సబ్బుల ధరలు తగ్గించిన కంపెనీలు

  న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు యావత్ దేశం చేస్తున్న పోరులో నిత్యావసర వస్తువుల (ఎఫ్‌ఎంసిజి)సంస్థలు కూడా భాగస్వాములయ్యేందుకు సిద్ధమయ్యాయి. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో తమ వంతు బాధ్యతనెరిగి ప్రవర్తించాలని నిర్ణయించుకున్నాయి. ప్రస్తుతం ఎంతో కీలకమైన శానిటైజర్లు, సబ్బుల ఉత్పత్తిని పెంచడంతో పాటుగా వాటి ధరలను తగ్గించాలని నిర్ణయించాయి. ప్రముఖ ఎఫ్‌ఎంసిజి సంస్థ హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్ (హెచ్‌యుఎల్) కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి రూ.100 కోట్ల సహాయాన్ని ప్రకటించింది. లైఫ్‌బాయ్ శానిటైజర్లు, లైఫ్ లిక్విడ్ హ్యాండ్‌వాష్, డొమెక్స్ […] The post సబ్బుల ధరలు తగ్గించిన కంపెనీలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు యావత్ దేశం చేస్తున్న పోరులో నిత్యావసర వస్తువుల (ఎఫ్‌ఎంసిజి)సంస్థలు కూడా భాగస్వాములయ్యేందుకు సిద్ధమయ్యాయి. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో తమ వంతు బాధ్యతనెరిగి ప్రవర్తించాలని నిర్ణయించుకున్నాయి. ప్రస్తుతం ఎంతో కీలకమైన శానిటైజర్లు, సబ్బుల ఉత్పత్తిని పెంచడంతో పాటుగా వాటి ధరలను తగ్గించాలని నిర్ణయించాయి. ప్రముఖ ఎఫ్‌ఎంసిజి సంస్థ హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్ (హెచ్‌యుఎల్) కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి రూ.100 కోట్ల సహాయాన్ని ప్రకటించింది. లైఫ్‌బాయ్ శానిటైజర్లు, లైఫ్ లిక్విడ్ హ్యాండ్‌వాష్, డొమెక్స్ ఫ్లోర్ క్లీనర్ల 15 శాతం తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. వీటి ఉత్పత్తిని తక్షణమే ప్రారంభిస్తున్నట్లు కూడా తెలిపింది. త్వరలో ఇవి మార్కెట్లోకి రానున్నాయని తెలిపింది. వీటి ఉత్పత్తిని కూడా పెంచుతున్నట్లు తెలిపింది.

భవిష్యత్తులో ఉత్పత్తిని మరింత పెంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపింది. అలాగే అవసరమైన చోట్ల రెండు కోట్ల లైఫ్‌బాయ్ సబ్బులను ఉచితంగా పంచనున్నట్లు కూడా తెలిపింది. ఈ క్రమంలో ప్రభుత్వాలు, స్థానిక యంత్రాంగాలతో కలిసి పని చేస్తున్నామని సంస్థ సిఎండి సంజీవ్ మెహతా తెలియజేశారు. హెచ్‌యుఎల్ బాటలోనే పతంజలి, గోద్రెజ్ సంస్థలు కూడా కీలక నిర్ణయాలు తీసుకున్నాయి.అలోవేరా హల్దీచందన్ సబ్బుల ధరలను 12.5 శాతం తగ్గిస్తున్నట్లు పతంజలి అధికార ప్రతినిధి ఎస్‌కె తిజరావ్లా ప్రకటించారు. ఇక ఇటీవలి కాలంలో పెరిగిన ముడి సరకు ధరల పెంపు భారాన్ని వినియోగదారులపై పడనివ్వబోమని గోద్రెజ్ సంస్థ ప్రకటించింది. సబ్బుల తయారీకి అవసరమైన ముడిపదార్థాల ధరలు ఇటీవలి కాలంలో 30 శాతం పెరిగాయని, అందువల్ల ధరలు పెంచాలని ఇటీవల నిర్ణయించామని గోద్రెజ్ కన్సూమర్ ప్రాడక్ట్ సిఇఓ సునీల్ కటారియా తెలిపారు. అయితే తాజా పరిస్థితుల నేపథ్యంలో ధరల పెంపు నిర్ణయాన్ని అమలు చేయడం లేదని ఆయన చెప్పారు.

HUL cuts Lifebuoy soap, sanitiser prices by 15%

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post సబ్బుల ధరలు తగ్గించిన కంపెనీలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: