పూర్తిస్థాయి నటిగా పనికి రాను

item songs

 

మలైకా అరోరా… ఈ పేరు వినగానే సెన్సేషనల్ ఐటమ్‌సాంగ్స్ మాత్రమే గుర్తుకొస్తాయి. 20 ఏళ్ల క్రితం ‘దిల్‌సే’ మూవీలో షారుఖ్‌ఖాన్‌తో ‘ఛయ్య ఛయ్య…’ పాటలో స్టెప్పులేసినప్పటి నుంచి ఇప్పటివరకు పలు హుషారైన ఐటమ్ సాంగ్స్‌లో డ్యాన్స్ చేసి భారీ క్రేజ్‌ను సంపాదించుకుంది ఈ భామ. ‘దబాంగ్’ మూవీలో ‘మున్నీ బద్నాం హుయి..’ అంటూ చేసిన స్పెషల్ సాంగ్ తర్వాత ఈ హాట్ బ్యూటీకి విపరీతంగా క్రేజ్ పెరిగింది. పవన్‌తో ఈ సినిమా రీమేక్ ‘గబ్బర్‌సింగ్’లో ‘కెవ్వు కేక…’ ఐటమ్‌సాంగ్‌లోనూ స్టెప్పులు వేసి అదరగొట్టింది.

ఇంతకంటే ముందు తెలుగులో మహేష్‌బాబుతో ‘అతిథి’ చిత్రంలో ‘రాత్రయినా నాకు ఓకే…’ అంటూ చిందులేసింది. ఇలా మలైకా పేరు చెబితే ఐటమ్ సాంగ్స్ తప్ప గుర్తుకొచ్చే సినిమా రోల్ ఏదీ ఉండదు. మరి ఈ విషయమై ఆమెను అడిగితే సూటిగా సమాధానం చెప్పింది. “సినిమాల్లో పూర్తిస్థాయి రోల్స్ చేయాలని నేను అసలెప్పుడూ అనుకోలేదు. సిల్వర్ స్క్రీన్‌తో నాకు ఉన్న లింక్ కేవలం ఐటమ్ సాంగ్స్‌లో డ్యాన్సులు చేయడం, గెస్ట్ రోల్స్ చేయడమే. సినిమాల్లో పూర్తిస్థాయి నటిగా నన్ను నేను చూసుకోలేను”అని చెప్పింది మలైకా అరోరా. ఇలా ఐటమ్‌సాంగ్స్‌లో డ్యాన్సులకు తప్ప పూర్తిస్థాయి నటిగా పనికి రాను అని మలైక సూటిగా చెప్పడం విశేషం.

I never thought of doing full rolls in cinema

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post పూర్తిస్థాయి నటిగా పనికి రాను appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.