మూలిగే ముసుగు దయ్యం

రాత్రి 12.55 నిమిషాలు అయ్యింది. గోరక్‌పూర్ ఎక్స్‌ప్రెస్ స్పీడుగా వెడుతోంది. రానున్న హాల్టు జలగామ్ జంక్షన్ రైల్వేస్టేషన్. దిగాల్సిన ప్రయాణీకులు దిగిపోవడానికి బ్యాగ్‌లతో డోర్ వద్దకు చేరుతున్నారు. అప్పుడు సీట్లోంచి లేచాడు విక్రమ్‌దత్(38) అతడెదురు సీట్లో కూర్చున్న యువతి కూడా లేచి నిలబడింది. అప్పుడే ఆమె సెల్ రింగ్ అయ్యింది. రిసీవర్ చెవికి అద్దుకుని “ రైట్‌టైమ్ చేరాను. కానీ, ఇంటికి పోలేను. ఆ మూలుగు దయ్యం నా వెంట పడుతుంది. నాకు డెవిల్సు అంటే పరమభయం” […] The post మూలిగే ముసుగు దయ్యం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

రాత్రి 12.55 నిమిషాలు అయ్యింది. గోరక్‌పూర్ ఎక్స్‌ప్రెస్ స్పీడుగా వెడుతోంది. రానున్న హాల్టు జలగామ్ జంక్షన్ రైల్వేస్టేషన్. దిగాల్సిన ప్రయాణీకులు దిగిపోవడానికి బ్యాగ్‌లతో డోర్ వద్దకు చేరుతున్నారు.
అప్పుడు సీట్లోంచి లేచాడు విక్రమ్‌దత్(38) అతడెదురు సీట్లో కూర్చున్న యువతి కూడా లేచి నిలబడింది. అప్పుడే ఆమె సెల్ రింగ్ అయ్యింది.
రిసీవర్ చెవికి అద్దుకుని “ రైట్‌టైమ్ చేరాను. కానీ, ఇంటికి పోలేను. ఆ మూలుగు దయ్యం నా వెంట పడుతుంది. నాకు డెవిల్సు అంటే పరమభయం” పక్కవారికి వినపడేలా చెప్పింది.
ఆమె మాట్లాడుతుంటే విక్రమ్‌దత్ ఆశ్చర్యంగా వెనక్కి తిరిగి చూసాడు. ఇవేవి పట్టించుకోకుండా తను చెప్పాల్సింది ఫోన్‌లో చెప్పుకుంది.
“నేను స్టేషన్‌లోనే ఉండిపోతాను. వేకువజామున వెడతాను. లేకుంటే డెవిల్ ఎటాక్ తప్పదు.”
“ ప్లీజ్ డెవిల్ అంటున్నారు. నిజంగా డెవిల్స్‌కోస మే మాట్లాడుతున్నారా? లేక ఎవరైన విలన్‌ను డె విల్ అంటున్నారా?” విక్రమదత్ చొరవగా అడిగాడు.
ఆమె చిరాగ్గా చూసింది.“మీకెందుకు నా విషయం. మీ పని మీరు చూసుకోండి.”
అప్పటికే ట్రయిన్ స్టేషన్‌కు ముందే సిగ్నల్ లేనందున ఆగింది.
“ ప్లీజ్! నే చెప్పింది వినండి. నేను కొత్తగా వచ్చిన ఇన్‌స్పెక్టర్‌ని ఈ రోజు కాకపోయినా రేపయినా మీ లాంటివాళ్లకు ఇలా దయ్యాలు, మానవమృగాల నుంచి కాపాడాలి. అందుకే మిమ్మల్ని అడిగాను.” చెప్పాడు విక్రమ్‌దత్.
చెబుతుండగానే ఆయన సెల్ రింగ్ అయ్యింది.
సెల్‌లో మాట్లాడాడు.“ స్టేషన్‌లో వెహికల్‌తో రెడీగా ఉన్నారా? దగ్గరకు వచ్చేసాను” చెప్పి సెల్ పాకెట్‌లో పెట్టుకున్నాడు.
“ మీరు ఇన్‌స్పెక్టరా? ఓకే సార్, జస్టు ఇరిటేడ్ అయ్యాను. ఒంటరిగా కన్పిస్తున్నందుకు చొరవ తీసుకుంటున్నారనుకున్నాను. నేను ఫోన్‌లో నా స్నేహితురాలికి నా బాధ చెప్పుకున్నాను. లేని డెవిల్సు క్యారెక్టర్ సృష్టించకే” అని అరుస్తోంది.
“మీ భయం మీది. ఆమెకు ఏం తెలుస్తుంది.”
“ నిజంగా డెవిల్స్ ఉన్నాయి సార్, నేను సైన్సు పోస్టు గ్రాడ్యుయేటిని, డెవిల్‌తో నా అనుభవం నాకుంది. అవి పరమవికృతంగా ఉంటాయి. నాకు ఎదురయ్యే డెవిల్ ముసుగేసుకుని మూలుగుతుంది. అది మనిషి మూలుగులా ఉండదు. కుతికే కాకిస్వరంతో హడలెత్తిస్తుంది.”
ట్రయిన్ కదలలేదు. ఆమె ఒక సీటులో కూర్చుని ఆసక్తిగా చెప్పసాగింది. ఇష్టం లేకున్నా విక్రమదత్ వినసాగాడు.
రైల్వేకార్టర్సుకు ఆనుకుని ఉన్న సన్నపాటి రోడ్డులోంచి వెడితే మా ఇల్లును వేగిరం చేరుకోవచ్చు. నేను డిగ్రీ చేస్తున్నప్పుడు ఇలాగే రాత్రి రైల్ దిగాను. ఒక్కదాన్నే నడుచుకుంటూ వెడుతుంటే శిధిలమైన నాలుగిళ్ల ముందు ఒక చెట్టు కింద నేలకు అంటుకునే మంచంపై ముసుగుతన్ని నిద్ర పోతున్న ఒకామె అదేపనిగా మూలగసాగింది.
విక్రమ్‌దత్ దయ్యానికో కథ కూడా ఉందా? అన్నట్లు ఆమెను కొరకొర చూసాడు. పైగా, అందమైన ముఖంలో భయం పులుముకుని చెబుతుంటే ప్రదర్శిస్తున్న లుక్సు చూడాలనిపించి సన్నపాటి నవ్వు రుద్దుకుని మరీ చూసాడు.

“వినండి సార్! మీరు అన్యమనస్కులయితే నేను చెప్పేది మీతలకెక్కదు. ఏమయ్యిందంటే ముందుకు వెళ్లాల్సిన నేను వెనక్కివచ్చి చెట్టుకింద మంచంపై ముసుగుతన్ని నిద్రపట్టక మూలుగుతున్న ఆమెను చేత్తో కదిపాను.”
ఆమెకెదురు సీట్లో కూర్చుని చెవులు రిక్కించి విన్నాడు.
“ఏమయ్యింది? దయ్యం కాదు మనిషే అని తెలిసిందా?”
“ అక్కడికే వస్తున్నాను. ఆ ముసుగులో నా చేతికి ఏమీ తగలడం లేదు. మరెలా కప్పుకున్న దుప్పట్లో మనిషి ఉన్నట్లు ఉబ్బెత్తుగా ఉంది? ఆశ్చర్యపోయాను. మొత్తం ముసుగంతా తడిమాను. తల దగ్గర మాత్రం తల అనిపించేలా చేతికి తగిలింది.”
విక్రమదత్ ఆశ్చర్యంగా చూసాడు.
ముసుగులో తల మంచం పైన ఉంది. బాడీ మంచం నాళ్లు లూజ్ అయిపోయి నేలమీద జారాయి కాబోలని మంచం కిందకు వంగి చూసాను. కిందకు బాడీ జారనేలేదు. మూలుగు మరింత కీచుగా వెలువడుతునే ఉంది.
“ మీకు అప్పటికి దయ్యం అనిపించలేదా?”
“ మంచి ప్రశ్న వేసారు. ఏదైనా పోలీస్ హెడ్ మీది. నాకు అప్పటికి దయ్యాలంటే నమకం లేదు. ఆత్మలన్నా అసలు ఖాతరు లేదు. అప్పట్లో మరీ యూత్ కదా”
ఇద్దరు నవ్వుకున్నారు. అప్పటికి ఇంకా ట్రయిన్ అవుటర్——————లోనే ఉండిపోయింది. కంపార్టుమెంటుల్లో ప్రయాణీకులు రుసరుసలాడుతున్నారు. అవేవి పట్టించుకోకుండా ఆ యువతి తన దయ్యం గోలలో మిగిలిన పార్టు చెప్పడానికి గొంతు సవరించింది.
“ ఇంతకీ మీ పేరు అడగనే లేదు. చెబుతారా? వద్దనుకుంటే చెప్పకండి”
“ శ్రీలా నాకు మా పేరెంట్సు షార్టునేమ్ పెట్టారు.”
“ అప్పుడేం చేసారు?” రియల్‌స్టోరీలోకి ఆమెను ఎగదోసినట్టు ఎగదోసాడు.
“ ఏముంది సార్, ఏ కష్టమొచ్చిందో అవిశ్రాంతంగా మూలుగుతోందని ముసుగు లాగేసాను. దూరాన వెలిగే స్ట్రీట్‌లైట్ క్రీ నీడలో నేలకు అంటుకునే మంచంపై మొండెంలేని పెద్దతలను చూసాను. ఒక్కసారి ఠారెత్తిపోయాను. చేతిలో బ్యాగ్ జారిపోయింది. ఏమి చేయాలో తోచలేదు. వెనక్కి తిరిగి పరుగులు తీసాను. చీర అడ్డం కాగా పడి పోయాను. ఆ వెంటనే లేచి చీర ఎత్తుకుని పరుగులు తీసాను. ఎలా చేరానో మూడు వీధుల్లో కనిపించిన రోడ్ల వెంబడి పరుగులు తీసాను. నా వెంట కుక్కలు వెంటపడ్డాయి. చివరికి నా ఇల్లు చేరి గేటు ముందు పడిపోయాను. నోటితో గాలి పీలుస్తూ గేటుకు చేరబడి అరచి గీపెట్టాను.” ఆమె గతాన్ని గుర్తుచేసుకుని మరీ టెన్షన్‌గా చెప్పింది.
విక్రమ్‌దత్ ఈసారి వినడంలో ఆసక్తిని కనబరిచాడు.
“ మొండెం లేని తల నీకు ఆ ముసుగులో కన్పించిందా?”
“ అవును సార్, నేను చెప్పింది రియల్ స్టోరీ.”
ట్రయిన్ కదిలింది. అంతా హడావుడిగా దిగేటప్పుడు స్టేషన్‌లో తోసుకుదిగినట్లు దిగేసారు.
ఇన్‌స్పెక్టర్ విక్రమ్‌దత్, శ్రీలా ఇద్దరు కూడా స్టేషన్ ఇవతలకి వచ్చారు. కానిస్టేబుల్ ఎదురొచ్చి శాల్యూట్ చేసాడు. “ మీరు జాయిన్ అయ్యేటప్పుడు కలుసుకోలేక పోయాను. లీవులో ఉన్నాను సార్, రండిసార్‌” అని వాన్ వైపుకు దారి చూపాడు.
“ ఈమె చెప్పిన రోడ్డులో మన వెహికిల్ వెళ్తుందా లేదా ఈమెతో మాట్లాడి చెప్పు.” రోడ్డు గురించి చెప్పమని ఆమెకు సైగ చేసాడు ఇన్‌స్పెక్టర్.
ఆమె చెప్పగా వెడుతుంది. ఇరుకురోడ్లే. మన వెహికిల్ ఓకే సార్ అని స్టీరింగ్ ముందు కూర్చున్నాడు. ఇద్దరు వెనుకనే కూర్చున్నారు.
వాన్ రైల్వేక్వార్టర్సు రోడ్డులో సాగింది.
ఆమె కళ్లు డెవిల్‌ను చూసిన శిధిలమైన ఇంటికోస ం ఆత్రంగా ఎప్పుడు వస్తుందాని చూడసాగాయి.
క్రీగంట ఆమెను పరికించాడు విక్రమ్‌దత్.
ఆమె చెప్పిందాంట్లో నిజముందనిపించింది. విద్యావంతురాలు పొరపాటు పడదు. లేనిపోనివి చెప్ప దు. పోలీసులు నమ్మని ఏకైక క్షుద్రశక్తి దయ్యం. తను ఇప్పుడు చూడడానికి ఉత్సుకత ఈమె కారణంగా కనబరుస్తున్నాడు. అంతగా నమ్మించింది.
అంతలోనే ఆమె స్టాప్‌స్టాప్ అని అరిచింది.
కానిస్టేబుల్ స్లోచేసి ఆపేశాడు.
శ్రీలా ఇన్‌స్పెక్టర్‌పై పడి“ అదిగోండి సార్ ఆ ఇల్లే. ఆ ప్లేస్‌లో ముసుగుతన్ని నిద్రపోతున్న తలలేని మొండెం దయ్యం” అని చూపింది.
ఇన్‌స్పెక్టర్ విక్రమ్‌దత్ చొరవగా దిగి ఆ ఇంటి ముందుకు వెళ్లాడు. నేలకు అంటుకున్నమంచంపై తెల్లని ముసుగు కప్పుకుని మూలుగుతున్న ఆడగొంతు కీచుగా విన్పించేసరికి ఏదో తెలియని తడబాటు కలిగింది.
ఇన్‌స్పెక్టర్ నాకు అండగా, కానిస్టేబుల్ తోడుగా ఉంటే మొండెంలేని తల దయ్యం ఏమిచేస్తుంది? అని తనకు తానే ధైర్యం తెచ్చుకుని మంచంవైపు చూస్తూ శ్రీలా గుడ్లప్పగించింది.
విక్రమ్‌దత్ ముందుకు అడుగులు వేసి ముసుగు తడిమాడు. కానిస్టేబుల్ కూడా కళ్లు సాగదీసుకుని చూసాడు. చేతికి ఏమీ తగల్లేదు. శ్రీలా చెప్పింది నిజమే. మొత్తం తడిమాడు. తల దగ్గర వరకు ఏమీ లేదు. విక్రమ్‌దత్ గుండెల్లో వేగం పెరిగింది. మూలుగులు ముసుగులోంచి వినపడుతునే ఉన్నాయి.
అక్కడ భయంకరమైన నిశ్శబ్దం అలుముకుని ఉంది. అప్పటికే కానిస్టేబుల్ రెండు అడుగులు వెనక్కి వేసి శ్రీలా పక్కనుంచి చూడసాగాడు.
విక్రమ్ ముసుగు లాగేసి పక్కన పడేసాడు. పెద్దతలకాయ దూరాన స్ట్రీట్ లైట్ వెలుగుల్లో చిమ్మచీకట్లో భీతిగొలిపేలా ఉంది.
దాహమేస్తోంది నీళ్లివ్వు అని ఆ తలలేని మొండెం కీచుగా అరిచింది. దాంతో ఇన్‌స్పెక్టర్‌కు మెడమీద వెంట్రుకలు నిటారుగా లేచిపోయాయి. ఒక్కక్షణం కూడా అక్కడ నిలవలేని అధైర్యం అలుముకుంది. వెనుదిరిగిపోయాడు.
ఆ వెంటనే కానిస్టేబుల్ వాన్‌లోకి దూరాడు. శ్రీలా కూడా వాన్ ఎక్కేసింది. ఎంతగా ట్రైచేసినా వాన్ స్టార్టు కాలేదు.
మొండెం లేని తల నిప్పులు కురిపిస్తూ మంచంపై నిటారుగా లేచి నింగిలో నిలబడింది. మూలుగు పెద్దగా విన్పించింది.
“ వాన్ సరిగ్గా స్టార్ట్ చెయ్‌” అని ఇన్‌స్పెక్టర్ అరిచి చెప్పాడు.
కానిస్టేబుల్ తలదించుకుని స్టార్టు చేసి ముందుకు స్పీడుగా పోనిచ్చాడు.
“ శ్రీలా నీ ఇల్లు చూపించు. సేఫ్‌గా దించేసి వెళ్లిపోతాం. రేపు మాట్లాడుదాం.” చెమటలు ఒత్తుకుంటూ చెప్పాడు.
“ శ్రీలా తను తొలిసారి చూసిన దానికంటే ఇప్పుడు ఎక్కువగా భయపడింది. ఆమె ఇంటిముందు దించేసి, వెనుదిరిగాడు ఇన్‌స్పెక్టర్ విక్రమ్‌దత్.
తిన్నగా తను పోలీస్ క్వార్టర్సులో తనకు ఎలాట్ చేయబడిన హవుస్‌కు వెళ్లిపోయాడు.———————————-
మద్యం పుచ్చుకున్నా నిద్రపట్టలేదు. ఎంత మరిచిపోదామనుకున్నా మొండెం లేని తల దయ్యం కన్పిస్తునే ఉంది. దీనిబట్టి దయ్యాలున్నాయి. దాంతో బాటే ఆత్మలున్నాయి. క్షుద్రవిద్యలున్నాయి. క్షుద్రపిశాచాలున్నాయి అని నమ్మే స్థితికి వచ్చేసాడు. అలా ఇలా నిద్రపోయాడు.
ఉదయం ఠాణాకు వెళ్లాడు. అక్కడ నైట్‌డ్యూటీ కానిస్టేబుల్ కూడా ఉన్నాడు.
అతడిని పిలిచి మనం రాత్రి చూసింది “ నిజమేనా? లేక నా భ్రమ!” అని అడిగాడు.
“నిజమే సార్, నూటికి నూరుపాళ్లు నిజం. ఆ డెవిల్ గురించి మొత్తం చెప్పడానికి రైల్వేపోలీస్ హెడ్‌కానిస్టేబుల్ ఒకాయన ఇప్పుడు వస్తారు.”
కొంతసేపటికి రానేవచ్చాడు.
రాత్రి తాము చూసింది చెప్పాడు ఇన్‌స్పెక్టర్ .
“ స్టార్ రైల్వే ట్రాక్ పక్కన ఉన్న చోట్లలో ఇలాంటి కథలు చెలామణిలో ఉంటాయి. నమ్మితే దయ్యం లేకుంటే లేదు. మీరు నిన్నటి వరకు నమ్మలేదు. అందుకే మీకు కన్పించలేదు. దాన్ని వెతుక్కుంటూ వెళ్లారు. మీకు కన్పించింది. ఒకింత భయపడి ఉంటారు. ఇదివరలో ఆ శిధిలమైన ఇంటి ముందు ఒక నాళ్లు మంచంపై అర్థరాత్రి వేళల్లో ముసుగుతన్ని మూలిగే దయ్యం కథ. ఇప్పుడు చూడండి ఆ మంచం అక్కడ ఉండదు. ప్రతి అమావాస్యనాడు మీరు చూసిన డెవిల్ కన్పిస్తుంది. ఓ అమావాస్యరోజు ట్రయిన్‌కింద ఒక యువతి ఆత్మహత్య చేసుకుంది. ఆమె తల తెగినా కొద్దిసేపటివరకు అటుఇటు చూసి పెదాలు నాలుకతో తడుపుకుంటూ దాహమన్నట్లు చూసింది. దాంతో అంతా భయపడ్డారు. కొన్ని సెకన్లు అలా తలలో జీవం ఉండడమే ఆమె దయ్యం అయ్యిందని చెప్పుకునేవారు. ఇన్‌స్పెక్టర్ విక్రమ్‌దత్ నవ్వి తలపంకించాడు.

 horror stories in Telugu

                                                                               99852 65313, యర్నాగుల సుధాకరరావు

Related Images:

[See image gallery at manatelangana.news]

The post మూలిగే ముసుగు దయ్యం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.