భవనాల అప్పగింత వారంలో

  హైదరాబాద్‌లోని ఎపి సచివాలయ భవనాలు తెలంగాణ జిఎడికి శాసనసభ భవనాలు అసెంబ్లీ కార్యదర్శికి, ఎంఎల్‌ఎ క్వార్టర్లు ఎస్టేట్ ఆఫీసర్‌కు అప్పగించాలని ఉభయరాష్ట్రాల అధికారుల భేటీలో నిర్ణయం, 27లోగా కొత్త సచివాలయానికి శంకుస్థాపన మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్‌కె జోషి ఆధ్వర్యంలో రెండు తెలుగు రాష్ట్రాల ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. ఎపి తరఫున ప్రేం చంద్రారెడ్డి, తెలంగాణ తరఫున రామకృష్ణారావు లు హాజరయ్యారు. ఈ భేటీలో ఎపి భవనాలను తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించడంపై చర్చించారు. […] The post భవనాల అప్పగింత వారంలో appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

హైదరాబాద్‌లోని ఎపి సచివాలయ భవనాలు తెలంగాణ జిఎడికి

శాసనసభ భవనాలు అసెంబ్లీ కార్యదర్శికి, ఎంఎల్‌ఎ క్వార్టర్లు ఎస్టేట్ ఆఫీసర్‌కు అప్పగించాలని ఉభయరాష్ట్రాల అధికారుల భేటీలో నిర్ణయం, 27లోగా కొత్త సచివాలయానికి శంకుస్థాపన

మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్‌కె జోషి ఆధ్వర్యంలో రెండు తెలుగు రాష్ట్రాల ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. ఎపి తరఫున ప్రేం చంద్రారెడ్డి, తెలంగాణ తరఫున రామకృష్ణారావు లు హాజరయ్యారు. ఈ భేటీలో ఎపి భవనాలను తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించడంపై చర్చించారు. హైదరాబాద్‌లోని ఆంధ్రప్రదేశ్ సచివాలయ భవనాలను తెలంగాణ జీఏడీకి, అసెంబ్లీ భవనాలను తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శికి, ఎమ్మెల్యేల క్వార్టర్లను ఎస్టేట్ ఆఫీసర్‌కు అప్పగించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. వారం రోజుల్లోగా భవనాల అప్పగింత కార్యక్రమం పూర్తి చేయాలని అధికారులు నిర్ణయించినట్టుగా సమాచారం. ఈనెల 27లోగా కొత్త సచివాలయ భవనానికి సిఎం కెసిఆర్ భూమి పూజ చేయనున్నట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో ఎపి భవనాలు తెలంగాణకు అప్పగించినట్లయితే తెలంగాణ సచివాలయాన్ని ఎపిలో భవనాల్లోకి మార్చే వీలుంటుందని అధికారులు పేర్కొంటున్నారు. 27వ తేదీ దాటితే మరో మూడు నెలల వరకు మంచి రోజులు లేవని పూజారులు పేర్కొన్నారని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలోనే భవనాల అప్పగింతపై తెలంగాణ ప్రభుత్వం చకచకా నిర్ణయం తీసుకుంటోంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషితో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఉన్నతాధికారులు సమావేశమై కీలక నిర్ణయాలు తీసుకున్నట్టుగా తెలిసింది. త్వరలో దీనికి సంబంధించిన ఉత్తర్వులు కూడా వెలువడే అవకాశం ఉన్నట్టు తెలిసింది.
ఎపి జీఏడీ అధికారుల పర్యవేక్షణలో తరలింపు కార్యక్రమం
రాష్ట్ర విభజన సందర్భంగా హైదరాబాద్ లోని కొన్ని ప్రభుత్వ భవనాలను ఎపి పరిపాలన కోసం కేటాయించిన సంగతి తెలిసిందే. అయితే, అమరావతి కేంద్రంగా ఎపి పరిపాలన సాగుతుండడంతో హైదరాబాద్‌లోని ఆ భవనాలు నిరుపయోగంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో వాటిలోని అత్యధిక భవనాలను గవర్నర్ నరసింహన్ చొరవతో తెలంగాణకు కేటాయించారు. ఎపి హోంశాఖకు, ఇతర ముఖ్య శాఖలకు రెండు భవనాలు ఇచ్చి మిగతా వాటిని తెలంగాణకు కేటాయించారు. ఈ నేపథ్యంలో తెలంగాణకు కేటాయించిన భవనాల నుంచి సామగ్రిని అమరావతి తరలిస్తున్నారు. హైదరాబాద్‌లోని ఎపి సచివాలయంలో ఉన్న విలువైన స్టేషనరీ, ఫర్నీచర్, ఇతర సామగ్రిని అధికారులు ప్రత్యేక వాహనాల్లో అమరావతి పంపిస్తున్నారు. ఎపి జీఏడీ అధికారుల పర్యవేక్షణలో ఈ తరలింపు కార్యక్రమం కొనసాగుతోంది.

Hyderabad ap secretariat bhavan handover to Telangana

The post భవనాల అప్పగింత వారంలో appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: