బుమ్రాపై ఐసిసి చీఫ్ రిచర్డ్‌సన్ ప్రశంసలు…

లండన్: టీమిండియా స్పీడ్‌స్టర్ జస్‌ప్రిత్ బుమ్రాపై ఐసిసి చీఫ్ రిచర్డ్‌సన్ ప్రశంసల వర్షం కురిపించారు. ప్రపంచకప్‌లో బుమ్రా బౌలింగ్ ఎంతో బాగుందన్నారు. భారత్‌ను సెమీస్‌కు చేర్చడంలో బుమ్రాదే కీలకపాత్ర అని స్పష్టం చేశారు. పిచ్ నుంచి సహకారం లేకున్నా అతను చెలరేగుతున్న తీరు తనను ఎంతో ఆకట్టుకుందన్నారు. ఈ ప్రపంచకప్‌లో అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన బుమ్రాదే అనడంలో సందేహం లేదన్నారు. రానున్న రోజుల్లో అతను మరింత రాటుదేలదడం ఖాయమన్నారు. ప్రపంచకప్‌లో భారత్ అద్భుతంగా ఆడుతుందన్నారు. వరుస విజయాలతో […] The post బుమ్రాపై ఐసిసి చీఫ్ రిచర్డ్‌సన్ ప్రశంసలు… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

లండన్: టీమిండియా స్పీడ్‌స్టర్ జస్‌ప్రిత్ బుమ్రాపై ఐసిసి చీఫ్ రిచర్డ్‌సన్ ప్రశంసల వర్షం కురిపించారు. ప్రపంచకప్‌లో బుమ్రా బౌలింగ్ ఎంతో బాగుందన్నారు. భారత్‌ను సెమీస్‌కు చేర్చడంలో బుమ్రాదే కీలకపాత్ర అని స్పష్టం చేశారు. పిచ్ నుంచి సహకారం లేకున్నా అతను చెలరేగుతున్న తీరు తనను ఎంతో ఆకట్టుకుందన్నారు. ఈ ప్రపంచకప్‌లో అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన బుమ్రాదే అనడంలో సందేహం లేదన్నారు. రానున్న రోజుల్లో అతను మరింత రాటుదేలదడం ఖాయమన్నారు. ప్రపంచకప్‌లో భారత్ అద్భుతంగా ఆడుతుందన్నారు.

వరుస విజయాలతో ప్రత్యర్థి జట్లకు అందనంత దూరంలో నిలిచిందన్నారు. ఇదే జోరును కొనసాగిస్తే ట్రోఫీని సాధించడం భారత్‌కు కష్టం కాదన్నారు. ఇక, ప్రపంచకప్‌లో వరుణుడి ప్రభావంపై స్పందిస్తూ ఈ విషయంలో తాము చేసేదేమీ లేదన్నారు. ప్రకృతి ముందు ఎవరూ ఏమీ చేయలేరన్నారు. ఇక, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్లు కూడా చాలా బలంగా ఉన్నాయన్నారు. బ్యాటింగ్, బౌలింగ్‌లో సమతూకంగా కనిపిస్తున్నాయన్నారు. దీంతో సెమీస్ సమరం హోరాహోరీగా సాగడం ఖాయమన్నారు.

ICC CEO Richardson praise on Jasprit Bumrah

The post బుమ్రాపై ఐసిసి చీఫ్ రిచర్డ్‌సన్ ప్రశంసలు… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: