బ్యాంకులకు మరింత స్వేచ్ఛ

ఆర్‌బిఐ కొత్త సర్కులర్‌ను స్వాగతించిన ఐబిఎ ముంబై: మొండి బకాయిల పరిష్కారానికి ఆర్‌బిఐ(భారతీయ రిజర్వు బ్యాంక్) జారీ చేసిన కొత్త సర్కులర్ పట్ల ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్(ఐబిఎ) హర్షం వ్యక్తం చేసింది. ప్రోవిజనింగ్ అవసరాలను ఇనుమడింపజేస్తుందని, నిర్ణయాలను తీసుకోవడంలో బ్యాంకులకు మరింత స్వేచ్ఛ ఇచ్చినట్టవుతుందని కొత్త సర్కులర్‌పై ఐబిఎ చైర్మన్ సునీల్ మెహతా అభిప్రాయపడ్డారు. ఫిబ్రవరి 12 సర్కులర్‌ను సుప్రీం కోర్టు రద్దు చేసిన తర్వాత రెండు నెలలకు ఆర్‌బిఐ శుక్రవారం నాడు కొత్త మార్గదర్శకాలను జారీ […] The post బ్యాంకులకు మరింత స్వేచ్ఛ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

ఆర్‌బిఐ కొత్త సర్కులర్‌ను స్వాగతించిన ఐబిఎ

ముంబై: మొండి బకాయిల పరిష్కారానికి ఆర్‌బిఐ(భారతీయ రిజర్వు బ్యాంక్) జారీ చేసిన కొత్త సర్కులర్ పట్ల ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్(ఐబిఎ) హర్షం వ్యక్తం చేసింది. ప్రోవిజనింగ్ అవసరాలను ఇనుమడింపజేస్తుందని, నిర్ణయాలను తీసుకోవడంలో బ్యాంకులకు మరింత స్వేచ్ఛ ఇచ్చినట్టవుతుందని కొత్త సర్కులర్‌పై ఐబిఎ చైర్మన్ సునీల్ మెహతా అభిప్రాయపడ్డారు. ఫిబ్రవరి 12 సర్కులర్‌ను సుప్రీం కోర్టు రద్దు చేసిన తర్వాత రెండు నెలలకు ఆర్‌బిఐ శుక్రవారం నాడు కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. ‘ఆర్‌బిఐ సర్కులర్ స్వాగతించదగినది. ఇది బ్యాంకులకు మరింత స్వేచ్ఛనిచ్చి సొంతంగా సమస్యను పరిష్కరించుకునే అవకాశమిస్తోంది.

ఇది కేటాయింపు అవసరాలను, అలాగే సకాలంలో నిర్ణయాలను తీసుకునేలా రుణదాతలను ముందు నడిపిస్తుంది. ఈ సర్కులర్ వాటాదారులకు చాలా స్పష్టతనిస్తుంది’ అని మెహతా పేర్కొన్నారు. కార్పొరేట్ వ్యవహారాల కార్యదర్శి ఇంజెటి శ్రీనివాస్ మాట్లాడుతూ, తాజా సర్కులర్ పాత నిబంధనల కంటే పటిష్టంగా ఉంది. బ్యాంకులకు మరింత అధికారాన్ని ఇస్తుందని అన్నారు. కొత్త సర్కులర్ స్థానంలో వచ్చిన కొత్త మార్గదర్శకాలు అత్యత్తమమైనదని అన్నారు. కాగా మొండి బకాయిల పరిష్కారానికి విస్తృత ఆమోదం పొందిన పాలసీని రుణ సంస్థలు అనుసరించాలని శుక్రవారం సెంట్రల్ బ్యాంక్ స్పష్టం చేసింది. సవరించిన సర్కులర్‌లో ఆర్‌బిఐ ఒక రోజు డిఫాల్ట్ నిబంధను తొలగించింది. రుణ విలువ రూ.2000 కోట్లు, అంతకుమించి ఉన్నట్లయితే వాటి చెల్లింపు ఒక రోజు ఆలస్యం అయినట్లయితే పునర్నిర్మాన ప్రక్రియను చేపట్టాలని పేర్కొంది.

డిఫాల్ట్ అయిన 30 రోజుల్లో రుణ సంస్థ ఆ ఖాతాలను పరిశీలించి, పునర్నిర్మాన ప్రణాళిక ప్రారంభించాలని తెలిపింది. గత నిబంధన అయిన రుణ సంస్థల నుంచి 100 శాతం అనుమతిని కూడా ఆర్‌బిఐ మార్పు చేసింది. మొండి బకాయిల పరిష్కారానికి ప్రస్తుతం 75 శాతం రుణ సంస్థల అనుమతి ఉంటే సరిపోతుంది. రుణ ఖాతాల్లో సమస్యాత్మకం ముందస్తుగానే గుర్తించి వాటి పరిష్కారం చూపేందుకు ఎస్‌ఎంఎ(స్పెషల్ మెన్షన్ అకౌంట్స్)లుగా మూడు విభాగాలుగా చేశారు. ఎస్‌ఎంఎ0 (1 నుంచి-30 రోజులకు రిపేమెంట్ ఓవర్‌డ్యూ), ఎస్‌ఎంఎ1 (31 నుంచి 60 రోజులకు రిపేమెంట్ ఓవర్‌డ్యూ), ఎస్‌ఎంఎ2 (61- నుంచి 90 రోజులకు రిపేమెంట్ ఓవర్‌డ్యూ) ఆర్‌బిఐ సర్కులర్‌లో పేర్కొంది. 30 రోజుల సమీక్ష కాలంలో రుణ సంస్థలు పరిష్కార వ్యూహాన్ని నిర్ణయించాలి.

 

 

రుణ సంస్కృతి మెరుగుపడనుంది
కొత్త సర్కులర్‌తో ఒత్తిడి, ఆస్తుల పరిష్కారం : ఆర్‌బిఐ గవర్నర్
సవరించిన మార్గదర్శకాలు ఒత్తిడి ఆస్తులకు పరిష్కారం చూపుతాయని, రుణ సంస్కృతిలో స్థిరమైన మెరుగుదల చూస్తామని ఆర్‌బిఐ గవర్నర్ శక్తికాంత దాస్ వ్యాఖ్యానించారు. కొత్త సర్కులర్‌తో అధనపు ప్రొవిజనింగ్‌కు అవకాశం ఏర్పడుతుందని, రిసొల్యూషన్ ప్రొసీడింగ్స్ ప్రారంభంలో జాప్యాన్ని నిరోధిస్తుందని అన్నారు. శనివారం ఇక్కడ ఎన్‌ఐబిఎం వద్ద మేనేజ్‌మెంట్‌లో పిజి డిప్లమా 15వ వార్షిక స్నాతకోత్సవంలో దాస్ మాట్లాడుతూ, కొత్త వ్యవస్థ ఇంటర్ క్రెడిటార్ అగ్రిమెంట్స్‌ను తప్పసరి చేస్తుందని, మెజారిటీ నిర్ణయానికి ప్రాధాన్యత కల్పిస్తుందని అన్నారు.

IBA Welcomes RBI Circular On Resolution Of Stressed Assets

Related Images:

[See image gallery at manatelangana.news]

The post బ్యాంకులకు మరింత స్వేచ్ఛ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: