భార్యను కర్రతో కొట్టి చంపిన భర్త

Wife

 

ధర్మసాగర్ : మండలంలోని ముప్పారం గ్రామంలో భార్యభర్తలు గొడవ పెట్టుకుని భార్య ఆలకుంట గట్టమ్మ ను (35) బుధవారం భర్త హత్య చేసిన సంఘటన చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం కొన్ని సంవత్సరాల నుండి ముప్పారం గ్రామంలో ఆలకుంట రాజు భార్య గట్టమ్మ జీవనం గడుపుతూ ఇద్దరు కూతుర్లు, కుమారుడు ఉన్నారు. భర్త ఆలకుంట రాజు నిత్యం తాగి వచ్చి భార్యతో గొడవపడుతూ ఉండేవాడని తెలిపారు.

మధ్యాహ్నం వారి పిల్లలు లేని సమయంలో భార్యతో ఇంటిలోపల గొడవపడి భర్త రాజు తన భార్యను కర్రతో తలపై బలంగా కొట్టగా అక్కడికక్కడే మృతి చెందారని తెలిపారు. భార్య మృతదేహాన్ని ఇంటిలో ఉంచి తలుపులు పెట్టి భర్త రాజు పారిపోయాడు. వారి పిల్లలు స్కూల్ నుండి వచ్చి ఇంటి తలుపులు తీయడంతో రక్తపు మడుగులో ఉన్న వారి తల్లి కనిపించింది. చూసిన వెంటనే పిల్లలు కేకలు వేయడంతో హత్య జరిగినట్లు వెలుగులోకి వచ్చింది. వారి కుటుంబసభ్యుల ఫిర్యాదుపై స్థానిక సిఐ సాదుల్లా బాబా సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నామని పూర్తి వివరాలు తెలియాల్సి ఉందన్నారు.

Husband who killed his Wife

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post భార్యను కర్రతో కొట్టి చంపిన భర్త appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.