నాకు ఏ బయోపిక్ తో సంబంధం లేదు: దీదీ

mamata banerjeeకోల్ కతా: బాఘిని సిన్మా తన బయోపిక్ అంటూ జోరుగా వస్తున్న వార్తలపై పశ్చిమబెంగాల్ సిఎం మమతాబెనర్జీ స్పందించారు. ఈ నేపథ్యంలో మమతా ట్విట్టర్ వేదికగా స్పందించారు. నా బయోపిక్ అంటూ వస్తోన్న వార్తలన్నీ కేవలం పుకార్లు మాత్రమే. నాకు ఏ బయోపిక్ తో సంబంధం లేదు.

కొందరు కొన్ని కథలు సిద్దం చేసుకుని, వారికి నచ్చిన విధంగా సినిమా తీస్తే అది నా బయోపిక్ ఎలా అవుతుంది. బయోపిక్ తీయడానికి నేనేమి నరేంద్రమోడీని కాదు. ఇలాంటి ఫేక్ వార్తలను సృష్టిస్తూ పరువునష్టం దావా వేసేలా నన్ను ప్రేరేపించకండి అని మమతాబెనర్జీ ట్వీట్ చేశారు. కాగా, ఈ సినిమా ట్రైలర్ పై ఇసి నిషేధం విధించింది. బాఘిని బయోపిక్ కాదని, మమతాబెనర్జీని ఆదర్శంగా తీసుకుని రాసుకున్న కథ అని ఇప్పటికే డైరెక్టర్ వెల్లడించిన సంగతి తెలిసిందే.

i have no connection with any biopic says mamata

Related Images:

[See image gallery at manatelangana.news]

The post నాకు ఏ బయోపిక్ తో సంబంధం లేదు: దీదీ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.