అర్ధరాత్రి నడి రోడ్డుపై భార్య శవంతో రోదన

 దిక్కుతోచని స్థితిలో కొందుర్గు బస్టాండ్‌లోనే నిరీక్షణ… గ్రామస్థుల చొరవతో అంత్యక్రియలు కొందుర్గు: అర్థరాత్రి నడి రోడ్డుపై వారిని వాహనంలో నుంచి దించివెళ్లడంతో దిక్కుతోచని స్థితిలో భర్తపడిన వేదన ప్రజలను కలిచివేసింది… పొట్టకూటికోసం వెళ్లిన తల్లిదండ్రులు బిడ్డనిచ్చిన గ్రామానికి వచ్చి అనారోగ్యం కారణం గా ఆసుపత్రికి వెళుతున్న క్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది… అయ్యో పాపం.. అంటూ స్థానికులు తలా కొంత డబ్బు సమకూర్చి ఊరికాని ఊళ్లో దహన సంస్కారాలకు అవకాశం ఇవ్వడంతో.. భార్య కాలం చేసిన […] The post అర్ధరాత్రి నడి రోడ్డుపై భార్య శవంతో రోదన appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 దిక్కుతోచని స్థితిలో కొందుర్గు బస్టాండ్‌లోనే నిరీక్షణ…
గ్రామస్థుల చొరవతో అంత్యక్రియలు

కొందుర్గు: అర్థరాత్రి నడి రోడ్డుపై వారిని వాహనంలో నుంచి దించివెళ్లడంతో దిక్కుతోచని స్థితిలో భర్తపడిన వేదన ప్రజలను కలిచివేసింది… పొట్టకూటికోసం వెళ్లిన తల్లిదండ్రులు బిడ్డనిచ్చిన గ్రామానికి వచ్చి అనారోగ్యం కారణం గా ఆసుపత్రికి వెళుతున్న క్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది… అయ్యో పాపం.. అంటూ స్థానికులు తలా కొంత డబ్బు సమకూర్చి ఊరికాని ఊళ్లో దహన సంస్కారాలకు అవకాశం ఇవ్వడంతో.. భార్య కాలం చేసిన వేదన దిగమింగుకొని దహన సంస్కారాలకు చోటు లభించిందని… భర్త అశృనయనాల మధ్యఅంత్య క్రియలు జరిపి… మానవత్వాన్ని చాటిన వారందరికి చేతులెత్తి నమస్కరించాడు.. ఇదంతా గమనించిన వారంతా.. ఇలాంటి కష్టం ఏ భర్తకు రాకూడదని కన్నీటిపర్యంతమయ్యారు.

రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండల కేంద్రంలోని బస్టాండ్‌లో భార్యమృత దేహంతో భర్త రోధిస్తున్నాడని ఆ నోటా.. ఈ నోటా తెలుసుకున్న గ్రామస్థులు అక్కడికి చేరుకున్నారు. అక్కడే ఉన్న వ్యక్తితో వివరాలపై ఆరా తీశారు. దీంతో ఆ వ్యక్తి తన పేరు జంగయ్య. అని, తమది వికారాబాద్ జిల్లా పరిగి మండలం శివారెడ్డి పల్లి గ్రామమని తెలిపాడు. తన భార్య సత్యమ్మ(55)తో కలిసి బతుకు దెరువుకోసం హైదరాబాద్‌కు వెళ్లి జీవనం కొనసాగిస్తున్నామని జంగయ్య పేర్కొన్నారు. జంగమ్మ అనారోగ్యం పాలు కావడంతో కుమార్తె ఊరైన జిల్లేడు చౌదరిగూడ మండలం వీరసముద్రం గ్రామానికి వచ్చారు.

అక్కడే ఉన్న సత్యమ్మ రోగం నయం కాకపోగా, శుక్రవారం పరిస్థితి విషమించడంతో భర్త జంగయ్య అక్కడినుంచి ఆసుపత్రికని రాత్రి 10 గంటలకు ఆటోలో లాల్‌పహాడ్ వరకు వచ్చారు. అక్కడి నుంచి మరో వాహనంలో కొందుర్గుకు చేరుకొని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లగా అక్కడ డాక్టర్లు లేరని షాద్‌నగర్ తీసుకెళ్లాలని సూచించారు. దీంతో కొందుర్గు నుంచి భార్యను 12 గంటల సమయంలో ఆటోలో షాద్‌నగర్ తరలిస్తుండగా అప్పారెడ్డి గూడ వద్ద భార్య సత్యమ్మ మృతి చెందింది. దీంతో వాహనదారుడు ఇరువురిని అక్కడే వదిలి వెళ్లిపోయాడు.

దీంతో ఎటు పాలుపోక రోదిస్తుంటే జంగయ్యను గమనించిన ఓ వాహనదారుడు సత్యమ్మ మృతదేహాన్ని, జంగయ్యను కొందుర్గు బస్టాండ్‌లో వదిలి వెళ్లాడు. రాత్రి మొత్తం భార్య శవం వద్ద రోదిస్తు కూర్చున్న జంగయ్యను ఉదయం స్థానికులు గమనించి విషయం తెలుసుకొని రూ.9 వేలు ఆర్థిక సాయం అందించారు. ప్రజాప్రతినిధులు, అధికారుల సాయంతో స్థానికంగానే సత్యమ్మకు దహనసంస్కారాలు చేశారు. కుటుంబ సభ్యులు, పిల్లలు ఎవరు దహన సంస్కారాలకు రాకపోవడంతో స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.

husband with wifes Dead body at Kondurg Bus Stand

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post అర్ధరాత్రి నడి రోడ్డుపై భార్య శవంతో రోదన appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: