ఈ ఏడాది సొంతింటి కల అంతంతే!

Own-house

కేవలం 4 శాతం పెరిగిన హౌసింగ్ సేల్స్
ఆర్థిక మాంద్యంతో తీరని ఇంటి కల
ఏడు ప్రధాన నగరాలలో పరిస్థితి

న్యూఢిల్లీ : గడిచిపోతున్న 2019 సంవత్సరంలో గృహ విక్రయాలలో అత్యల్ప పెరుగుదల నమోదు కానుంది. ఈ సారి హౌసింగ్ సేల్స్‌లో కేవలం s4 శాతం ఎదుగుదల ఉందని స్థిరాస్తుల బ్రోకరేజ్ సంస్థ అనారాక్ తన విశ్లేషణలో తెలిపింది. 2019 క్యాలెండర్‌లో ఈ పరిస్థితి కొట్టొచ్చినట్లుగా ఉందని విశ్లేషించారు. దేశంలోని ఏడు ప్రధాన నగరాలలో కేవలం 2.58 లక్షల యూనిట్ల విక్రయాలు నమోదు కానున్నాయి. లిక్విడిటి భారం , అంత కు మించి మొత్తం మీద ఆర్థిక వ్యవస్థ మాంద్యంతో ఇళ్ల కొనుగోళ్లలో పెద్దగా ప్రగతి నమోదు కాలేదని తెలిపారు. ఈ విధంగా 2019 సంవత్సరం దేశ రియల్ ఎస్టేట్ రంగానికి చేదు ఫలితాలను మిగిల్చివెళ్లుతోంది.

హౌసింగ్ సేల్స్‌లో ఎదుగుబొదుగు లేని పరిస్థితి ఉందని వెల్లడించారు. వినిమయ సామర్థ పతనం, పెట్టుబడుల అశక్తత, ఆసక్తి కనబర్చకపోవడం వంటి పరిణామాలు ఈ పరిస్థితికి కారణాలుగా మారాయి. అంతేకాకుండా ప్రప ంచ ఆర్థిక మాంద్యం ప్రభావం కూడా పరిస్థితిని దిగజార్చింది. అనేక కోణాలలో గృహ విక్రయ రంగం ఆశించిన విధంగా ఫలితాలను సాధించలేకపోయిందని స్థిరచరాస్థుల సలహా సంప్రదింపుల సంస్థ అయిన అనారాక్ ఛైర్మన్ అనూజ్ పూరీ తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో దేశ జిడిపి ఆరేండ్లలో ఎప్పుడూ లేని విధంగా నాలుగున్న ర శాతానికి పడిపోయింది.

దీని ప్రకంపనలు రియల్ ఎస్టేట్ రంగంపై పడ్డాయన్నారు. ఈ ఏడాది రియల్ ఎస్టేట్ రంగ తీరుతెన్నులను ఈ సంస్థ విడుదల చేసింది. ఈ సంవత్సరం మొత్తం నాలుగు త్రైమాసికాల ను కలిపి చూసినా సంయుక్త ఫలితం సంతృప్తికరంగా లేదు. చివ రి త్రైమాసికంలో ఆశిస్తున్న 56,200 యూనిట్లను పరిగణనలోకి తీసుకుని మొత్తం విక్రయాలు 2,58,410 యూనిట్లుగా అంచనా వేస్తున్నట్లు, గత ఏడాది మొత్తం యూనిట్ల అమ్మకాలు 2,48,300గా నమోదు అయిందని సంస్థ తెలిపింది. ముంబై మెట్రోపాలిటన్ ప్రాంతం (ఎంఎంఆర్), దేశ రాజధాని ప్రాంతం (ఎస్‌సిఆర్), పుణే, హైదరాబాద్, చెన్నై, కోల్‌కతా నగరాలను పరిగణనలోకి తీసుకుని గృహ విక్రయాలను విశ్లేషించారు.

ఆర్థిక పరిస్థితితోనే ప్రతికూలత

ఈసారి హౌసింగ్ సేల్స్‌లో సరైన ఎదుగుదల లేకపోవడానికి కారణం దేశ ఆర్థిక పరిస్థితి అని విశ్లేషించారు. కుంటుపడుతున్న ఆర్థిక వ్యవస్థ ప్రభావం రియల్ ఎస్టేట్ రంగంలోని ఈ హౌసింగ్ సేల్స్‌పై పడింది. స్థూల ఆర్థిక పరిస్థితి దెబ్బతింటూ ఉండటంతో సూక్ష్మ స్థాయి ఆర్థిక వ్యవహారాలు దెబ్బతింటూ వస్తున్న విషయాన్ని ఈ విశ్లేషణా సంస్థ తెలియచేసింది. లిక్విడిటి సంక్షోభం అంతుపొంతు లేకుండా సాగిందని, దీనితో ఈ ఏడాది రియల్ ఎస్టేట్ రంగం కుంటుపడిందనేది చేదు వాస్తవమని సంస్థ ఛైర్మన్ పూరీ తెలిపారు. విక్రయాలలో పెరుగుదల, పెట్టుబడుల ధోరణి వంటి కీలక అంశాలలో 2019 చాలా వరకూ నిరాశనే మిగిల్చిందని పూరీ వివరించారు.

గృహాల కొనుగోళ్ల పట్ల సరైన వాతావరణం కన్పించలేదని, ఈ ధోరణి సన్నగిల్లిందని, దీనితో ఇళ్లను నిర్మించి ఇచ్చే పెద్ద సంస్థలకు ఈ సంవత్సరం నిరాశజనకంగానే మారిందని వివరించారు. హౌసింగ్ సెక్టర్‌కు సంబంధించి ఈ ఏడాది దాదాపుగా చీకటి కుహరంగానే మారిందని, అయితే ఏడాది చివరిలో ప్రకటించిన ప్రత్యామ్నాయ పెట్టుబడుల నిధి ( ఎఐఎఫ్) పరిధిలో రూ 25,000 కోట్లు కేటాయించడం వల్ల కొంత ఆశారేఖ కన్పించిందని ఛైర్మన్ తెలిపారు. నిలిచిపోయిన గృహ నిర్మాణాలకు, మధ్యస్థ దశలో ఉన్న ఇళ్లకు ఈ నిధి ఉపయుక్తంగా మారిందని వివరించారు.

అయితే చవక ఇళ్ల నిర్మాణంలో ఈ ఏడాది పురోగతి కొనసాగింది. ఏడాది పొడవునా ప్రభుత్వం ఈ దిశలో ప్రకటిస్తూ వచ్చిన పలు రకాల రాయితీలతో చౌక ఇళ్ల నిర్మాణ ప్రక్రియ దెబ్బతినకుండా ఉందని ఛైర్మన్ తెలిపారు. తొలిసారిగా ఇళ్ల కొనుగోలుదార్లకు మరింతగా పన్నుల తగ్గింపును ఈసారి ఏడాదికి రూ 3.5 లక్షల వకూ కల్పించారు. 2020 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి తీసుకునే రూ 45 లక్షల తక్కువ రుణాలపై ఈ వెసులుబాటు కల్పించారు. దీనితో కొంత మేర ఇళ్ల నిర్మాణంలో పరిస్థితి మెరుగు అయింది.

Housing Sales Hikes 4 Percent in India

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ఈ ఏడాది సొంతింటి కల అంతంతే! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.