భర్తను చంపిన భార్య…కారణం ఇదీ …

Murder

 

వనస్థలిపురం: భర్త వేధింపులను భారించలేక ఓ మహిళ తన భర్తను హత్య చేసిన సంఘటన వనస్థలిపురం పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… నల్గొండ జిల్లా నేరేడుగొమ్ము మండలం, పలుగు తండాకు చెందిన పత్లావత్ ప్రసాద్(30) భార్య సరోజ(28)తో కలిసి నగరానికి వచ్చాడు. సాగర్ కాంప్లెక్స్ కాలనీలో నివాసముంటూ ఆటో తోలుతూ జీవనం కొనసాగిస్తున్నాడు. అయితే, ఇటీవల మద్యానికి బానిసైన ప్రసాద్ తాగి వచ్చి తరచు భార్యతో గొడపడేవాడు. ఈ క్రమంలోనే సోమవారం రాత్రి కూడా ప్రసాద్ తాగి భార్య సరోజతో తగదా పెట్టుకున్నాడు.

కాగా.. సరోజ తన సోదారు లక్ష్మణ్ ను పలిచి జరిగిన విషయం చెప్పింది. దీంతో ప్రసాద్ రాత్రి పడుకోగానే ముఖంపై దిండు పెట్టి, గొంతు నులిమి చంపేశారు. తన భర్త గుండె పోటు వచ్చి చనిపోయడాని చుట్టు ప్రక్కల వారిని నమ్మించి, ప్రసాద్ ను సొంత ఊరికి తీసుకెళ్లారు. అనుమానం వచ్చిన బంధువులు సరోజపై దాడి చేయడంతో జరిగిన విషయం మొత్తం చెప్పింది. దీంతో మత్యుడి కుటుంబ సభ్యులు వనస్థలిపురం పోలీసులకు సరోజ, తన అన్న లక్ష్మణ్ పై ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Husband Murdered by his Wife in Vanasthalipuram

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post భర్తను చంపిన భార్య… కారణం ఇదీ … appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.