ఇంట్లోనే శానిటైజర్‌ను తయారుచేద్దాం

  కరోనా మహమ్మారి దరిచేరకూడదంటే శుభ్రంగా ఉండటమే మార్గం. నగరంలో ఎక్కడ చూసినా కరోనా భయాలే. ప్రపంచాన్ని వణికిస్తున్న ఈ వైరస్ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో మొదటిది చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవడం. సబ్బు, హ్యాండ్‌వాష్‌లను ఉపయోగించడం కన్నా శానిటైజర్‌ను వాడటం సులభం, ఉత్తమమని ప్రచారం జరగడంతో వీటికి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. దొరకని పరిస్థితి ఏర్పడింది. హ్యాండ్ శానిటైజర్‌లు సులభంగా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చెబుతున్నారు నిపుణులు. శానిటైజర్ తయారీకి కావాల్సినవి: 1. రబ్బింగ్ ఆల్కహాల్ […] The post ఇంట్లోనే శానిటైజర్‌ను తయారుచేద్దాం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

కరోనా మహమ్మారి దరిచేరకూడదంటే శుభ్రంగా ఉండటమే మార్గం. నగరంలో ఎక్కడ చూసినా కరోనా భయాలే. ప్రపంచాన్ని వణికిస్తున్న ఈ వైరస్ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో మొదటిది చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవడం. సబ్బు, హ్యాండ్‌వాష్‌లను ఉపయోగించడం కన్నా శానిటైజర్‌ను వాడటం సులభం, ఉత్తమమని ప్రచారం జరగడంతో వీటికి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. దొరకని పరిస్థితి ఏర్పడింది. హ్యాండ్ శానిటైజర్‌లు సులభంగా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చెబుతున్నారు నిపుణులు.

శానిటైజర్ తయారీకి కావాల్సినవి:

1. రబ్బింగ్ ఆల్కహాల్ : ఇది నాన్‌సెప్టిక్ ద్రావకం. దీన్ని ఐసోప్రోప్లీ ఆల్కహాల్, ఇథేల్ ఆల్కహాల్, ఇథనాల్ అని కూడా అంటారు. ఇది ఫంగస్, వైరస్‌లకు చంపేస్తుంది. మెడికల్ షాప్స్, మెడికల్ ఏజెన్సీలు లేదా మెడికల్ రసాయనాలు అమ్మే షాపుల్లో ఇది దొరుకుతుంది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఆన్‌లైన్ స్టోర్లలో కూడా బ్రాండ్‌ను బట్టి 100 ఎంఎల్ రూ.100 నుంచి రెండు లీటర్‌లు, 5 లీటర్ల క్వాంటిటీలో రూ. 495 ఆపై ధరల్లో లభిస్తుంది.

2. అలోవెరా జెల్ : కిరాణా, ఆయుర్వేద షాపుల్లో ఇది దొరుకుతుంది. ఇంట్లో అలోవెరా మొక్క ఉంటే దాని నుంచి కూడా సేకరించవచ్చు. యాంటిబయోటెక్‌గా, చర్మ రక్షణకు ఇది ఉపకరిస్తుంది.

3. ఎసెన్షియల్ ఆయిల్ : అదనపు క్రిమినాశక లక్షణాలను ఇది కలిగి ఉంటుంది. వివిధ రకాల ఫ్లేవర్లలో ఇది తక్కువ ధరకే దొరుకుతుంది. మొక్కల నుంచి సేకరించే ఎసెన్సియల్ ఆయిల్ కాస్మొటిక్స్, పరిమళ ద్రవాలు, పలురకాల ఆహార ఉత్పత్తుల్లో దీన్ని ఉపయోగిస్తారు.

4. తయారీ ఇలా : 100 శాతం ఆల్కహాల్ ద్రావకం ఉంటే 140 ఎంఎల్ ఆల్కహాల్ తీసుకోవాలి. దీనిలో 60 ఎంఎల్ మినరల్ వాటర్ కలపాలి. ఇందులో 100 ఎంఎల్ అలోవెరా జెల్ వేసి 8 నుంచి 15 చుక్కలు వేసి కలపాలి. తర్వాత 300 ఎంఎల్ శానిటైజర్‌ను హ్యాండ్ పంప్ బాటిల్‌లో వేసుకుని శానిటైజర్‌గా వాడుకోవచ్చు. వంద శాతం మిక్స్ ఉన్న ఆల్కహాల్ ద్రావకంలో 30 నుంచి 40 వరకు మినరల్ వాటర్ మిక్స్ చేసుకోవాలి. రబ్బింగ్ ఆల్కహాల్ దొరక్కపోతే ఓడ్కా లిక్కర్‌ను ఉపయోగించుకోవచ్చు. బాదం ఆయిల్, బాడీ ఆయిల్‌ను కూడా ఇందులో మిక్స్ చేసుకోవచ్చు. మార్కెట్‌లో లభించే అలోవెరా జెల్‌ను ఉపయోగిస్తే ఎసెన్షియల్ ఆయిల్ అవసరం ఉండదు.

How To Make Hand Sanitizer In Home

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ఇంట్లోనే శానిటైజర్‌ను తయారుచేద్దాం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: