డబ్బు కోసం భార్యను హత్య చేసిన భర్త

కోరుట్ల: తాగుడుకు బానిసై క్షణికావేశంలో కట్టుకున్న భార్యను భర్త హతమార్చిన సంఘటన కోరుట్ల పట్టణంలో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం కోరుట్ల పట్టణంలోని అయ్యప్పగుట్ట ప్రాంతానికి చెందిన పేర్ల మల్లయ్య (38) తన భార్య సాయమ్మ(32)తో నివాసముంటున్నాడు. వారికి ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నారు. మల్లయ్య తాగుడుకు బానిసై నిత్యం మద్యం సేవించచాడు. కూలీ పని చేస్తు ఇంటిని నడుపుతున్న భార్య సాయమ్మతో గొడువ పడే వాడు. ఇదే క్రమంలో మంగళవారం సాయంత్రం […]


కోరుట్ల: తాగుడుకు బానిసై క్షణికావేశంలో కట్టుకున్న భార్యను భర్త హతమార్చిన సంఘటన కోరుట్ల పట్టణంలో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం కోరుట్ల పట్టణంలోని అయ్యప్పగుట్ట ప్రాంతానికి చెందిన పేర్ల మల్లయ్య (38) తన భార్య సాయమ్మ(32)తో నివాసముంటున్నాడు. వారికి ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నారు. మల్లయ్య తాగుడుకు బానిసై నిత్యం మద్యం సేవించచాడు. కూలీ పని చేస్తు ఇంటిని నడుపుతున్న భార్య సాయమ్మతో గొడువ పడే వాడు. ఇదే క్రమంలో మంగళవారం సాయంత్రం భార్యతో డబ్బుల కోసం గొడువ పడ్డ మల్లయ్య క్షణికావేశంలో కత్తితో సాయమ్మను పోడవడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. దానితో మల్లయ్య అదే కత్తితో తనకు తానే కడుపులో పొడుచుకొని ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన మల్లయ్యను చికిత్స నిమిత్తం జగిత్యాల ఏరియా ఆసుపత్రికి తరలించారు. మెట్‌పల్లి డిఎస్పి మల్లారెడ్డి, కోరుట్ల సిఐ సతీష్‌చందర్ రావు, ఎస్ఐ రవి కుమార్‌లు కేసు నమోదు చేసుకొని సంఘటనకు సంబంధించిన వివరాలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు.