ఆయన్ను ఎప్పుడూ కలవలేదు…

హైదరాబాద్ :  శార‌దా పీఠాధిప‌తి శ్రీ స్వ‌రూపానందేంద్ర స‌రస్వ‌తిని తాను కలిసినట్టు వచ్చిన వార్తల్లో నిజం లేదని ప్రముఖ గాయని సునీత స్పష్టంచేశారు. శ్రీ స్వ‌రూపానందేంద్ర స‌రస్వ‌తిని కలిసిన ప్రముఖుల జాబితాలో తన పేరు ఉండడంపై ఆమె ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇటీవల శ్రీ స్వ‌రూపానందేంద్ర స‌రస్వ‌తి ఓ జాతీయ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా తన వద్దకు చిరంజీవి, రజనీకాంత్ వంటి ప్రముఖలు వస్తుంటారని, ఈ క్రమంలోనే గాయని సునీత కూడా తన వద్దకు వస్తారని […] The post ఆయన్ను ఎప్పుడూ కలవలేదు… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.
హైదరాబాద్ :  శార‌దా పీఠాధిప‌తి శ్రీ స్వ‌రూపానందేంద్ర స‌రస్వ‌తిని తాను కలిసినట్టు వచ్చిన వార్తల్లో నిజం లేదని ప్రముఖ గాయని సునీత స్పష్టంచేశారు. శ్రీ స్వ‌రూపానందేంద్ర స‌రస్వ‌తిని కలిసిన ప్రముఖుల జాబితాలో తన పేరు ఉండడంపై ఆమె ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇటీవల శ్రీ స్వ‌రూపానందేంద్ర స‌రస్వ‌తి ఓ జాతీయ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా తన వద్దకు చిరంజీవి, రజనీకాంత్ వంటి ప్రముఖలు వస్తుంటారని, ఈ క్రమంలోనే గాయని సునీత కూడా తన వద్దకు వస్తారని శ్రీ స్వ‌రూపానందేంద్ర స‌రస్వ‌తి చెప్పారు. శ్రీ స్వ‌రూపానందేంద్ర స‌రస్వ‌తి మాట్లాడిన వీడియోను వీక్షించిన సునీత , ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అను నిత్యం చాలా వదంతులు వస్తాయని, అయితే కొన్ని వదంతులపై కచ్చితంగా స్పందించాల్సి ఉంటుందని ఆమె పేర్కొన్నారు. తాను శ్రీ స్వ‌రూపానందేంద్ర స‌రస్వ‌తిని కలవకున్నా ఆయన తన పేరు ఎలా చెబుతారని సునీత ప్రశ్నించారు.
I Never Met Swaroopanandendra : Singer Sunitha

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ఆయన్ను ఎప్పుడూ కలవలేదు… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.