రియల్ ఎస్టేట్ లో దేశంలోనే హైదరాబాద్ టాప్…

  ప్రథమార్థంలో కొత్త నివాసాల్లో 47 శాతం వృద్ధి కార్యాలయ మార్కెట్ 43 శాతం పెరిగింది నైట్ ఫ్రాంక్ నివేదిక హైదరాబాద్ : రియల్ ఎస్టేట్ రంగంలో హైదరాబాద్ నగరం దేశంలోని ఇతర నగరాలతో పోటీపడుతోంది. నివాస, కార్యాలయ మార్కెట్‌లో హైదరాబాద్ భారీ వృద్ధిని నమోదు చేసింది. 2019 ప్రథమార్థంలో మన నగరంలో కొత్త నివాస ప్రారంభోత్సవాల్లో 47 శాతం వృద్ధి, కార్యాలయ మార్కెట్‌లో 43 శాతం వృద్ధి నమోదైందని నైట్ ఫ్రాంక్ నివేదిక వెల్లడించింది. ‘ఇండియా […] The post రియల్ ఎస్టేట్ లో దేశంలోనే హైదరాబాద్ టాప్… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ప్రథమార్థంలో కొత్త నివాసాల్లో 47 శాతం వృద్ధి
కార్యాలయ మార్కెట్ 43 శాతం పెరిగింది
నైట్ ఫ్రాంక్ నివేదిక

హైదరాబాద్ : రియల్ ఎస్టేట్ రంగంలో హైదరాబాద్ నగరం దేశంలోని ఇతర నగరాలతో పోటీపడుతోంది. నివాస, కార్యాలయ మార్కెట్‌లో హైదరాబాద్ భారీ వృద్ధిని నమోదు చేసింది. 2019 ప్రథమార్థంలో మన నగరంలో కొత్త నివాస ప్రారంభోత్సవాల్లో 47 శాతం వృద్ధి, కార్యాలయ మార్కెట్‌లో 43 శాతం వృద్ధి నమోదైందని నైట్ ఫ్రాంక్ నివేదిక వెల్లడించింది. ‘ఇండియా రియల్ ఎస్టేట్’ పేరిట ఈ ఏడాది ప్రథమార్థానికి సంబంధించిన 11వ ఎడిషన్‌ను నైట్ ఫ్రాంక్ విడుదల చేసింది.

ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో నైట్ ఫ్రాంక్ ఇండియా బ్రాంచ్ డైరెక్టర్(హైదరాబాద్) సామ్సన్ ఆర్థూర్ నివేదిక సంబంధించిన వివరాలను ప్రజెంట్ చేశారు. 2019 జనవరిజూన్ (హెచ్1 2019) కాలానికి గాను ఎనిమిది నగరాల్లో రెసిడెన్షియల్, ఆఫీస్ మార్కెట్ విశ్లేషణను వివరించారు. 2019 ప్రథమార్థంలో హైదరాబాద్ నగరంలో నివాసాల్లో 5,430 యూనిట్లతో 47 శాతం వృద్ధిని సాదించగా, గతేడాది ఇదే సమయంలో 3,706 యూనిట్లుగా ఉంది. కొత్త కార్యాలయాల పూర్తి, లావాదేవీలు రెండింటి పరంగా చూస్తే 129 శాతం వృద్ధి ఉందని నివేదిక వెల్లడించింది.

కొత్త ఆఫీస్ స్పేస్ పూర్తి విషయానికొస్తే.. 2018 ప్రథమార్థంలో 1.6 లక్షల చదరపు మీటర్లు (17.3 లక్షల చదరపు అడుగులు) నుంచి 3.7 లక్షల చదరపు మీటర్లకు(39.7 లక్షల చదరపు అడుగులు) పెరిగిందని నివేదిక పేర్కొంది. నగంరలో ఆఫీస్ స్పేస్ వాల్యూమ్ 2.5 లక్షల చదరపు మీటర్లకు (26.9 లక్షల చదరపు అడుగులు) నుంచి 3.6 లక్షల చదరపు మీటర్లకు (38.5 లక్షల చదరపు అడుగులు) పెరిగింది. 2019 ప్రథమార్థంలో హౌసింగ్ ప్రాజెక్టులు దాదాపు పూర్తి కావొచ్చాయి. ఇతర నగరాలు చూస్తే ముంబై, చెన్నై, కోల్‌కతాలో నివాస ఆస్తుల ధరలు తగ్గుముఖం పట్టాయి. ఆర్థిక రంగంలో లిక్విడిటీ సమస్య కొనసాగుతుండడం, ప్రత్యేకించిన ఎన్‌బిఎఫ్‌సిల్లో(నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల) సంక్షోభం రియల్ ఎస్టేట్‌పై ప్రభావం ఎక్కువగా కనిపించింది.

 

Hyderabad huge growth in Real Estate Sector

Related Images:

[See image gallery at manatelangana.news]

The post రియల్ ఎస్టేట్ లో దేశంలోనే హైదరాబాద్ టాప్… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.