మార్చి 9 నుంచి ఐసెట్ దరఖాస్తులు

  హైదరాబాద్ : ఎంబిఎ, ఎంసిఎ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఐసెట్ దరఖాస్తుల స్వీకరణను మార్చి 9 నుంచి చేపట్టనున్నారు. బుధవారం ఉన్నత విద్యామండలి కార్యాలయంలో నిర్వహించిన ఐసెట్ కమిటీ సమావేశంలో ప్రాథమిక షెడ్యూల్‌ను నిర్ణయించారు. మార్చి 6వ తేదీన నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. ఈ సమావేశంలో ఉన్నత విద్యామండలి ఛైర్మన్ టి.పాపిరెడ్డి, ఐసెట్ కన్వీనర్ కె.రాజిరెడ్డి, ఐసెట్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మే 20,21 తేదీలలో ఆన్‌లైన్ విధానంలో ఐసెట్ పరీక్ష నిర్వహించనున్నారు. మే […] The post మార్చి 9 నుంచి ఐసెట్ దరఖాస్తులు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

హైదరాబాద్ : ఎంబిఎ, ఎంసిఎ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఐసెట్ దరఖాస్తుల స్వీకరణను మార్చి 9 నుంచి చేపట్టనున్నారు. బుధవారం ఉన్నత విద్యామండలి కార్యాలయంలో నిర్వహించిన ఐసెట్ కమిటీ సమావేశంలో ప్రాథమిక షెడ్యూల్‌ను నిర్ణయించారు. మార్చి 6వ తేదీన నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. ఈ సమావేశంలో ఉన్నత విద్యామండలి ఛైర్మన్ టి.పాపిరెడ్డి, ఐసెట్ కన్వీనర్ కె.రాజిరెడ్డి, ఐసెట్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మే 20,21 తేదీలలో ఆన్‌లైన్ విధానంలో ఐసెట్ పరీక్ష నిర్వహించనున్నారు. మే 27న ప్రాథమిక కీ విడుదల చేసి జూన్ 1వ తేదీ వరకు ప్రాథమిక కీ పై అభ్యంతరాలు స్వీకరించనున్నారు. ఆ తర్వాత జూన్ 12న తుది కీ తో పాటు ఫలితాలు విడదుల చేయనున్నారు.

ఐసెట్ షెడ్యూల్
దరఖాస్తుల స్వీకరణ: మార్చి 9 నుంచి
స్వీకరణకు చివరి తేదీ: ఏప్రిల్ 30
రూ.500 అపరాధ రుసుముతో: మే 6 వరకు
రూ.2 వేల అపరాధ రుసుముతో: మే 11 వరకు
రూ.5 వేల అపరాధ రుసుముతో: మే 16 వరకు
హాల్‌టికెట్ల డౌన్‌లోడ్: మే 14 నుంచి

ICET applications from 9th March

The post మార్చి 9 నుంచి ఐసెట్ దరఖాస్తులు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: