భార్య మరణం తట్టుకోలేక భర్త మృతి

ఇద్దరు పిల్లలు ఆత్మహత్యాయత్నం…హైదరాబాద్ డిడి కాలనీలో విషాదం మన తెలంగాణ /ముషీరాబాద్: భార్య అనారోగ్యంతో మృతి చెందడంతో తట్టుకోలేక భర్త హఠాన్మరణం చెందగా, తల్లిదండ్రులిద్దరు మృతి చెందడంతో వారి కుమారుడు, కుమార్తెలు కూల్‌డ్రింక్స్‌లో నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సం ఘటన అంబర్‌పేట పోలీసుస్టేషన్ పరిధిలోని డీడీ కాలనీలో చోటుచేసుకుంది. అంబర్‌పేట సిఐ రవీందర్, స్థానికులు తెలిపిన ప్రకారం వివరాలిలా ఉన్నాయి. పంజాబ్ రాష్ట్రానికి చెందిన పవన్ కర్బందా (65), నీలం కర్బందా (55) దంపతులు, […] The post భార్య మరణం తట్టుకోలేక భర్త మృతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

ఇద్దరు పిల్లలు ఆత్మహత్యాయత్నం…హైదరాబాద్ డిడి కాలనీలో విషాదం

మన తెలంగాణ /ముషీరాబాద్: భార్య అనారోగ్యంతో మృతి చెందడంతో తట్టుకోలేక భర్త హఠాన్మరణం చెందగా, తల్లిదండ్రులిద్దరు మృతి చెందడంతో వారి కుమారుడు, కుమార్తెలు కూల్‌డ్రింక్స్‌లో నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సం ఘటన అంబర్‌పేట పోలీసుస్టేషన్ పరిధిలోని డీడీ కాలనీలో చోటుచేసుకుంది. అంబర్‌పేట సిఐ రవీందర్, స్థానికులు తెలిపిన ప్రకారం వివరాలిలా ఉన్నాయి. పంజాబ్ రాష్ట్రానికి చెందిన పవన్ కర్బందా (65), నీలం కర్బందా (55) దంపతులు, వీరికి కుమార్తె మను కర్బందా (34), కుమారుడు నిఖిల్ కర్బందా (30) ఉన్నారు. పవన్ కర్బందా ఆబిడ్స్‌లోని ట్రూప్ బజార్‌లో ఓ షాపులో పని చేస్తుండేవాడు. నీలం కర్బందా గృహిణి, ఆమెకు తోడుగా కుమార్తె మను కర్బందా ఇంట్లోనే ఉంటుంది. కుమారుడు నిఖిల్ కర్బందా ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. వీరు దాదాపు రెండు సంవత్సరాల క్రితం బాగ్ అంబర్‌పేట డీడీ కాలనీలో ఇంటి నెంబర్ 2-2-/ఎ/బిఎల్/8 ఇంట్లో అద్దెకుంటున్నారు. గత నాలుగు నెలలుగా నీలం కర్బందా తీవ్ర అనారోగ్యానికి గురైంది. ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లగా కిడ్నీ వ్యాధిలో బాధపడుతున్నట్లు వైద్యులు తెలిపారు. అప్పటి నుంచి ఆమె డయాలసిస్ వైద్యం చేయించుకుంటుంది.

ఈ క్రమంలో ఆమె పరిస్థితి విషమించడంతో ఆసుపత్రిలో ఈ నెల 9వ తేదీన మంగళవారం మధ్యాహ్నం 3:30 గంటల సమయంలో చికిత్స పొందుతూ మృతి చెందింది. సాయంత్రం 7 గంటల సమయంలో ఆమె మృతదేహాన్ని డీ డీ కాలనీలోని ఇంటికి తీసుకువచ్చారు. అయితే నీలం కర్బందా మృతి చెందిన విషయాన్ని కుటుంబ సభ్యులు ఇంటి యజమాని బ్రహ్మంకు తెలియకుండా మొదటి అంతస్తులోకి తీసుకెళ్లారు. భార్య మృతి చెందిన విషయాన్ని జీర్ణించుకోలేక పవన్ కర్బందా 10వ తేదీన గుండెపోటుతో మృతి చెందాడు. తల్లిదండ్రుల మృతిని తట్టుకోలేక వారి కుమార్తె మను కర్బందా, కుమారుడు నిఖిల్ కర్బందాలు కూల్‌డ్రింక్‌లో నిద్ర మాత్రలు వేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఆసిఫ్‌నగర్‌లో ఉంటున్న పవన్ కర్బందా సోదరుడు హరిమోహన్ మధ్యాహ్నం గురువారం 12 గంటల సమయంలో డిడీ కాలనీలోని తన సోదరుడి ఇంటికి వచ్చాడు. ఇంటి తలుపు తట్టగా బదులు రాకపోవడంతో ఫోన్ చేసాడు.

ఫోన్ రింగ్ అయింది కానీ వారు ఫోన్ ఎత్తలేదు. దీంతో హరిమోహన్ ఇంటి యజమాని బ్రహ్మంకు ఈ విషయాన్ని తెలియ చేశాడు. దీంతో వారు పవన్ కర్బందా నివాసం ఉంటున్న గది వెనక భాగంలోని తలుపును పగులగొట్టి లోనికి వెళ్లి చూడగా నలుగురు నేల పై విగతజీవులై కన్పించారు. ఈ విషయాన్ని వారు అంబర్‌పేట పోలీసులకు సమాచారం అందచేసారు. పోలీసులు వచ్చి చూడగా అప్పటికే నీలం కర్బందా, పవన్ కర్బందాలు మృతి చెందినట్లు, వారి పక్కన కూల్ డ్రింక్స్ బాటిళ్లు పడి ఉన్నాయి. మను కర్బందా, నిఖిల్ కర్బందాలను చూడగా వారు ప్రాణాపాయస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. వారిని వెంటనే చికిత్స నిమిత్తం ఆంధ్ర మహిళా సభ ఆసుపత్రికి తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమంగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

తల్లిదండ్రులు లేనిది మేమెందుకని..
తల్లిదండ్రులిద్దరు మృతి చెందడంతో మనం ఉండి ఏం లాభమని అనుకుని అవివాహితులైన కుమార్తె మను, కుమారుడు నిఖిల్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన కుమార్తె, కుమారుడు ఇద్దరి వయస్సు 34, 30 ఏళ్ల వయస్సు కావడంతో వీరికి వివాహాలు కాకపోవడంతో కూడా వీరు వేదనకు గురై ఆత్మహత్య చేసుకున్నారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వీరి వివాహం చేసుకోకపోవడానికి కారణం కుటుంబ సమస్యలా, ఆర్థిక సమస్యలా అనే కోణంలో కూడా పోలీసులు విచారణ చేపట్టారు.
సోదరుడికి ముందే తెలియ చేశారా ?
నీలం కర్బందా మృతి చెందిన విషయాన్ని పవన్ కర్బందా మంగళవారం రాత్రే ఆసిఫ్‌నగర్‌లో ఉంటున్న తన సోదరుడు హరిమోహన్‌కు ఫోన్‌లో చెప్పినట్లు తెలిసింది. అయితే హరిమోహన్ బుధవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో డీడీ కాలనీలోని సోదరుడి ఇంటికి వచ్చి తలుపు తట్టాడు. అయితే తలుపు తీయకపోవడంతో తిరిగి వెళ్లిపోయాడు. విషయం తెలిసినప్పటికి హరిమోహన్ పోలీసులకు, ఇంటి యజమానికి నీలం కర్బందా మృతి చెందిన విషయాన్ని చెప్పకపోవడం పై పలు అనుమానాలకు తావిస్తోంది. గురువారం ఉదయం 9 గంటల సమయంలో తిరిగి సోదరుడి ఇంటికి వచ్చి తలుపు తట్టి వారు తెరవకపోవడంతో ఇంటి యజమాని బ్రహ్మంకు తెలియచేసాడు. వారు ఇంటి వెనక తలుపు పగులగొట్టి చూడగా నలుగురు నేలపై పడి ఉండటాన్ని గుర్తించి అంబర్‌పేట పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు, క్లూస్ టీమ్ ఘటనా స్థలానికి చేరుకుని నీలం కర్బందా, పవన్ కర్బందాలు మృతి చెందడాన్ని గమనించారు. కొన ఊపిరితో ఉన్న కుమార్తె మను కర్బందా, కుమారుడు నిఖిల్ కర్బందాలను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఆంధ్రమహిళా సభ ఆసుపత్రి వైద్యుల సూచన మేరకు గాంధీ ఆసుపత్రికి ఇద్దరిని తరలించారు. ఈ ఘటనపై అంబర్‌పేట పోలీసులు విచారణ చేపట్టారు.

Husband  death due to wife death in Hyderabad
Related Images:

[See image gallery at manatelangana.news]

The post భార్య మరణం తట్టుకోలేక భర్త మృతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: