ప్రేమ పెళ్లి…వరుడి తండ్రికి బలవంతంగా మలం తినిపించి…

 

Image Courtesy: Janta ka Reporter

రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లో కుమారుడి ప్రేమ వివాహం చేసుకున్నందుకు అమ్మాయి తరపు బంధువులు అతడి తండ్రిని చితకబాది, మలం తినిపించి, మూత్రం పోశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. ఓ యువకుడు ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో ఆఫీసర్‌గా పని చేస్తున్నాడు. తన కులానికి చెందిన అమ్మాయిని ఆ యువకుడు ఆర్య సమాజ్‌లో పెళ్లి చేసుకున్నాడు. సదరు అమ్మాయి మెడిసిన్ చదువుతోంది. దీంతో యువతి తల్లిదండ్రులు యువకుడి కుటుంబంపై పగ పెంచుకున్నారు. ఖుర్సిపూర్‌లో యువకుడి తండ్రి కారులో వెళ్తుండగా యువతి కుటుంబ సభ్యులు అతడిని పట్టుకొని చితక బాది, బలవంతంగా మలాన్ని తినిపించి, అతడిపై మూత్రం పోశారు. దీంతో స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఆ యువకుడిని తీవ్రంగా కొట్టి, చంపేస్తామని బెదిరించి అమ్మాయిని ఇంటికి తీసుకెళ్లిపోయారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను అరెస్టు చేశారు.

 

IAF officer’s father force fed excreta, urinated

The post ప్రేమ పెళ్లి… వరుడి తండ్రికి బలవంతంగా మలం తినిపించి… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.