కాబోయే అమ్మల కోసం…

  మొదటిసారిగా అమ్మ అయ్యేవారికి కొంచెం భయం, ఎన్నో అనుమానాలు ఉండటం సహజం. ప్రసవం అయ్యాక పాపాయిని ఎలా చూసుకోవాలో అని అయోమయంలో ఉంటారు. ఎవరేం సలహా ఇచ్చినా పాటిస్తుంటారు. ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టింది ‘ఐ లవ్ నైన్ మంత్స్’ స్టార్టప్. ఈ సంస్థను లాక్టేషన్ ఎడ్యుకేటర్ అంజలీరాజ్, ఫిట్‌నెస్ నిపుణురాలు గంగారాజ్, వైద్యురాలు సుమా అజిత్‌లు నిర్వహిస్తున్నారు. ఈ మధ్యనే గర్భిణుల కోసం ప్రెగ్గో యాప్‌నీ అందుబాటులోకి తెచ్చారు. కేరళలోని కొల్లం గంగారాజ్ స్వస్థలం. […] The post కాబోయే అమ్మల కోసం… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

మొదటిసారిగా అమ్మ అయ్యేవారికి కొంచెం భయం, ఎన్నో అనుమానాలు ఉండటం సహజం. ప్రసవం అయ్యాక పాపాయిని ఎలా చూసుకోవాలో అని అయోమయంలో ఉంటారు. ఎవరేం సలహా ఇచ్చినా పాటిస్తుంటారు. ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టింది ‘ఐ లవ్ నైన్ మంత్స్’ స్టార్టప్. ఈ సంస్థను లాక్టేషన్ ఎడ్యుకేటర్ అంజలీరాజ్, ఫిట్‌నెస్ నిపుణురాలు గంగారాజ్, వైద్యురాలు సుమా అజిత్‌లు నిర్వహిస్తున్నారు. ఈ మధ్యనే గర్భిణుల కోసం ప్రెగ్గో యాప్‌నీ అందుబాటులోకి తెచ్చారు.

కేరళలోని కొల్లం గంగారాజ్ స్వస్థలం. ప్రస్తుతం హైదరాబాద్‌లోని పుల్లెల గోపిచంద్ అకాడమీలో ఫిట్‌నెస్ నిపుణురాలిగా పని చేస్తోంది. ఆమె కూతురే అంజలీ రాజ్. ఆస్ట్రేలియాలోని వార్విక్ మెడికల్ స్కూల్‌లో పీహెచ్‌డీ చేస్తోంది. లామేజ్, లాక్టేషన్ ఎడ్యుకేటర్ అయిన అంజలీకి వచ్చిన ఆలోచనే ఈ ‘ఐ లవ్ నైన్ మంత్స్’. ఒక వ్యాపార సదస్సులో ఈ స్టార్టప్ ఆలోచనను పంచుకొని విజయం సాధించింది. ఆస్ట్రేలియాలోని వైద్య నిపుణురాలైన సుమా అజిత్‌తో కలిసి వ్యాపార ఆలోచనగా మార్చాలనుకుని నిర్ణయించుకుంది. ముందుగా దీన్ని బెంగళూరులో ప్రారంభించింది. కేరళ స్టార్టప్ మిషన్, కేఎస్‌డీసీ సంస్థలు ఈ ప్రాజెక్టుకు ఆర్థిక సహాయం అందించాయి. దీంతో ఈ సంస్థను కేరళకు తరలించారు.

ఈ స్టార్టప్‌లో భాగంగా ‘సహోదరి’ పేరుతో గర్భిణులు, బాలింతలకు హోంకేర్ సేవలు అందిస్తున్నారు. గర్భిణులు సరైన బరువుతో ఉన్నారా లేదా, వారు తీసుకోవాల్సిన ఆహారం, వారి మానసిక ఆరోగ్యం… వంటివన్నింటినీ ఈ నిపుణుల బృందం పర్యవేక్షిస్తుంది. అంతేగాకుండా గర్భిణులకు సులువైన వ్యాయామాలు నేర్పిస్తారు. ప్రసవం తరువాత పాలివ్వడంపైనా అవగాహన కల్పిస్తారు. పాపాయి ఆరోగ్యం కోసం జాగ్రత్తలు చెబుతారు. ప్రస్తుతం కేరళలో అందుబాటులో ఉన్న ఈ సేవలను త్వరలో హైదరాబాద్‌కీ విస్తరించనున్నారు.

మొత్తం సమాచారం అందుబాటులో…

ఓ మహిళ గర్భం దాల్చినప్పటి నుంచి ప్రసవం అయ్యేవరకూ ఆమెకు కావాల్సిన సమాచారం మొత్తం అందిస్తుందీ స్టార్టప్. ఈ తొమ్మిది నెలల కాలంలో మహిళలు ఎదుర్కొనే ఎన్నో ఇబ్బందులు, సందేహాలు తీర్చడానికి గైనకాలజిస్ట్, లాక్టేషన్ స్పెషలిస్ట్, డైటీషన్ నిపుణులు కలిపి పదిమందితో కూడిన వైద్య బృందం ఎల్లప్పుడూ వీరికి అందుబాటులో ఉంటారు. అధిక రక్తపోటు, మధుమేహం, ఇతర రిపోర్టులు ఈ యాప్‌లో నమోదు చేస్తే వైద్యులు వాట్సాప్ చాటింగ్, వీడియో కాల్ చేసి గర్భిణుల సందేహాలు తీరుస్తారు. గర్భధారణకు సంబంధించిన ఎన్నో వ్యాసాలుంటాయీ యాప్‌లో.

ఈ యాప్ మొదటి వర్షన్ పూర్తి చేయడానికి వీరికి ఏడాది సమయం పట్టింది. ఇప్పుడు రెండో వర్షన్‌ని రెండు భాగాలుగా రూపొందించారు. ఇందులో ఒకటి ప్రెగ్గో. ఇది గర్భిణులకు సేవలందించేందుకు ఉపయోగపడుతుంది. ఇటీవలే దీన్ని అందుబాటులోకి తెచ్చారు. ఐ లవ్ నైన్ మంత్స్‌లో ఉన్న సౌకర్యాలన్నీ ఇందులోనూ ఉంటాయి. రెండోది కడిల్స్. బాలింతల అవసరం కోసం దీనిని రూపొందిస్తున్నారు. త్వరలో ఇది అందుబాటులోకి రానుంది. ‘ఐ లవ్ నైన్ మంత్స్ మొదటి వర్షన్ యాప్‌ను ఎక్కువగా చిన్న పట్టణాలు, నగరాలకు చెందిన గర్భిణులు వినియోగించేవారు. తాజాగా తీసుకొచ్చిన ప్రెగ్గో యాప్ గర్భిణులకు అవసరమైన సమాచారాన్ని ఉచితంగా అందిస్తోంది. హోంకేర్ సర్వీసులు, బ్రెస్ట్ ఫీడింగ్, లాక్టేషన్ పాడ్‌ల నుంచి స్టార్టప్‌నకు ఆదాయం సమకూరుతుందని నిర్వాహకులు చెబుతున్నారు.

బ్రెస్ట్ ఫీడింగ్ ప్యాడ్‌ల ఏర్పాటు…
జనసందోహం ఉన్నచోట పిల్లలకు పాలివ్వడం అంటే ఇబ్బందే. ఇది గమనించే రద్దీ ప్రదేశాల్లో బ్రెస్ట్ ఫీడింగ్ పాడ్‌లు ఏర్పాటు చేస్తోంది ఈ బృందం. మొదటి బ్రెస్ట్ ఫీడింగ్ పాడ్‌ను త్రిస్సూర్‌లోని రెస్టారెంట్‌లో ప్రారంభించారు. మంచి స్పందన రావడంతో ఇతర ప్రాంతాలకు విస్తరించారు. ఇందులో మహిళ సౌకర్యంగా కూర్చొని పాపాయికి పాలు పట్టొచ్చు. కార్యాలయాల్లోనూ వీటిని ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ విధానం నచ్చి కోచి మెట్రో వీరితో ఒప్పందం కుదుర్చుకుంది. అక్కడ 16 స్టేషన్లలో ఈ పాడ్‌లు ఏర్పాటు చేస్తున్నారు. త్వరలో కన్యాకుమారి నుంచి త్రిస్సూర్ వరకూ ఉన్న అన్ని రైల్వే స్టేషన్లల్లోనూ వీటిని ఏర్పాటు చేయనున్నట్లు వీరు తెలిపారు.

I Love Nine Months startup for prospective mom

Related Images:

[See image gallery at manatelangana.news]

The post కాబోయే అమ్మల కోసం… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: