అలానే చిన్నప్పటి నుంచి చూస్తున్నా: విరాట్

Virat

లండన్: భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ తన ట్వీట్టర్‌లో ఓ ఫొటోను షేర్ చేశాడు. వరల్డ్ కప్ భారత్- పాక్ మధ్య జరిగిన మ్యాచ్‌లో వర్షం కొంచెంసేపు అంతరాయం కలిగించింది. దీనిని ఉద్దేశిస్తూ విరాట్ ఒక ఫొటోను ట్వీట్ చేశాడు. నడుముపై రెండు చేతులు పెట్టుకొని వాన కోసం ఎదురు చూస్తున్న ఫొటోను పెట్టాడు. ఇప్పుడే చూడడం లేదు 1990 నుంచి ఇలానే చూస్తున్నానని ఫొటోకి క్యాప్షన్ ఇచ్చాడు. వరల్డ్ కప్‌లో భాగంగా పాక్‌పై 89 పరుగుల తేడాతో టీమిండియా గెలుపొందిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ శతకంతో చెలరేగాడు. విరాట్ కోహ్లీ (77), కెఎల్ రాహుల్(57) హాఫ్ సెంచరీలో ఆదుకున్నారు. తరువాత మ్యాచ్ ఆఫ్ఘానిస్తాన్‌తో శనివారం భారత జట్టు తలపడనుంది. రెండు రోజులు టీమిండియా ఆటగాళ్లకు విశ్రాంతి ఇచ్చామని బిసిసిఐ ప్రకటించింది.

 

I am Doing from 1990s: Virat Kohli

The post అలానే చిన్నప్పటి నుంచి చూస్తున్నా: విరాట్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.