హైదరాబాద్ లో అదృశ్యం.. గుంటూరులో ప్రత్యేక్షం

Missing-girl

హైదరాబాద్: ఐదు రోజుల క్రితం తనను ఓ అబ్బాయి వేధిస్తున్నాడని చెప్పి ఉత్తరం రాసి హుస్సేన్‌సాగర్‌లో దూకి ఆత్మహత్య చేసుకుంటానని వెళ్లిన మోనిక ఆచూకీ లభించింది. నారాయణగూడ పోలీసులు కేసును ఛాలెంజ్‌గా తీసుకుని దర్యాప్తు చేశారు. ఎట్టకేలకు మోనిక, ఓ అబ్బాయితో కలిసి గుంటూరు ఉన్నట్లు సమాచారం రావడంతో వెళ్లి పట్టుకున్నారు. వారిని అక్కడి నుంచి హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. నిజామాబాద్ జిల్లా నవీపేటకు చెందిన శ్రీనివాస్‌గౌడ్ కుమార్తె మోనిక(19) హిమాయత్‌నగర్‌లోని గౌడ హాస్టల్‌లో ఉంటూ కేశవమెమోరియల్ డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతోంది. గత మంగళవారం రాత్రి తన తండ్రికి ఫోన్ చేసి తమ గ్రామానికి చెందిన యువకుడు తనను వేధిస్తున్నాడని తెలిపింది. తాను చేసుకుంటానని తండ్రి శ్రీనివాస్ తెలిపాడు.

తెల్లవారి కుమారుడిని పంపించి మోనిక తీసుకురావాలని కోరాడు. మోనిక సోదరుడు నందరాజ్ హైదరాబాద్‌లోని హాస్టల్‌కు వచ్చే సరికి మోనిక ఉత్తరం రాసి బయటికి వెళ్లిపోయింది. ఈ విషయాన్ని నందరాజ్ తండ్రికి ఫోన్ చేసి చెప్పాడు. తర్వాత వెంటనే నారాయణగూడ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు హుస్సేన్ సారగ్ వైపు ఉన్న సిసికెమెరాలు పరిశీలించగా ఎలాంటి ఆచూకీ లభ్యం కాలేదు. ఎట్టకేలకు మోనిక బంధువులు ఇచ్చిన సమాచారంతో బేగంపేటలోని సిసికెమెరాలు పరిశీలించగా విషయం బయటపడింది. గుంటూరు నుంచి కూడా వారు తప్పించుకునేందుకు యత్నిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు.

Hyderabad Missing girl Mounika found at guntur district

The post హైదరాబాద్ లో అదృశ్యం.. గుంటూరులో ప్రత్యేక్షం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.