భార్య, కూతురిపై గడ్డపారతో దాడి.. ఆపై ఉరేసుకొన్న భర్త

  నల్లగొండ: ఓ వ్యక్తి తన భార్య, కూతురిపై గడ్డపారతో దాడి చేసి, అనంతరం ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నల్లగొండ జిల్లాలోని నాంపల్లి మండలం, రాందాస్‌తండాలో  చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే.. మెగావత్‌ మధు అనే వ్యక్తి కుటుంబ కలహాలతో తన భార్య అఖిల, కుమార్తె మిల్కీపై గడ్డపారతో విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ దాడిలో అతడి భార్య అఖిల అక్కడికక్కడే మరణించింది. కుమార్తె మిల్కీ కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతోంది. ఇద్దరు చనిపోయారని నిర్ధారించుకున్న మధు ఉరి […] The post భార్య, కూతురిపై గడ్డపారతో దాడి.. ఆపై ఉరేసుకొన్న భర్త appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

నల్లగొండ: ఓ వ్యక్తి తన భార్య, కూతురిపై గడ్డపారతో దాడి చేసి, అనంతరం ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నల్లగొండ జిల్లాలోని నాంపల్లి మండలం, రాందాస్‌తండాలో  చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే.. మెగావత్‌ మధు అనే వ్యక్తి కుటుంబ కలహాలతో తన భార్య అఖిల, కుమార్తె మిల్కీపై గడ్డపారతో విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ దాడిలో అతడి భార్య అఖిల అక్కడికక్కడే మరణించింది. కుమార్తె మిల్కీ కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతోంది. ఇద్దరు చనిపోయారని నిర్ధారించుకున్న మధు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పరిస్థితి గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమందించారు. చిన్నారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఘటనపై స్థానికులను ఆరా తీస్తున్నారు.

Husband who killed his wife with Family Quarrels

The post భార్య, కూతురిపై గడ్డపారతో దాడి.. ఆపై ఉరేసుకొన్న భర్త appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: