భార్యను ముక్కలు ముక్కలుగా నరికి…సెప్టింక్ ట్యాంక్ లో పడేసి

 

 

ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని రోహిణి జిల్లా ప్రేమ్ నగర్‌లో దారుణం చోటుచేసుకుంది. భార్యను భర్త చంపి ముక్కలు ముక్కలుగా నరికి సెప్టింక్ ట్యాంక్‌లో పడేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. ఓ వ్యక్తి(37) టివి మెకానిక్‌గా పని చేస్తూ తన కుటుంబాన్ని పోషిస్తున్నాడు. గత ఆరు నెలల నుంచి భార్యతో తరుచూ గొడవలు జరుగుతున్నాయి. శనివారం సాయంత్రంలో భార్యతో భర్త గొడవ పడ్డాడు. కోపంలో ఆమెను హత్య చేసి ముక్కలు ముక్కలుగా నరికి సెప్టింక్ ట్యాంకులో పడేశాడు. నిందితుడు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి ఘటనా స్థలానికి చేరుకొని ముక్కలు ముక్కలుగా ఉన్న మృతదేహం భాగాలను ఆస్పత్రికి తరలించారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

 

Husband Kills Wife, chops her Body into Pieces

The post భార్యను ముక్కలు ముక్కలుగా నరికి… సెప్టింక్ ట్యాంక్ లో పడేసి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.