నవాజ్ షరీఫ్ ను జైలుకు పంపేందుకు భారీ కుట్ర

కరాచీ : అవినీతి కేసులో పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ ను జైలుకు పంపించేందుకు భారీ కుట్ర జరిగిందని ఆయన కూతురు మర్యం నవాజ్ ఆరోపించారు. అవినీతి కేసులో నవాజ్ షరీఫ్ ను దోషిగా ప్రకటించాలని తనపై ఒత్తడి వచ్చిందని, తనను బ్లాక్ మెయిల్ చేశారని అవినీతి కేసులో తీర్పును ఇచ్చిన జడ్జి చెబుతున్న వీడియోను మర్యం నవాజ్ ఆదివారం విడుదల చేశారు. తన తండ్రి నవాజ్ షరీఫ్ కేసు విచారణ మొత్తం తీవ్ర ఒత్తిడి […] The post నవాజ్ షరీఫ్ ను జైలుకు పంపేందుకు భారీ కుట్ర appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

కరాచీ : అవినీతి కేసులో పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ ను జైలుకు పంపించేందుకు భారీ కుట్ర జరిగిందని ఆయన కూతురు మర్యం నవాజ్ ఆరోపించారు. అవినీతి కేసులో నవాజ్ షరీఫ్ ను దోషిగా ప్రకటించాలని తనపై ఒత్తడి వచ్చిందని, తనను బ్లాక్ మెయిల్ చేశారని అవినీతి కేసులో తీర్పును ఇచ్చిన జడ్జి చెబుతున్న వీడియోను మర్యం నవాజ్ ఆదివారం విడుదల చేశారు. తన తండ్రి నవాజ్ షరీఫ్ కేసు విచారణ మొత్తం తీవ్ర ఒత్తిడి మధ్య జరిగిందని ఆమె పేర్కొన్నారు. నవాజ్ షరీఫ్ అవినీతికి పాల్పడినట్టు ఎటువంటి ఆధారాలు లేకపోయినా, ఆయనకు వ్యతిరేకంగా తీర్పునివ్వాలని ఒత్తిడి రావడంతో ఆయన్ను దోషిగా ప్రకటించినట్టు జడ్జి మాలిక్ చెబుతున్నట్టు ఈ వీడియోలో ఉంది. ఈ వీడియోపై పాక్ ప్రభుత్వం స్పందించింది. ఇది ఫేక్ వీడియో అని , దీనిపై ఫోరెన్సిక్ నిపుణులతో పరీక్ష చేయిస్తామని ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఈ ఫేక్ వీడియోతో పాక్ న్యాయవ్యవస్థపై దాడి చేసేందుకు కొందరు యత్నిస్తున్నారని పాక్ ప్రభుత్వం పేర్కొంది. తన తండ్రి నవాజ్ షరీఫ్ ను చట్ట వ్యతిరేకంగా జైలుకు పంపించినట్టు ఈ వీడియోతో నిర్ధారణ అయిందని, తక్షణమే తన తండ్రిని విడుదల చేయాలని మర్యం డిమాండ్ చేసింది. ఇస్లామాబాద్ హైకోర్టులో షరీఫ్ బెయిల్ కేసు విచారణ సమయంలో ఈ వీడియోను కోర్టుకు అప్పగిస్తామని ఆమె స్పష్టం చేశారు.

Huge Conspiracy To Send Pak Ex PM Nawaz Sharif To Jail

Related Images:

[See image gallery at manatelangana.news]

The post నవాజ్ షరీఫ్ ను జైలుకు పంపేందుకు భారీ కుట్ర appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.