ఏడుపాయలకు పోటెత్తిన భక్త జనం

పాపన్నపేట ః పవిత్ర పుణ్యక్షేత్రమైన శ్రీ ఏడుపాయల వనదుర్గాభావాని మాత ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆదివారం సెలవు దినం కావడంతో మండలంలోని ఆయా గ్రామాలతో పాటు వివిధ గ్రామాల నుండి పెద్ద సంఖ్యలో భక్తుల తరలివ్చారు. ఆలయ ప్రాంగణం పూర్తిగా భక్తులో కిక్కిరిపోయింది. ఈ సందర్భంగా ఆలయంలో అమ్మవారికి ఉదయం నుండి ప్రత్యేక పూజలు నిర్వహించి పట్టువస్త్రాలతో అలంకరించి దర్శణం కల్పించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులకు అర్చకులు నర్సింహాచారి, […] The post ఏడుపాయలకు పోటెత్తిన భక్త జనం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

పాపన్నపేట ః పవిత్ర పుణ్యక్షేత్రమైన శ్రీ ఏడుపాయల వనదుర్గాభావాని మాత ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆదివారం సెలవు దినం కావడంతో మండలంలోని ఆయా గ్రామాలతో పాటు వివిధ గ్రామాల నుండి పెద్ద సంఖ్యలో భక్తుల తరలివ్చారు. ఆలయ ప్రాంగణం పూర్తిగా భక్తులో కిక్కిరిపోయింది. ఈ సందర్భంగా ఆలయంలో అమ్మవారికి ఉదయం నుండి ప్రత్యేక పూజలు నిర్వహించి పట్టువస్త్రాలతో అలంకరించి దర్శణం కల్పించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులకు అర్చకులు నర్సింహాచారి, శంకర్‌శర్మ, మురళిచారిలు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయానికి వచ్చిన భక్కులు ఆలయం ముందుగల సంతాన గుండంలో సంతనం కలుగాలని దంపతులు పుణ్యస్నానాలు ఆచరించి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారి దర్శణం అనంతరం పలువురు భక్తులు వివిధ రూపాల్లో మొక్కులను చెల్లించుకున్నారు. ఆలయ ప్రాంగణంలో భారీగా తరలివచ్చిన భక్తులతో కిక్కిరిసిపోయింది.

మరి కొంత మంది భక్తులు శివసత్తుల పూనకాలతో, డప్పుచప్పుళ్ల మేళాలతో ఊరేగింపుగా బోనాలు, ఓడిబియ్యం తీసుకువచ్చి అమ్మవారికి సమర్పించారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు అమ్మవారికి వివిధ రూపాల్లో మొక్కులను చెల్లించారు. ఏడుపాయల ప్రాంగణంలోని చెట్లు, బండరాళ్ల మధ్య భక్తులు విందు వినోదాలు చేసుకొని ఆనందంగా ఉల్లాసంగా గడిపి వన భోజనాలు చేశారు. ఆలయానికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఆలయ కార్యనిర్వహణ అధికారి మోహన్‌రెడ్డి, ఆలయ చైర్మేన్ పట్లోళ్ల విష్ణువర్ధన్‌రెడ్డి, ఆలయ సిబ్బంది జెన్నరవికుమార్, సిద్దిపేట శ్రీనివాస్, లక్ష్మినారాయణ, సూర్య శ్రీనివాస్, మధుసూదన్‌రెడ్డి, ప్రతాప్‌రెడ్డి, శ్రీనివాస్‌శర్మ, ధర్మకర్తలు గౌరిశంకర్, నారాయణ తదీతరులు సేవలను అందజేశారు. ఏడుపాయలలో ఎలాంటి వాంచనీయ సంఘటనలు జరుగకుండా పాపన్నపేట ఎస్ఐ ఆంజనేయులు ఆధ్వర్యంలో గట్టి పోలీసు బందోబస్తు నిర్వహించారు.

Huge Devotees Rush At Edupayala in Medak District

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ఏడుపాయలకు పోటెత్తిన భక్త జనం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: