హువావే మ‌డ‌త‌బెట్టే 5జీ స్మార్ట్ ఫోన్‌..

ముంబయి: ప్రముఖ మొబైల్స్ త‌యారీదారు హువావే త‌న తొలి ఫోల్డ‌బుల్ స్మార్ట్‌ఫోన్ మేట్ ఎక్స్ ను స్పెయిన్ లోని బార్సిలోనాలో జ‌రుగుతున్న ఎండ‌బ్ల్యూసీ 2019 ప్ర‌దర్శ‌న‌లో లాంచ్ చేసింది. ఇందులో 6.6 ఇంచుల డిస్‌ప్లేను ముందు భాగంలో, 6.38 ఇంచుల డిస్ ప్లే ఉంది. ఈ రెండింటినీ మ‌డ‌త తీసిన‌ప్పుడు డిస్ ప్లే ఒకటే అవుతుంది. అప్పుడు ఆ డిస్‌ప్లే సైజ్ 8 ఇంచులు ఉంది. ఇలా ఈ ఫోన్ ను మ‌డ‌త‌బెట్టుకోవ‌చ్చు. ఇక ఈ స్మార్ట్ ఫోన్‌లో […]

ముంబయి: ప్రముఖ మొబైల్స్ త‌యారీదారు హువావే త‌న తొలి ఫోల్డ‌బుల్ స్మార్ట్‌ఫోన్ మేట్ ఎక్స్ ను స్పెయిన్ లోని బార్సిలోనాలో జ‌రుగుతున్న ఎండ‌బ్ల్యూసీ 2019 ప్ర‌దర్శ‌న‌లో లాంచ్ చేసింది. ఇందులో 6.6 ఇంచుల డిస్‌ప్లేను ముందు భాగంలో, 6.38 ఇంచుల డిస్ ప్లే ఉంది. ఈ రెండింటినీ మ‌డ‌త తీసిన‌ప్పుడు డిస్ ప్లే ఒకటే అవుతుంది. అప్పుడు ఆ డిస్‌ప్లే సైజ్ 8 ఇంచులు ఉంది. ఇలా ఈ ఫోన్ ను మ‌డ‌త‌బెట్టుకోవ‌చ్చు. ఇక ఈ స్మార్ట్ ఫోన్‌లో 5జి ఫీచ‌ర్‌ను సంస్థ అందిస్తున్నారు. అలాగే ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్ ను సైడ్‌కు సెట్ చేశారు.

వెనుక భాగంలో 40, 16, 8 మెగాపిక్స‌ల్ తో మూడు కెమెరాలు ఉన్నాయి. ఈ ఫోన్‌లో మైక్రో ఎస్డీ కార్డుకు బ‌దులుగా ఎన్ఎం కార్డు స్లాట్‌ను ఏర్పాటు చేశారు. దీంతో ఆ స్లాట్‌లో ఎన్ఎం కార్డును వేసుకుని స్టోరేజీని మరింత పెంచుకోవ‌చ్చు. అలాగే ఈ ఫోన్‌కు 55 వాట్ల సూపర్ చార్జ్ వంటి అద్భుత ఫీచ‌ర్‌ను కూడా అందుబాటులో ఉంది. ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ ఫీచ‌ర్ తో వ‌చ్చిన తొలి స్మ ఫోన్ ఇదే కావ‌డం గమనార్హం. అయితే, ఈ ఫోన్ లో ఉన్న 4500 ఎంఎహెచ్ బ్యాట‌రీ చార్జ్ 0 నుంచి 85 శాతం చార్జింగ్ అవ్వడానికి కేవ‌లం 30 నిమిషాలు మాత్రమే మాత్ర‌మే ప‌డుతుంది. హువావే మేట్ ఎక్స్ స్మార్ట్‌ఫోన్ ఇంట‌ర్‌స్టెల్లార్ బ్లూ క‌ల‌ర్ ఆప్ష‌న్ లో రిలీజ్ కాగా ఈ ఫోన్ ధ‌రను 2607 డాల‌ర్లు (ఇండియన్ కరెస్సీలో దాదాపుగా రూ.1,85,220) గా నిర్ణ‌యించారు. ఇక ఈ ఫోన్ జూన్ లేదా జూలై నెల‌లో వినియోగ‌దారుల‌కు అందుబాటులోకి రానుంది.

హువావే మేట్ ఎక్స్ అద్భుత ఫీచ‌ర్లు…

6.6 ఇంచ్ ఓలెడ్ డిస్‌ప్లే, 2480 x 1148 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌,

6.38 ఇంచ్ సెకండ‌రీ ఓలెడ్‌ డిస్‌ప్లే, 2480 x 892 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌,

హువావే కైరిన్ 980 ప్రాసెస‌ర్‌, 5జి, 8జిబి ర్యామ్, 512 జిబి స్టోరేజ్‌,

256 జిబి ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, ఎన్ఎం కార్డ్‌,

ఆండ్రాయిడ్ 9.0 పై, 40, 16, 8 మెగాపిక్స‌ల్ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు,

హైబ్రిడ్ డ్యుయ‌ల్ సిమ్, సైడ్ మౌంటెడ్ ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌,

డ్యుయ‌ల్ 4జి వివొఎల్టీఇ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0 ఎల్ఇ, ఎన్ఎఫ్‌సి, యుఎస్‌బి టైప్ సి, 4500 ఎంఎహెచ్ బ్యాట‌రీ, 55 వాట్ల సూప‌ర్ చార్జ్‌ వంటి అద్భుత ఫీచర్లు ఈ స్మార్ట్ ఫోన్ లో ఇందులో ఉన్నాయి

huawei mate x 5g foldable phone launch

Related Images:

[See image gallery at manatelangana.news]

Related Stories: