పిఎంను కాదు …ఎంపిని మాత్రమే…

బెంగళూరు : ప్రముఖ సినీ నటి, మాజీ మంత్రి అంబరీష్ సతీమణి సుమలత కర్నాటకలోని మాండ్య నుంచి భారీ మెజార్టీతో విషయం సాధించారు. జనతాదళ్ అభ్యర్థి, కర్నాటక సిఎం కుమారస్వామి కొడుకు నిఖిల్ పై ఆమె విజయం సాధించారు. తన భర్త అంబరీష్ పేరున్న రాజకీయ నేత అయినప్పటికీ, తాను రాజకీయాలకు దూరంగా ఉంటూనే వచ్చానని ఆమె తెలిపారు. అయితే తన భర్త అంబరీష్ మరణం అనంతరం తనకు రాజకీయాల్లోకి రావాలని అనిపించిందని ఆమె పేర్కొన్నారు. ఈ […] The post పిఎంను కాదు … ఎంపిని మాత్రమే… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

బెంగళూరు : ప్రముఖ సినీ నటి, మాజీ మంత్రి అంబరీష్ సతీమణి సుమలత కర్నాటకలోని మాండ్య నుంచి భారీ మెజార్టీతో విషయం సాధించారు. జనతాదళ్ అభ్యర్థి, కర్నాటక సిఎం కుమారస్వామి కొడుకు నిఖిల్ పై ఆమె విజయం సాధించారు. తన భర్త అంబరీష్ పేరున్న రాజకీయ నేత అయినప్పటికీ, తాను రాజకీయాలకు దూరంగా ఉంటూనే వచ్చానని ఆమె తెలిపారు. అయితే తన భర్త అంబరీష్ మరణం అనంతరం తనకు రాజకీయాల్లోకి రావాలని అనిపించిందని ఆమె పేర్కొన్నారు. ఈ క్రమంలోనే తాను రాజకీయాల్లోకి వచ్చి మాండ్య నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేసి విజయం సాధించానని ఆమె పేర్కొన్నారు. తనకు ఇంతటి అఖండ విజయాన్ని అందించిన మాండ్య ప్రజలకు, తన అనుచరులకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. తాను ప్రధానిని కాదని, ఎంపిని మాత్రమేనని, మాండ్య ప్రజల సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని ఆమె తెలిపారు. తాను కాంగ్రెస్ లో చేరుతున్నట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదని ఆమె తేల్చి చెప్పారు.

I Am Not PM … only the MP : Sumalatha

Related Images:

[See image gallery at manatelangana.news]

The post పిఎంను కాదు … ఎంపిని మాత్రమే… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: