అన్నవరంలో హైదరాబాద్‌ దంపతుల ఆత్మహత్య

couple-hailingఅమరావతి: ఆర్థిక ఇబ్బందులు తాళలేక అన్నవరం లాడ్జీలో హైదరాబాద్ కు చెందిన దంపతులు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఆర్థిక సమస్యలే వీరి మరణానికి కారణమని తెలుస్తోంది. పోలీసుల తెలిపిన కథనం ప్రకారం… మచిలీపట్నానికి చెందిన పవన్, హైదరాబాద్‌లో పవన్ ట్రావెల్స్ పేరుతో ఓ సంస్థను నిర్వహిస్తున్నాడు. అయితే ఇటీవల ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్న అతనికి వాటి నుండి బయటపడే మార్గం దొరకలేదు.

ఈ నేపథ్యంలోనే పవన్, తన భార్య ధనలక్ష్మితో కలిసి అన్నవరం వెళ్లాడు. అక్కడ ఓ లాడ్జిలో రూమ్ అద్దెకు తీసుకుని ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. లాడ్జీ సిబ్బంది ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని, సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం మార్చురీకి తరలించారు. ఘటనా స్థలం నుంచి సూసైడ్ లేఖను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు.

Hyderabad couple commits suicide at Annavaram lodge

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post అన్నవరంలో హైదరాబాద్‌ దంపతుల ఆత్మహత్య appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.