వారి బ్యాటింగ్ లోపాలు సరిదిద్దా

సంజయ్ బంగర్ ముంబై: పేలవమైన బ్యాటింగ్‌తో సతమతమవుతున్న విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ తదితరులు మళ్లీ గాడిలా పడేలా చేసింది తానేనని టీమిండియా మాజీ బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ అన్నాడు. కోహ్లి, రోహిత్‌లు టెక్నిక్ లోపాలతో సరిగ్గా బ్యాటింగ్ చేయలేక పోతున్న సమయంలో వారిని మెరుగైన బ్యాట్స్‌మెన్‌గా తీర్చిదిద్దిన ఘనత తనకే దక్కుతుందని బంగర్ స్పష్టం చేశాడు. ఈ విషయాన్ని కోహ్లి, రోహిత్‌లు కూడా చాలా సార్లు ఒప్పుకున్న విషయాన్ని గుర్తు చేశాడు. అంతేగాక పుజారా, […] The post వారి బ్యాటింగ్ లోపాలు సరిదిద్దా appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.
సంజయ్ బంగర్

ముంబై: పేలవమైన బ్యాటింగ్‌తో సతమతమవుతున్న విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ తదితరులు మళ్లీ గాడిలా పడేలా చేసింది తానేనని టీమిండియా మాజీ బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ అన్నాడు. కోహ్లి, రోహిత్‌లు టెక్నిక్ లోపాలతో సరిగ్గా బ్యాటింగ్ చేయలేక పోతున్న సమయంలో వారిని మెరుగైన బ్యాట్స్‌మెన్‌గా తీర్చిదిద్దిన ఘనత తనకే దక్కుతుందని బంగర్ స్పష్టం చేశాడు. ఈ విషయాన్ని కోహ్లి, రోహిత్‌లు కూడా చాలా సార్లు ఒప్పుకున్న విషయాన్ని గుర్తు చేశాడు. అంతేగాక పుజారా, ధావన్‌లు కూడా నిలకడగా ఆడేలా తనవంతు సలహాలు, చిట్కాలు అందించానన్నాడు.

తనకు అందించిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించేందుకు కృషి చేశానన్నాడు. కాగా, మరోసారి బ్యాటింగ్ కోచ్ పదవి దక్కక పోవడం నిరాశకు గురి చేసిందన్నాడు. అయితే త్వరలోనే ఆ షాక్ నుంచి బయట పడ్డానన్నాడు. త్వరలోనే ఏదో ఒక జట్టుకు కోచ్ బాధ్యతలు నిర్వహిస్తానని తెలిపాడు. కాగా, టీమిండియా వంటి బలమైన జట్టుకు బ్యాటింగ్ కోచ్‌గా వ్యవహరించడం మరచి పోలేని అనుభూతి ఇచ్చిందన్నాడు. మరోవైపు తాజా ఆలోచనలు చేసేందుకు, కుటుం బ సభ్యులతో గడిపేందుకు తనకు తగినంత సమయం లభించిందన్నాడు.

ఇప్పటికిప్పుడూ కోచ్ పదవి బాధ్యత లు నిర్వహించేందుకు తాను ఇష్ట పడడం లేదన్నాడు. మరికొంత వ్యవధి తర్వాతే ఈ విషయంలో తగిన నిర్ణ యం తీసుకుంటానన్నాడు. ఇక, ప్రపంచకప్‌లో ఓటమికి తనను ఒక్కడినే బాధ్యుడిగా చేయడం బాధగా ఉందన్నా డు. సమష్టి నిర్ణయం వల్లే ధోనిని కింది వరుసలో బ్యాటింగ్‌కు దించామన్నాడు. దీనిలో తాను ఏకపక్షంగా నిర్ణ యం తీసుకోలేదన్నాడు. అందరితో చర్చించిన తర్వాతే ధోనిని ఈ ఆర్డర్‌లో పంపించామన్నాడు. అయితే ఇతరులతో పోల్చితే తనపైనే విమర్శలు ఎక్కువగా రావడంతో ఎంతో మనో వేదనకు గురయ్యానని బంగర్ పేర్కొన్నాడు.

How did India select its No 4 Says Sanjay Bangar

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post వారి బ్యాటింగ్ లోపాలు సరిదిద్దా appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.