న కృషికి పార్టీ పరంగా సహకరిస్తున్న ప్రతీ కార్యకర్తకు ఏదో రకమైన గుర్తింపు లభిస్తుందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. వరంగల్ ఉమ్మడి జిల్లాలోని నాలుగు జిల్లా పరిషత్‌ల ఛైర్మన్, వైస్ ఛైర్మన్ల పదవీ ప్రమాణస్వీకారోత్సవంలో ఆయన పాల్గొన్నారు. వరంగల్ అర్బన్‌లో డాక్టర్ సుధీర్‌కుమార్, వరంగల్ రూరల్‌లో గండ్ర జ్యోతి, జనగామలో సంపత్‌రెడ్డిలు జడ్పీ ఛైర్‌పర్సన్లుగా […] The post పనిచేసే ప్రతి కార్యకర్తకు గుర్తింపు… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

జడ్పీఛైర్మన్ల ప్రమాణస్వీకారంలో మంత్రి ఎర్రబెల్లి

వరంగల్ : బంగారు తెలంగాణగా అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న కృషికి పార్టీ పరంగా సహకరిస్తున్న ప్రతీ కార్యకర్తకు ఏదో రకమైన గుర్తింపు లభిస్తుందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. వరంగల్ ఉమ్మడి జిల్లాలోని నాలుగు జిల్లా పరిషత్‌ల ఛైర్మన్, వైస్ ఛైర్మన్ల పదవీ ప్రమాణస్వీకారోత్సవంలో ఆయన పాల్గొన్నారు. వరంగల్ అర్బన్‌లో డాక్టర్ సుధీర్‌కుమార్, వరంగల్ రూరల్‌లో గండ్ర జ్యోతి, జనగామలో సంపత్‌రెడ్డిలు జడ్పీ ఛైర్‌పర్సన్లుగా చేసిన ప్రమాణస్వీకార మహోత్సవానికి ఆయన హజరైన అనంతరం వారిని ఉద్దేశించి మాట్లాడారు.

జిల్లా పరిషత్ ఛైర్మన్లుగా, వైస్ ఛైర్మన్లుగా ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు పార్టీలో క్రియాశీల కార్యకర్తలుగా పనిచేసిన వారేనన్నారు. అవకాశాలను బట్టి ఎవరికైనా ఉన్నతమైన పదవులు లభిస్తాయనడానికి నేడు పదవీ ప్రమాణ స్వీకారం చేసిన వీరే సాక్షమన్నారు. టీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర అభివృద్ధి కోసం ఏర్పడితే అందులో పనిచేస్తున్న కార్యకర్తలు అంచలంచెలుగా ఎదుగుతున్నారన్నారు. దీనిని గుర్తుపెట్టుకుని రానున్న మున్సిపల్ ఎన్నికల్లో అన్ని గెలిచే విధంగా కృషి చేయాలన్నారు. పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో పనిచేయాల్సిన జిల్లా పరిషత్ పాలక వర్గాలు గ్రామీణాభివృద్ధి, వికాసం, సంక్షేమం కోసం ప్రజాప్రతినిధులు పాటుపడాలన్నారు. ఈనెలలో హరితహారం కార్యక్రమంలో కొనసాగుతున్నందున విజయవంతం చేసేందుకు ప్రతీ ప్రజాప్రతినిధి వారి వారి పరిధిలో లక్షానికి అనుగుణంగా పనిచేయాలన్నారు.

నూతన పంచాయతీరాజ్ చట్టం ప్రకారంగా హరితహారం మొక్కల పెంపకంలో వారికే పూర్తి బాధ్యతలున్నాయన్నారు. కొత్త చట్టం ద్వారా ప్రజలకు, ప్రజాప్రతినిధులకు విశేషమైన అధికారాలు ఉన్నాయన్నారు. ప్రతీ ఇంటికి నల్లాతో మంచినీరు అందించడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన మిషన్ భగీరథ పథకం దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. ఈ పథకం ఫలితాలు జిల్లా పరిషత్ పాలకవర్గం ఆధ్వర్యంలోనే పూర్తిచేయాల్సి ఉంటుందన్నారు. పెరిగిన ఆసరా పింఛన్ల మొత్తాన్ని అందరికి అందచేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. జనగామ, వరంగల్ రూరల్, అర్బన్ జిల్లాల సమగ్రాభివృద్ధికి ప్రజాప్రతినిధులంతా సమష్టిగా కృషిచేయాలన్నారు.

స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు పదవికి గౌరవం తెచ్చే విధంగా నడుచుకోవాలన్నారు. అధికారుల అలసత్వం, అధికార దుర్వినియోగం చేసే వారిపై నూతన చట్టం ద్వారా కఠినమైన చర్యలు తీసుకుంటామన్నారు. కొత్తగా ఎన్నికైన ప్రజాప్రతినిధులందరికి శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, బోడకుంటి వెంకటేశ్వర్లు, కడియం శ్రీహరి, ఎమ్మెల్యేలుటి. రాజయ్య, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, ఆరూరి రమేశ్, చల్లా ధర్మారెడ్డి, పెద్ది సుదర్శన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Identification for every Activist who works

Related Images:

[See image gallery at manatelangana.news]

The post పనిచేసే ప్రతి కార్యకర్తకు గుర్తింపు… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.